"గుమ్మలూరి సత్యనారాయణ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
[[ఆకాశవాణి]]లో [[వ్యవసాయం|వ్యవసాయ]] ప్రసారాలకు నాందీ [[ప్రవచనం]] చేసిన ప్రముఖులలో శ్రీ '''గుమ్మలూరి సత్యనారాయణ''' ఆద్యులు. 1966 జూన్ లో తొలకరినాడు [[విజయవాడ]] కేంద్రం నుండి [[వ్యవసాయం|వ్యవసాయ]] కార్యక్రమాలు ' పంటసీమలు ' పేర ప్రారంభించబడ్డాయి. సత్యనారాయణ ఆ కార్యక్రమాల తొలి ప్రయోక్త. అప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో మూడు దశాబ్దులు (1937-66) పనిచేశారు. [[పాడిపంటలు (పత్రిక)|పాడిపంటలు]] మాసపత్రికలో కొంతకాలం పనిచేశారు. రాష్ట్ర వ్యవసాయ సమాచార విభాగాధికారిగా, బాపట్ల వ్యవసాయ కళాశాల ఉపన్యాసకులుగా, [[చెన్నై|మదరాసు]] స్పెషల్ వెజిటబుల్ డెమాన్‌స్ట్రేటర్ గా [[సామర్లకోట]] ఫారం మేనేజరుగా వ్యవహరించారు.
 
1911 జూన్ 3న [[శ్రీకాకుళం జిల్లా|శ్రీకాకుళం]] జిల్లా [[సంగం]] అగ్రహారంలో సత్యనారాయణ జన్మించారు. [[కోయంబత్తూరు]] వ్యవసాయ కళాశాల నుండి 1934లో వ్యవసాయ పట్టభద్రులై కొంతకాలం శాంతి నికేతన్ లో రవీంద్ర కవీంద్రుని అంతేవాసిగా చేరారు.
1,90,374

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2192952" నుండి వెలికితీశారు