కాగితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:ManilaPaper.jpg|thumb|300px|కాగితపు దొంతు.]]
'''కాగితం''' ([[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]], [[జర్మన్ భాష|జర్మన్]] Papier; [[స్పానిష్ భాష|స్పానిష్]], [[పోర్చుగీస్]] Papel; [[ఆంగ్లం]] Paper; [[ఇటాలియన్]] Carta) ఒక బహుళ ఉపయోగకరమైన పలుచని వస్తువు. ఇవి ముఖ్యంగా వ్రాయడానికి, ముద్రించడానికి, పాకింగ్ కోసం వాడతారు. ఇవి ప్రకృతిలో [[మొక్క]]లనుండి లభించే [[సెల్యులోజ్ లేదా కణోజు]] పోగులతో తయారుచేయబడుతుంది. వీటిలో [[వెదురు]] అన్నింటికన్నా ముఖ్యమైనది. పత్తి, నార లైనిన్, వరి వంటి కూడా ఉపయోగిస్తారు.
== చరిత్ర ==
క్రీ.పూ. 3500 సంవత్సరం ప్రాంతంలో పురాతన ప్రపంచంలో రాయడం కోసం వాడబడిన వస్తువు "పేపిరస్" అనే పదం నుండి "పేపర్" వచ్చింది.<ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/Kagitam_katha.htm</ref> ప్రాచీన ఈజిప్టులోని ప్రజలు రాయడానికి ఒక కాడ నుండి ఈ పేపిరస్ తయారుచేయబడేది. దృఢత్వానికీ, [[ఎడారి]]లోని పొడిగాలికీ అనువైన పేపిరస్ పైన నమోదైన పాత రికార్డులు యింకా లభిస్తున్నాయి. వాటి వల్ల మనం గత [[నాగరికత]]ల గురించి చక్కగా తెలుసుకోగలుగుతున్నాము. పురాతన కాలంలో గొర్రె లేక [[మేక]] తోలునుండి తయారుచేసిన తోలు కాగితం కూడా రాయడానికి ఉపకరించేది. తోలు కాగితంగానీ రాసే పేపరస్‌గానీ ఖరీదైనవి. చాలా తరచుగా తక్కువ ఖరీదైన చిన్న మైనపు పలకలకు అవి భర్తీ చేయవడ్డాయి. చాలాసార్లు శుభ్రంగా గీకివేసి మళ్ళీ రాతకు వాడుకునేలాగ జంతువుల తోళ్ళు ఉపకరించాయి. హాన్ వంశపు రాజులు సాహితీ, మత, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు వికసించడానికి ప్రోత్సహించారు. పరిపాలన ప్రయోజనాల కోసం కవిలెల్ని (రికార్డులను) అట్టే పెట్టుకోవడం అవసరమనిపించింది. ఆ కాలం ప్రమాణపత్రాలు పొడుగైన సన్నని కర్రముక్కలపైన, పట్టుగుడ్డ ముక్కలపైన లిఖించబడేవి. కాగితం చైనాలో క్రీ.శ. 105లో కనుగొనబడింది. హూటై చక్రవర్తి వద్ద ఉద్యోగి అయిన టిసైలున్ దీనిని కనిపెట్టాడు. మల్బెరీ చెట్టు ఆకులు, ఇతర పీచులు, చేపల్ని పట్టే చిరిగిపోయిన వలలు, పాత గుడ్డ పీలికలు, [[జనపనార]] చెత్తలతో యితను ఒక కాగితాన్ని తయారుచేశాడు. పట్టుగుడ్డ మీదకంటే అలా చేయబడ్డ కాగితం పైన రాయడం చాలా సులువైంది. తక్కువ ఖర్చుతో ఏ కష్టమూ లేకుండా అది తయారైంది కూడా. అతి ప్రాచీనమైన చైనా కాగితంలో కనబడే ముక్కలు ముతకగా, దళసరిగా నేడు అనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/కాగితం" నుండి వెలికితీశారు