"భారత దేశం" కూర్పుల మధ్య తేడాలు

{{ముఖ్య వ్యాసము|భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు}}
 
భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది [[జంబూ ద్వీపం]]. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ [[హిందూమతము|హిందూ]] మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, [[కృష్ణ|కృష్ణా]] [[గోదావరి|గోదావారీ]] మధ్య స్థానే......). జంబూ అంటే "[[నేరేడు]]" పండు లేదా "[[గిన్నె కాయ]]", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది.
: ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "[[భరతుడు]]". ఇతను [[విశ్వామిత్రుడు|విశ్వామిత్ర]], [[మేనక]]ల కుమార్తె అయిన [[శకుంతల]] యొక్క కుమారుడు.
తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధుానది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధుానదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.
[[మధ్యప్రదేశ్|మధ్య ప్రదేశ్‌]] లోని [[భింబెట్కా]] వద్ద లభ్యమైన [[రాతియుగం|రాతియుగపు]] శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. క్రి.పూ. 7000 సమయంలో, మొట్టమొదటి నియోలిథిక్ స్థావరాలు పశ్చిమ పాకిస్తాన్ లో మెహర్గర్ మరియు ఇతర ఉపఖండపు ప్రాంతాల్లో కనిపించింది. ఈ విదంగా సింధుాలోయ నాగరికత అభివృద్ధి, దక్షిణ ఆసియాలో మొదటి పట్టణ సంస్కృతి అభివృద్ధి చెందాయి. ఇదే [[క్రీ.పూ.26 వ శతాబ్దం]] మరియు [[క్రీ.పూ.20 వ శతాబ్దం]] మధ్య కాలంలో వర్ధిల్లిన [[సింధులోయ నాగరికత]]. [[క్రీ.పూ.5 వ శతాబ్దం]] నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతంలో, [[మౌర్య సామ్రాజ్యం]], భారతీయ సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. [[అశోకుడు]] ఈ వంశంలోని ప్రముఖ రాజు. తరువాతి వచ్చిన [[గుప్త వంశం|గుప్తుల]]కాలం '''స్వర్ణ యుగం '''గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో [[చాళుక్యులు]], [[చేర]], [[చోళులు]], [[పల్లవులు]], [[పాండ్యులు]] మొదలగువారు పాలించారు. [[విజ్ఞాన శాస్త్రము]], [[భారతీయ కళలు|కళలు]], [[భారతీయ సారస్వతం|సారస్వతం]], [[భారతీయ గణితం]], [[భారతీయ ఖగోళ శాస్త్రం]], [[భారతీయ సాంకేతిక శాస్త్రం|సాంకేతిక శాస్త్రం]], [[భారతీయ మతములు]], [[భారతీయ తత్వ శాస్త్రం]] మొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని [[ఢిల్లీ సుల్తానులు]], తరువాత [[మొగలు సామ్రాజ్యం|మొగలులు]] పాలించారు. అయినా, ముఖ్యంగా దక్షిణాన స్థానిక సామ్రాజ్యాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి.
 
రెండవ సహస్రాబ్ది మధ్యలోమధ్యల, [[పోర్చుగీసు|పోర్చుగల్]], [[ఫ్రెంచి|ఫ్రాన్స్]], [[బ్రిటిషు|ఇంగ్లండు]] వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు [[ఈస్ట్ ఇండియా కంపెనీ]]పై [[1857]]లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన [[ప్రథమ స్వాతంత్ర్య సమరం]]) తరువాత, భారతదేశంలోని అధిక భాగం [[బ్రిటిషు సామ్రాజ్యం]] కిందకు వచ్చింది. జాతిపిత [[మహాత్మా గాంధీ]] నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ [[భారత స్వాతంత్ర్య సమరం|స్వాతంత్ర్య సమరం]] ఫలితంగా [[1947]] [[ఆగష్టు 15]]న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. [[1950]] [[జనవరి 26]]న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.
 
