ఇంద్రజిత్తు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Victory of Meghanada by RRV.jpg|right|thumb|200px|మేఘనాదుని విజయం.<br>[[రాజా రవివర్మ]] గీసిన చిత్రం.]]
'''[[ఇంద్రజిత్తు]]''' (సంస్కృతం: इन्‍द्र जीत) [[రావణాసురుడు|రావణాసురుడికి]] [[మండోదరి]]కి జన్మించిన కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు [[మేఘం]] ఉరిమిన పిడుగు శబ్దం వలే ఉండడం వల్ల వీనికి '''మేఘనాదుడు''' అని నామకరణం చేశారు. [[స్వర్గం|స్వర్గానికి]] వెళ్ళి [[ఇంద్రుడు|ఇంద్రుడిని]] జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు. ఈ సందర్భంగా [[బ్రహ్మ|పరమేష్ఠి]] అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని సంపాదిస్తాడు. యుద్ధ సంగ్రామంలో అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చెయ్యగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం. ఇంద్రజిత్తు యొక్క సంగ్రామ చాతుర్యాన్ని [[వాల్మీకి]] మహర్షి [[రామాయణం]] [[యుద్ధకాండ]]లో వర్ణిస్తారు.
 
[[రాముడు|రామ]] రావణుల మధ్య జరిగిన మహాయుద్ధములో ఇంద్రజిత్తు చురుకైన పాత్రను పోషించాడు. ఇంద్రజిత్తు ఆ యుద్ధములో రామలక్ష్మణులను [[నాగపాశము]]తోనాగపాశముతో బంధించాడు. అయితే [[గరుడుడు]] వారిని నాగాపాశమునుండి విడిపించాడు. ఇంద్రజిత్తు ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు యజ్ఞము చేసి వెళ్లేవాడు. ఆ యజ్ఞమహిమ వలన ఈయనను యుద్ధంలో ఓడించటం ఎవరివల్లా సాధ్యంకాదు. ఆ యజ్ఞాన్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి ఏకైక మార్గమని గ్రహించిన [[లక్ష్మణుడు]] యజ్ఞానికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధాన్యంలో ఉండగా చంపాడు.
 
ఇంద్రజిత్తు ఆదిశేషుని కుమార్తె అయిన [[సులోచన]] (ప్రమీల) ను వివాహమాడినాడు. కొందరు ఆదిశేషుడు లక్షణ అంశ అని భావిస్తారు. ఈ విధముగా ఇంద్రజిత్తు లక్ష్మణుని అల్లుడని చెప్పవచ్చు. ప్రమీల నాగకన్య.
[[File:Killing of Indrajit Painting by Balasaheb Pant Pratinidhi.jpg|thumb|ఎడమ|ఇంద్రజిత్తు మరణం]]
 
"https://te.wikipedia.org/wiki/ఇంద్రజిత్తు" నుండి వెలికితీశారు