బమ్మెర పోతన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:658A:BF14:0:0:1BF2:A0A1 (చర్చ) చేసిన మార్పులను Nrgullapalli యొక్క చ...
పంక్తి 11:
అంతట పోతన గురువు ఉపదేశము చొప్పున నియమముతో తారకమంత్ర జపముచేసి, ఆజపమహిమవలన పరమజ్ఞాన సంపన్నుఁడును మహాకవియును ఆయెను. ఆశ్రమములయందెల్ల గృహస్థాశ్రమము మేలు అయినది అని తలచి, కులశీలవయోరూపముల తనకు తగిన ఒక కన్యకను పరిగ్రహించి, సంతానమును పడసి, లోకోపకారముగా ఒక పురాణమును తెనిఁగింపఁగోరి ఎల్ల పురాణములయందును [[భాగవతము]] ఉత్తమము అని విచారించి దానిని తెనిఁగించుచు ఉండఁగా వేమభూపాలుని వద్ద ఆస్థానపండితుఁడును ఇతనికి అనుబంధుఁడును అయిన శ్రీనాథుఁడు ఇతఁడు భాగవతమును తన యేలిన వానికి అంకితముగా చేయింపవలెను అని పల్లకిమీఁద ఎక్కి ఒంటిమిట్ట పొలిమేర చేరరాఁగా అచ్చట దున్నపోతులను కట్టిన అరకను పూని చేను దున్నుచు ఉన్న పోతరాజు కొడుకును ఆచేని గనిమ మీఁద కూర్చుండి భాగవతము వ్రాయుచు ఉన్న పోతరాజును అతనికి కనఁబడిరి.
 
వారిని చూచి తాను సరస్వతీ ఉపాసకుఁడు కనుక తన మహిమ పోతనకు తెలుపవలెను అని ఎంచి పల్లకి మోచుచు ఉన్న బోయీలను పిలిచి మీరు ఒక ప్రక్క పల్లకి కొమ్మును వదలి రండి అని చెప్పెను. వారు అట్లే చేయఁగా దున్నుచు ఉన్న మల్లన ఒక తట్టుమాత్రము బోయీలు మోపఁగా వచ్చుచు ఉన్న పల్లకిని చూచి "నాయనా ఇదియేమిపరబగాఇదియేమి వింతగా ఉన్నది" అని తండ్రిని అడిగెను. అప్పుడు పోతన "అబ్బీ! నీవును ఒక తట్టు కట్టిన దున్నపోతును విడిచి దున్నుము" అని చెప్ప అతఁడు అట్లుచేసెను. అది చూచి శ్రీనాథుఁడు రెండవ కొమ్మును గూడవదలి పల్లకిని అంతరమున విడువుఁడు అని బోయీలకు ఉత్తరవు చేసెను. అది మల్లన చూచి "నాయనా రెండవతట్టును బోయీలులేక పల్లకి ఉత్తబయల నడచి వచ్చుచు ఉన్నది చూచితివా?" అనెను. "అట్ల అయిన నీవును రెండవదున్నను వదలి దున్నుము" అని చెప్పెను. అతఁడు ఆప్రకారముచేసెను.
 
అంతట శ్రీనాథుఁడు పోతన ఉన్నచోటికి దాపుగా వచ్చి [[హాలికుడు|హాలికు]]<nowiki/>లో అని పరిహసించెను. అది విని పోతన
"https://te.wikipedia.org/wiki/బమ్మెర_పోతన" నుండి వెలికితీశారు