విభిన్న జాతులు, విభిన్న మతాలతో కూడిన దేశంగా భారతదేశం - జాతి, మత పరమైన సంఘర్షణలను చవిచూసింది. అయినా, తన లౌకిక, ప్రాజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. [[1975]], [[1977]] మధ్యకాలంలో అప్పటి [[ప్రధానమంత్రి]] [[ఇందిరా గాంధీ]] విధించిన [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] కాలంలో మాత్రమే [[పౌర హక్కులు|పౌర హక్కులకు]] భంగం వాటిల్లింది. భారత దేశానికి [[చైనా]]తో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా [[1962]]లో [[చైనా యుద్ధం 1962|యుద్ధం]] జరిగింది. [[పాకిస్తాన్]]తో [[భారత పాకిస్తాన్ యుద్ధం 1947|1947]], [[భారత పాకిస్తాన్ యుద్ధం 1965|1965]], మరియు [[భారత పాకిస్తాన్ యుద్ధం 1971|1971]]లోను యుద్ధాలు జరిగాయి. [[అలీనోద్యమం]]లో భారతదేశం స్థాపక సభ్యురాలు. [[1974]]లో, భారత్ తన మొదటి [[అణు పరీక్ష]]ను నిర్వహించింది. [[1998]]లో మరో ఐదు పరీక్షలు నిర్వహించింది. [[1991]]లో జరిగిన [[ఆర్ధిక సంస్కరణలు|ఆర్ధిక సంస్కరణల]]తో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారింది.
స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక భాగం, కేంద్ర ప్రభుత్వంలో [[భారత జాతీయ కాంగ్రెసు]] పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం అతిపెద్ద రాజకీయ పక్షం కావడం చేత, స్వాతంత్ర్యం తరువాత దాదాపు 40 ఏళ్ళపాటు దేశరాజకీయాల్లో కాంగ్రెసు గుత్తాధిపత్యం వహించింది. [[1977]]లో [[జనతా పార్టీ]]గా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇటీవలి కాలంలో, భారత ఓటర్లపై గల పట్టును కాంగ్రెసు పార్టీ కోల్పోతూ వచ్చింది. [[సార్వత్రిక ఎన్నికలు 2004|2004 సార్వత్రిక ఎన్నికలలో]] అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెసు పార్టీ, వివిధ చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందూ వాద పార్టీ అయిన [[భారతీయ జనతా పార్టీ|భాజపా]] ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా [[1996]] తరువాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలేకాగా 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదిశాతం లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం కూడా కష్టంకాగా భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటిసారిగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం.
 
''ఇంకా చూడండి '':
* [[భారత దేశపు రాజకీయ పార్టీలు]]
* [[భారత ఎన్నికల విధానం]]
{{seemain|భారత జనాభా వివరాలు}}
 
భారత దేశము, [[చైనా]] తరువాత ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా గల దేశం. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా యొక్క సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - [[ముంబై]] (వెనుకటి ''బాంబే''), [[ఢిల్లీ]], [[కోల్కతా]] (వెనుకటి ''కలకత్తా''), మరియు [[చెన్నై]] (వెనుకటి ''మద్రాసు ''), హైదరాబాద్
 
