మయన్మార్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
}}
== ప్రవేశిక ==
బర్మదేశం అగ్నేయాసియా దేశలలో ఒకటి. బర్మాదేశానికి [[భారతదేశం]], [[బంగ్లాదేశ్]], [[చైనా]], [[లావోస్]] మరియు తాయ్ లాండ్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. మొత్తం సరిహద్దు 1,930 కిలోమీటర్ల (1,200) పొడవులో మూడవ వంతు అడ్డంకులు లేని [[బంగాళా ఖాతం]] మరియు [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్]] సముద్రతీరం ఉన్నాయి. [[దక్షిణాసియా]] దేశాలలో ఇది పొడవులో 2వ స్థానంలో ఉంది. బర్మా జనసాంద్రతలో ప్రపంచంలో[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో 24వ స్థానంలో ఉంది. బర్మా జనసంఖ్య 5.88 కోట్లు.
 
దక్షిణాసియాలో ప్రాచీన నాగరికత కలిగిన దేశాలలో బర్మా ఒకటి. బర్మాలో ప్యూ మరియు మాన్ నాగరికతలు ప్రాచీన నాగరికతలలో కొన్ని. క్రీ.శ 9వ శతాబ్దంలో ఇర్రవడ్డి లోయల ఎగువభాగానికి బర్మన్స్ సామ్రాజ్యమైన '''నాంఝయో''' ప్రవేశం మరియు క్రీ.శ1050 లో జరిగిన '''పాగన్''' సామ్రాజ్యపు విస్తరణ కారణంగా బర్మీయుల సంస్కృతి మరియు భాషా ఈ దేశంలో ఆధిక్యత ప్రారంభం అయింది. ఈ సమయంలో తెరవాడ బుద్ధిజం క్రమంగా ఈ దేశంలో ప్రధాన మతంగా మారింది. 1277-1301 కాలంలో సంభవించిన మంగోలుల దండయాత్ర వలన '''పాగన్''' సామ్రాజ్యం పతనం కావడంతో రాజ్యం ముక్కలుగా అయి చిన్న రాజ్యాలు తలెత్తాయి. 16వ శతాబ్ధపు రెండవ భాగంలో తౌంగో సామ్రాజ్య అవతరణ వలన తిరిగి సమైక్యం అయింది. అయినా దక్షిణాసియాలో అతి స్వల్ప కాలం పాలన సాగించిన సామ్రాజ్యంగా '''తౌంగో సామ్రాజ్యం ''' చరిత్రలో నిలిచిపోయింది. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని ఆధునిక బర్మా అలాగే అస్సాం, మణిపూర్ లతో చేర్చి '''కొంబౌంగ్'''సామ్రాజ్య ఆధీనంలోకి వచ్చింది. 1824-1885 తరువాత సంభంవించిన మూడు వరుస యుద్ధాల అనంతరం బర్మాదేశం బ్రిటిష్ సామ్రాజ్య కాలనీ రాజ్యంగాగా మారింది.
 
బ్రిటిష్ పాలన దేశంలో [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]], [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]], [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] మరియు ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థగా ఉన్న బర్మా దేశంలో పాలనా పరమైన మార్పులను తీసుకు వచ్చింది. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా దేశంలో సంభవించిన అంతర్యుద్ధాల కారణంగా బర్మాదేశం అతి దీర్ఘకాలం అంతర్యుద్ధాలు ఎదుర్కొన్న దేశంగా కూడా బర్మాదేశం చరిత్రలో నిలిచింది. దేశంలో మైరియాడ్ సంప్రదాయ సమూహాల సమరం ఇంకా ముగింపుకు రాలేదు. 1962- 2011 వరకూ దేశం సైనిక పాలనలోనే ఉంది. 2010లో సారస్వతిక ఎన్నికలను నిర్వహించిన తరువాత 2011లో రద్దు చేయబడి ప్రజాపాలన స్థాపించ బడింది.
 
బర్మా అధిక వనరులు ఉన్న దేశం. అయినప్పటికీ 1962లో జరిగిన ఆర్థిక సంస్కరణల అనంతరం ఆర్థికంగా స్వల్పంగా అభివృద్ధి చెందిన దేశంగా బర్మాదేశం మిగిలి పోయింది. $42.953 బిలియన్లగా ఉన్న బర్మాదేశపు జి డి పి 2.9% సంవత్సరిక అభివృద్ధి మాత్రమే సాధింధించింది. మికాంగ్ రాజ్యాలలో ఇది అతి తక్కువ వృద్ధిరేటు ఇదే. ఇతర దేశాలతో చేరి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] మరియు [[కెనడా]] దేశాలు బర్మాకు ఆర్థిక సాయం ప్రకటించాయి. ప్రంపంచంలో అరోగ్య సంరక్షణా స్థితి హీనంగా ఉన్న దేశాలలో బర్మా అరోగ్య సంరక్షణా స్థితి ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ బర్మా ఆరోగ్య సంస్థను 190వ స్థానంలో గుర్తించింది.
 
అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు పలు సంస్థలు బర్మాదేశంలో మనవహక్కుల అతిక్రమణ స్థిరంగా జరుగుతున్నట్లు నివేదించాయి. స్వాతంత్ర్యం లేక పోవడం, బాలకార్మికులు, మానవ రవాణా మొదలైనవి వాటిలో కొన్ని.
== నామ చరిత్ర ==
బర్మా మరియు మయన్మార్ అనే పేర్లు అధికంగా ఉన్న బర్మీయులు మరియు బామర్ సాంస్కృతిక ప్రజల వలన వలన వచ్చినవే. '''మాయన్మార్''' సంప్రదాయ సమూహాల వ్రాత రూపం పేరు వలన మయన్మార్ అనే పేరు వచ్చింది. ప్రజలు వ్యవహారికంగా మాట్లాడుకునే బామర్ భాష వలన బర్మా అనే పేరు వచ్చింది. నమోదు చేసుకున్న పేరును బామా లేక మియామా అని పలకబడుతుంది. [[బ్రిటిష్]] పాలనా కాలంలో ఇది బర్మాగా పిలువబడింది.
 
1989లో సైనిక ప్రభుత్వం అధికారికంగా అనేక ప్రదేశాల ఆంగ్ల రూప నామాలను మార్చింది. ఈ మార్పులలో ఒకటిగా దేశం పేరు కూడా మయన్మార్‌గా మార్చబడింది.
కాని ఈ మార్పులు ఇంకా పూర్తిగా ప్రజామోదం పొందబడ లేదు. సైనిక ప్రభుత్వం చేత మార్చబడిన ఈ మార్పులను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు మరియు దేశాలు దీనిని ఎదిరిస్తూ ఇంకా బర్మా అన్న పేరునే వాడుతున్నారు. ఇతర సంప్రదాయ సమూహాలు కూడా ఈ మార్పును అంగీకరించ లేదు.
 
అమెరికా సంయుక్తదేశాలు, [[ఆస్ట్రేలియా]], కెనడా మరియు [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్డమ్]] బర్మా అన్న పేరునే వాడుతున్నాయి. యునైటెడ్ నేషన్స్, దక్షిణ ఆసియా దేశాలు, [[జర్మనీ]], [[నార్వే]], [[చైనా]], [[భారత దేశము|ఇండియా]], [[బ్రెజిల్]] మరియు [[జపాన్]] దేశాలు మయన్మార్‌ను ఉపయోగిస్తున్నాయి.
 
== చరిత్ర ==
పూరాతత్వ శాస్త్రజ్ఞులు సాక్ష్యాల ఆధారంగా బర్మా ప్రాంతాలలో 750,000 సంవత్సరాలకు పూర్వం ఆదిమానవుడు (హోమో ఎరెక్టస్) నివసించినట్లు భావించబడుతుంది. అలాగే ఆదిమానవులైన హోమో స్పైన్స్ క్రీ.పూ 11,000 సంవత్సరాల మునుపే నివసించబడినట్లు భావించబడుతుంది. అదిమానవుడు పాతరాతి యుగంలో మొక్కలు, జంతువుల పెంపకం అలవాటు చేసుకుని జీవించిన ఆధారంగా ఇక్కడ మెరుగు పెట్టబడిన రాతి పని ముట్లు ఇక్కడ కనిపించాయి.
క్రీ.పూ 1500 సంవత్సరాల నాటికి ఈ ప్రాంతంలోని ప్రజలు రాగి, ఇత్తడి వాడకం, బియ్యం ఉత్పత్తి అలాగే కోళ్ళు పందుల పెంపకం పెంచడం ఆరంభించారు. వీరు ప్రపంపంచంలోని ప్రథమ మానవులని భావిస్తున్నారు. క్రీ.పూ 500 నాటికి ఇనుప యుగం ఆరంభం అయింది. ప్రస్తుతపు మండలే దక్షిణ ప్రాంతంలో ఇనుప పని ఒప్పందాలు మొదలైనాయి. క్రీ.పూ 500- 200 సమయంలో పెద్ద గ్రామాలు మరియు చిన్న నగరాలలో [[బియ్యము|బియ్యం]] తయారీ ఒప్పందాలు కూడా చేసుకుని పరిసర ప్రాంతాలలో చైనాతో కూడా చేర్చి వాటిని విక్రయించిన సాక్ష్యాధారాలు కూడా లభ్యం అయ్యాయి.
 
