"ఇడ్లీ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:ఆంధ్ర వంటకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి
 
[[దస్త్రం:DSC01368.JPG|thumb|ఇడ్లీలు]]
'''[[ఇడ్లీ]]''' ([[ఆంగ్లం]]: Idli or Idly) [[దక్షిణ భారత దేశం]]లో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. [[మినప పప్పు]] మరియు బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి [[ఆవిరి]]తో ఉడికించి తయారుచేస్తారు. మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని[[శక్తి]]<nowiki/>ని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.
 
సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి [[చట్నీ]] లేదా [[సాంబారు]] లేదా కారంపొడిగానీ, పచ్చడితో[[పచ్చడి]]<nowiki/>తో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు ప్రపంచంలోని[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.<ref>http://completewellbeing.com/article/the-light-list/</ref>
 
==పుట్టు పూర్వోత్తరాలు==
[[బొమ్మ:Idli1.jpg|thumb|ఇడ్లీ|left]]
 
దోశకు మరియు వడకు తమిళ దేశాన రెండు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలదు కానీ, ఇడ్లీ మాత్రము విదేశీ దిగుమతి. సాహిత్యములో[[సాహిత్యము]]<nowiki/>లో తొలిసారి ఇడ్లీ వంటి వంటకము యొక్క ప్రస్తావన (ఇడ్డలిగే) [[920]]లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే [[కన్నడ]] రచనలో ఉంది. ఆ తరువాత [[1130]]లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి [[మూడవ సోమేశ్వరుడు]] రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము ''[[మానసోల్లాస]]''లో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడింది. అయితే ఈ రచనలలో ఆధునిక ఇడ్లీ తయారీకి ప్రధాన భాగలైన మినపప్పుతో పాటు బియ్యపుపిండి కలపడము, పిండిని పులియబెట్టడము, పిండి పొంగడానికి ఆవిరిపట్టడము మొదలైన విషయాల గురించిన ప్రస్తావన లేదు.
[[బొమ్మ:IDli.jpg|thumb|right|ఇడ్లీ-వడ, [[తిరుపతి]] దగ్గరలోని [[శ్రీనివాస మంగాపురం]] దగ్గర రోడ్డుపక్క హోటలు నుండి.]]
 
తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు. ప్రస్తుతము ఈ పేరు వాడకం తగ్గినది.
 
[[చైనా]] యాత్రికుడు [[హుయాన్ త్సాంగ్]] (7వ శతాబ్దము) రచనల వలన [[భారత దేశము]]లో ఆ కాలములో ఆవిరిపట్టే పాత్రలు లేవని తెలుస్తున్నది కానీ భారతీయులు మరుగుతున్న గిన్నెపై బట్టకప్పి ఆవిరిపట్టి ఉండవచ్చని భావిస్తారు. ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు అందులో ఇడ్లీకి పోలికలున్న కేడ్లీ అనే వంటకము కూడా ఉంది. 800 - 1200 మధ్య కాలములో [[ఇండోనేషియా]]కు హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులు, అవిరిపెట్టే పద్ధతులు మరియు వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ కచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు.
 
==విశేషాలు==
[[కంచి]] దేవరాజ స్వామి ఆలయంలో ఒకటిన్నర కిలో బరువున్న ఇడ్లీ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందుకోసం [[బియ్యము|బియ్యం]], [[మిరియాలు]], [[కొత్తిమీర]], [[అల్లం]], [[ఇంగువ]], [[జీలకర్ర|జీలకర్]]<nowiki/>ర, తగినంత [[పెరుగు]] కలిపి మెత్తగా రుబ్బి ఓ పెద్ద ఇడ్లీగా వేసి ఆవిరి మీద ఉడికిస్తారు.
 
కేరళలోని [[పాలక్కాడ్]] జిల్లాలోని రామస్సెరి అనే గ్రామం ఇడ్లీలకు పెట్టింది పేరు. స్పాంజిలా మృదువుగా ఉండే ఈ ఇడ్లీ ఒకటో శతాబ్దం నుంచీ ఒక [[కుటుంబము|కుటుంబం]] ఈ విధానాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికీ కట్టెలపొయ్య మీద బట్ట కట్టిన మట్టి పాత్రలోనే ఇడ్లీని వండుతారు.<ref>ఈనాడు ఆదివారం, 14 జులై, 2013, పుట 16</ref>
==ఇవి కూడా చూడండి==
*[[రవ్వ ఇడ్లీ]]
1,86,230

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2191945" నుండి వెలికితీశారు