భారత దేశం యొక్క ఆక్షరాస్యత 74.04%, ఇందులో పురుషుల అక్షరాస్యత 82.14% మరియు మహిళల అక్షరాస్యత 53.7%. ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారు.
దేశంలో రైలు మార్గాలు అతిముఖ్యమైన రవాణా సౌకర్యము. 1853 లో [[ముంబాయి]] నుండి [[థానే]] మధ్య ప్రారంభమైన రైలు మార్గము ప్రస్తుతం 62 వేల కిలోమీటర్లకు పైగా నిడివిని కల్గి ఉంది. [[భారతీయ రైల్వే]] 17 జోన్లుగా విభజితమై ఉంది.
=== [[అఖండ భారత్]] రైలు===
[[ఢాకా]]-[[ఢిల్లీ]]-[[లాహోర్]] రైలు. [[ఇస్లామాబాద్]]: భారత్, [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్‌]]ల మధ్య తిరిగే రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. దక్షిణాసియా దేశాల మధ్య రైలు సర్వీసులు ప్రారంభించాలనే భారత ప్రతిపాదనకు పాకిస్థాన్ పచ్చజెండా వూపింది. మూడు దేశాలను కలుపుతూ రైళ్లను నడిపిస్తామని భారత రైల్వేశాఖ పంపిన ప్రతిపాదనకు పాక్ రైల్వే మంత్రిత్వ శాఖ సాంకేతిక అనుమతిని మంజూరు చేసింది.ఢాకా-ఢిల్లీ-లాహోర్‌ల మధ్య రైలు నడిపించటం లాభదాయకమేననీ, అవసరమైతే కరాచీ, ఇస్లామాబాద్ వరకూ పొడిగించుకోవచ్చని నిపుణులు సూచించినట్లు పాక్ రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా కంటైనెర్ రైళ్లను నడిపించి, తర్వాతి దశలో ప్రయాణికుల బండ్లను నడిపించాలనే యోచనలో ఉన్నారు. ఇటీవల ఇస్లామాబాద్-టెహ్రాన్-ఇస్తాంబుల్ రైలు సర్వీసును ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేయటంతో భారత రైల్వేశాఖకు ఈ కొత్త ఆలోచన వచ్చింది. దక్షిణాసియా రైళ్ల వల్ల పాకిస్థాన్, ఇతర సార్క్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ప్రయోజనాలు నెరవేరతాయని మనదేశం ప్రతిపాదనల్లో వెల్లడించింది. దీనివల్ల నేపాల్, భూటాన్ వంటి దేశాలకూ రైలు సర్వీసులు నడిపించవచ్చని సూచించినట్లు తెలిసింది. దక్షిణాసియా రైలు సర్వీసులు వాణిజ్యపరంగా ప్రయోజనకరమేనని నిపుణులు సైతం కితాబునిస్తున్నారు. ఈ మార్గంలో రైళ్లను నడిపించటమూ తేలికేననీ పేర్కొంటున్నారు. భారత్, పాక్, బంగ్లాదేశ్‌లలో బ్రిటిష్ పాలకులు రైలు మార్గాలను నిర్మించినందువల్ల మూడు దేశాల్లోనూ బ్రాడ్‌గేజి రైలు పట్టాలు ఉండటం, నిర్వహణ శైలీ ఒకేమాదిరిగా ఉండటం కలిసివస్తుందని అభిప్రాయపడుతున్నారు. [http://209.85.229.132/search?q=cache:NuEPbK3c838J:www.eenadu.net/archives/archive-14-9-2009/story.asp]
 
=== రోడ్డు మార్గాలు ===
* అత్యధిక ప్రధాన మతాలకు పుట్టినిల్లయిన దేశం
* 7,517 కిమీ సముద్రతీరం కలదు
India is largest Republic.
 
== సంస్కృతి ==
{{seemain|భారతీయ సంస్కృతి}}
ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించేది భారతదేసమే. దేశంలో అన్నిటికంటే ప్రముఖమైనది [[ముంబై]]లో నెలకొన్న [[హిందీ సినిమా పరిశ్రమ]]. అధిక సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్న ఇతర భాషా పరిశ్రమలు - [[తెలుగు]], [[తమిళం]], [[మలయాళం]], [[కన్నడ]] మరియు [[బెంగాలీ]]. బెంగాలీ సినిమా దర్శకుడైన [[సత్యజిత్ రే]] ప్రపంచ సినిమా రంగానికి భారత్ అందించిన ఆణిముత్యం.
 