క్రీ.పూ 2వ శతాబ్దంలో మొదటగా గుర్తింపబడిన నగరాలు బర్మా సేశపు మధ్యభాగంలో మొలకెత్తినట్లు భావిస్తున్నారు. టిబెట్టన్ - బర్మా మాట్లాడే ప్యూ నాగరిక సమూహాలు దక్షిణదిశగా వలస వచ్చిన కారణంగా నగరాలు రూపుదిద్దుకున్నాయని తెలిపే ఆధారాలు యున్ననన్‌లో ఉన్నాయి. ప్యూ సంస్కృతిక ప్రజలు భారతదేశంతో అధికంగా వ్యాపార సంబంధాలతో ప్రభావితులైయారు. అలాగే బౌద్ధమతాన్ని దిగుమతి చేసుకోవడమే కాక సాంస్కృతిక, వాస్తురూప, రాజకీయ వ్యూహాలతో వారిని ప్రభావితులని చేసాయి. ఆది తరువాత బర్మీయుల సంస్కృతి మరియు రాజకీయ సంస్థల మీద కూడా శాశ్వతమైన ప్రభావం చూపింది. క్రీ.శ.78లో ప్రపంచమంతా చుట్టిన గ్రీకుయాత్రికుడు భారతదేశం నుంచి చైనా వరకూ బర్మా మీదుగా వ్యాపారమార్గం ఉండేదని వ్రాశారు. 3వ శతాబ్దిలో భారతదేశం నుంచి [[అసోం|అస్సాం]], బర్మాల మీదుగా చైనాకు మార్గం ఉండేదని చంపా అనే శాసనం ద్వారా తెలుస్తోంది. క్రీ.శ.5వ శతాబ్దిలో ఇండోచైనాలో చంపా, కాంబోజ అనే ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు నెలకొన్నాయి. 5వ శతాబ్ది నాటి వ్యు శాసనం నుంచి అంతకు రెండు మూడువందల యేళ్ళకు పూర్వమే హిందూమతం వ్యాపించిందన్న విషయం తెలుస్తోంది. సంస్కృత, ప్రాకృత భాషల్లోని అనేకమైన పదాలు కూడా ఇక్కడి భాషల్లోకి వచ్చి చేరాయి. ఆపైన మహాయాన బౌద్ధం కూడా బర్మాలో ప్రవేశించింది. క్రీ.శ.450లో హీనయానబౌద్ధ బోధకుడైన [[బుద్ధఘోషుడు]] ఈ ప్రాంతంలో మతప్రచారం చేశారు<ref name="భారతీయ నాగరికతా విస్తరణము">{{cite book|last1=రామారావు|first1=మారేమండ|title=భారతీయ నాగరికతా విస్తరణము|date=1947|publisher=వెంకట్రామా అండ్ కో|location=సికిందరాబాద్, వరంగల్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Bharatiya%20Nagarikatha%20Vistaranamu&author1=Maremanda%20Rama%20Rao&subject1=&year=1947%20&language1=telugu&pages=94&barcode=2020120003970&author2=&identifier1=&publisher1=VENKAT%20RAMA%20AND%20CO&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20KRISHNA%20DEVARAYA%20ANDHRABHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20%20HYD.&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0003/972|accessdate=9 December 2014}}</ref>. క్రీ. శ 9వ శతాబ్ధానికి పలు నగరాలు ఈ ప్రాంతమంతా మొలకెత్తాయి. మెట్టప్రాంతాలైన బర్మా మధ్య ప్రదేశంలో ప్యూ జాతీయుల నగరాలు సముద్రతీర ప్రాంతంలో మాన్ జాతీయులు మరియు పడమటి తీరప్రాంతాలలో '''ఆర్కనాస్''' జాతీయుల నగరాలు వెలిసాయి. ప్యూ సంప్రదాయ ప్రజలు క్రీ.శ 750-830 నిరంతర నంజయో రాజ్యం నుండి ఎదురైన పలు దండయాత్రల కారణంగా నగరాల విస్తరణ దెబ్బతిన్నది. 9వ శతాబ్ధపు మధ్య నుండి చినరి వరకు నంజయోకి చెందిన '''మార్మా''' (బర్మా/బామర్) వారు పాగన్ (బెగాన్) వద్ద ఒక ఒప్పందానికి వచ్చారు.
 
== సామ్రాజ్య వ్యవస్థ ==
పాగన్ క్రమంగా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను కలుపుకుంటూ విస్తరించింది. ఇలా విస్తరిస్తూ చివరకు 1050-1060 నాటికి అనావ్రహతా పాగన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇర్రావడ్డి లోయలో దాని సరిహద్దులలో ఇదే మొదటి సంఘటిత రాజ్యం. దక్షిఆణాసియాలో ప్రధాన భూములలో 12వ -13వ శతాబ్దంలో పాగన్ సామ్రాజ్యం మరియు ఖ్మర్ సామ్రాజ్యం అనేవి ప్రధాన అధికారం కలిగి ఉన్నాయి. ఇర్రవడ్డీ లోయలో బర్మీయుల సంస్కృతి మరియు భాషా క్రమంగా ఆధిక్యత అభివృద్ధి చెందుతూ 12వ శతాబధానికి ప్యూ, మాన్ మరియు పాలి నిబంధనలను అధిగమించారు. క్రమంగా గ్రామస్థాయిలో ప్రారంభమైన తెరవాడ బుద్ధిజం తాంత్రికం, మహాయానం, బ్రాహ్మానిక్ మరియు అనిమిస్ట్ కార్యక్రమాలు ఈ ప్రాంతమంతా వ్యాపించాయి. పాగన్ పాలకులు మరియు ఐశ్వర్యవంతులు పాగన్ రాజధానిలో మాత్రమే 10,000 బౌద్ధ ఆలయాలు నిర్మించబడ్డాయి. 1277-1301 సంభవించిన వరుస మంగోలియన్ యుద్ధాల వలన 4 శతాబ్ధాల సామ్రాజ్యం 1287 నాటికి పాగన్ పతనం చెందింది.
 
ప్రారంభంలో 1385-1424 వరకు అవా సాగించిన [[యుద్ధాలు]] ఒకే రీతిగా జరిగినా అవి పాత సామ్రాజ్య యుద్ధరీతులకు విరుద్ధంగా సాగాయి. అవా నాయకత్వంలో హాంతవడ్డీ తన స్వర్ణయుగంలో ప్రవేశించింది. తరువాత 350 సంవత్సరాల కాలం అరకాన్ అధిపత్యం కొనసాగింది. తరువాతి కాలంలో పలు రీతులలో నిరంతరం సాగిన యుద్ధాల కారణంగా అవా బాగా బలహీన పడింది. 1481 నాటికి రాజ్యం చిన్నాభిన్నం అయింది. 1527 షాన్ సంయుక్త రాష్ట్రాలు అవా రాజ్యాన్ని జయించి ఎగువ బర్మా ప్రాంతాన్ని 1555 వరకు పాలించారు.
 
పాగన్ సామ్రాజ్యం లాగా అవా, హంతవడ్డి మరియు షాన్ రాష్ట్రాలలో పలు - సాంస్కృతిక రాజకీయ విధానాలు కొనసాగాయి. ఒక వైపు యుద్ధాలు సాగుతున్నా నాగరికతలూ కొనసగుతూనే ఉన్నాయి. బర్మా నాగరికతలో ఈ సమయం స్వర్ణ యుగంగా భావించబడుతుంది. బర్మీయుల [[సాహిత్యం]] ఆత్మవిశ్వాసంతో ప్రజాదరణతో విభిన్న శైలితో అభివృద్ధి చెందింది. రెండవ తరం బర్మీయుల చట్టం పాన్-బర్మా పేరుతో వెలువడ్డాయి. హంతవడ్డీ సామ్రాజ్యం మతసంస్కరణలను ప్రవేశపెట్టాయి. తరువాత అవి దేశమంతా పాకాయి. ఈ కాలంలోనే అద్భుతమైన మ్రౌక్ యు ఆలయాలు అనేకం నిర్మించబడ్డాయి.
=== తౌంగూ సామ్రాజ్యం ===
పాత అవాలోని అతి చిన్న రాష్ట్రమైన తౌంగో రాజు ప్రయత్నంతో 1580 నాటికి రాజకీయ సమైక్యతతో ఏర్పడిన '''బేఇన్నౌంగ్ ''' సామ్రాజ్యంలోకి తిరిగి ప్రవేశించింది. 1541 నాటికి యువకుడైన తౌంగో రాజు తబిన్‌ష్వేతి శక్తివంతమైన హంతవడ్డిని ఓడించింది. తరువాత నాయకుడైన బేఇన్నంగ్
"https://te.wikipedia.org/wiki/మయన్మార్" నుండి వెలికితీశారు