[[వరి]] అన్నం మరియు [[గోధుమ]] (బ్రెడ్, రొట్టెల రూపంలో) లు ప్రజల ముఖ్య ఆహారం. విభిన్న రుచులు, మసాలాలు, పదార్థాలు, వంట విధానాలతో కూడిన [[భారతీయ వంటలు]] ఎంతో వైవిధ్యమైనవి. ఎన్నో రకాల శాకాహార వంటలకు దేశం ప్రసిద్ధి చెందింది. [[భారతీయ దుస్తులు|భారతీయ ఆహార్యం]] కూడా ఆహారం వలెనే బహు వైవిధ్యమైనది. [[చీర]], [[సల్వార్ కమీజ్]] స్త్రీలు ఎక్కువగా ధరించే దుస్తులు. పురుషులు [[పంచె]], [[కుర్తా]] ధరిస్తారు.
 
''ఇంకా చూడండి '':
* [[భారత్‌లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా]]
* [[భారతీయ శిల్పకళ]]
. [[చదరంగం]]లో [[విశ్వనాథన్ ఆనంద్]] రెండు పర్యాయాలు ప్రపంచ టైటిల్ సాధించగా, [[టెన్నిస్]]లో [[లియాండర్ పేస్]],[[మహేష్ భూపతి]], [[సానియా మీర్జా]]లు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు సాధించిపెట్టారు.ప్రస్తుతము ఆడుతున్నవార్లలో [[సైన నెహవల్]] చెప్పుకోదగినది. [[భారతదేశము]] [[ఒలింపిక్‌ క్రీడలు]] లాంటి అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పెద్దగా రాణించలేదు. గత మూడు ఒలంపిక్‌ క్రీడలలో కేవలం ఒక్కొక్కటే [[పతకం]] సాధించగలిగినది. ఆసియా క్రీడలలో కూడా చిన్న చిన్న దేశాల కంటే మన పతకాలు చాలా తక్కువ. [[కబడ్డీ]]లో మాత్రం వరుసగా బంగారు పతకాలు మనమే సాధించాము.
 
కొన్ని సాంప్రదాయ ఆటలు అయిన [[కబడ్డీ]], [[ఖో-ఖో]] మరియు [[గోడుంబిళ్ళ (గిల్లీ-దండా) ]]లకు దేశమంతటా బహుళ ప్రాచుర్యము ఉంది. [[చదరంగము]], [[క్యారమ్‌]], [[పోలో]], మరియు [[బ్యాడ్మింటన్‌]] మొదలైనటువంటి అనేక క్రీడలు భారతదేశంలో పుట్టాయి. [[ఫుట్‌బాల్‌ (సాకర్‌) ]]కు కూడా యావత్‌ భారతదేశంలో చాలా ప్రజాదరణ ఉంది.
 
== జాతీయ చిహ్నములు ==
{{main|భారత జాతీయతా సూచికలు}}
* జాతీయ పతాకము : [[భారత జాతీయ పతాకం|త్రివర్ణ పతాకము]]
* జాతీయ ముద్ర : [[భారత జాతీయ చిహ్నం|మూడు తలల సింహపు బొమ్మ]]
* జాతీయ గీతం : [[జనగణమన]]....
* జాతీయ గేయం : [[వందేమాతరం]]....
* జాతీయ పక్షి : [[నెమలి]]పావో క్రిస్టాటస్
* జాతీయ జంతువు : [[పెద్దపులి]] ([[రాయల్ బెంగాల్ టైగర్]])
* జాతీయ వృక్షం : [[మర్రిచెట్టు]]
* జాతీయ క్రీడ : NO GAME
* జాతీయ పుష్పం : [[కమలము]] (తామర)
* జాతీయ క్యాలెండర్ : [[శక క్యాలెండర్]] (శక సం.పు క్యాలెండర్)
* జాతీయ ఫలం : [[మామిడి పండు]]
 
== శెలవు దినాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2188214" నుండి వెలికితీశారు