మగధీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
17వ శతాబ్దంలో తనను ప్రేమించిన విషయం తనకి తెలుసంటూ, ఆ విషయం ఇప్పుడైనా చెప్పమంటూ రాకుమారి ([[కాజల్ అగర్వాల్]]) అభ్యర్థించడంతో సినిమా ప్రారంభమౌతుంది. తన అంగరక్షకుడు, ప్రేమికుడు ఐన కాలభైరవ ([[రామ్‌చరణ్ తేజ్]]) కోసం చేయిజాస్తుంది. అప్పటికే ఆమె కొండకొమ్ముపై రక్తిసిక్తమై ఉంటుంది, అతని స్థితీ అదే. అతను చేయందించే సరికి ఆమె తుళ్ళిపోయి లోయలోకి జారిపోతుంది. హతాశుడైన కాలభైరవ ఆమె కోసం పరుగులెత్తి దూకేస్తాడు. చివరకి వారిద్దరూ పడిపోవడంలోనూ ఒకరి కోసం ఒకరు చేయిజాపుతూంటారు, కానీ కలుసుకోకుండానే పడి మరణిస్తారు. అతని స్నేహితుడు షేర్ ఖాన్ ([[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]]) కాలభైరవ రక్షణ కవచానికి చితి అంటించి, దిగిపోతున్న సూర్యుణ్ణి చూస్తూ "కమ్ముకొస్తున్న చీకటిని చీల్చుకుంటూ మళ్ళీపుడతావురా భైరవా" అంటూండగా సన్నివేశం ముగుస్తుంది.
 
21వ శతాబ్దంలో దూసుకువస్తున్న బైక్ రేసర్ హర్ష ([[రామ్‌చరణ్ తేజ్]])పై మళ్ళీ కథ కొనసాగుంది, హర్ష సిటీలో జరిగే కష్టమైన పోటీల్లో కూడా విజయం సాధిస్తూంటాడు. విదేశాల్లో బైక్ రేసుల్లో పాల్గొనేందుకు హర్ష వానలో ఆటోలో వెళ్తూంటాడు. అతను వాన వల్ల ఏర్పడ్డ మసకలో ఓ అమ్మాయి ఆటోను ఆపేందుకు చేయి ఊపడం చూస్తాడు, ఆటో నిండిపోయిందని చేయివూపి చెప్పే ప్రయత్నం చేస్తాడు. అనుకోకుండా అతని వేళ్ళు, ఆమె వేళ్ళకు తగులుతాయి, హర్ష ఆ స్పర్శలో విద్యుత్ ప్రవాహం అనుభూతి చెందుతాడు, దాంతో పాటుగా కొన్ని దృశ్యాలు కూడా కనిపిస్తాయి. తర్వాత, ఆమెను చేరుకునేందుకే జన్మించానన్నంత భావం కలిగి, ఆమె కోసం తిరిగివచ్చి ఆ బస్టాప్ లో ఆమె వేసుకున్న డ్రస్ రంగు బట్టి ఆరాతీస్తాడు. ఆమె అప్పుడే వాన వల్ల రెయిన్ కోట్ వేసుకోవడంతో ఆమె గురించి ఆమెనే అడుగుతాడు. ఆమె పేరు ఇందూ, అంటూండే ఇందిర ([[కాజల్ అగర్వాల్]]) అని తెలుస్తుంది. ఇందు, తనను చూడకుండానే డ్రెస్ చూసి వెంటపడడం ఆసక్తిగా అనిపించి, అతనికి ఇందును పరిచయం చేస్తానని కట్ చేయకుండా కొనసాగిస్తుంది. అయితే ఎలాంటివాడో తెలియదు కనుక తప్పుదోవ పట్టిస్తూంటుంది. ఆమె, ఆమె స్నేహితులు అతనికి ఇందుపై ఉన్న ప్రేమని అవకాశంగా తీసుకుంటారు. ఇంతలో ఇందు కుటుంబంతో సంబంధాలు తెగిపోయిన బావ రఘువీర్ ([[దేవ్ గిల్]]) ఆమె తండ్రి కేసువేయడంతో అతన్ని చంపేద్దామని వస్తాడు. అయితే ఇందును చూసి వెర్రెక్కిపోయి, ఆమెను పెళ్ళిచేసుకునేందుకు తమ కుటుంబాల మధ్య ఉన్న వివాదం వల్ల కుదరదని, తను చస్తే తప్ప ఇందు తండ్రి మాట్లాడడని చెప్పడంతో, తండ్రినే చంపేస్తాడు. తండ్రి చనిపోయిన విషయం చెప్తూ ఆ వంకతో ఇందును, ఆమె తండ్రిని మోసం చేసి ఇంట్లో స్థానం పొందుతాడు. నిద్రపోతున్న ఇందును ముట్టుకుందామని ప్రయత్నించగానే, ఓ కంటికి కనిపించని యోధుడు తన గొంతు కోసేస్తున్న అనుభూతి పొందుతాడు. రఘువీర్ ఈ విషయమై తాంత్రికుడైన ఘోరా ([[రావు రమేష్]]) ని కలుస్తాడు. అతని పూర్వజన్మలో ఇందూని మోహించిన రాకుమారుడనీ, యోధుడైన ఆమె ప్రేమికుడి చేతిలో చనిపోయాడని చెప్తాడు. అతను కూడా మళ్ళీ పునర్జన్మ పొందాడని, అతన్ని రఘువీర్ చంపితే తప్ప ఇందూని ముట్టుకోలేవని చెప్తాడు. అతన్ని కనిపెట్టి, చంపి ఇందూని దక్కించుకోవాలని రఘువర్రఘువీర్ నిర్ణయించుకుంటాడు. ఇంతలో ఇందు, ఆమె స్నేహితులు తనని ఆటపట్టిస్తున్నట్టు తెలుసుకుని ఆమె తనను ప్రేమిస్తున్న విషయం తెలుసుకుంటాడు హర్ష.
 
వారిద్దరి ప్రేమ గురించీ తెలుసుకున్న ఇందూ తండ్రి, వారికి పెళ్ళిచేయాలని నిశ్చయించుకుని రఘువీర్, హర్షలకు చెప్తాడు. ఇందూ కింద లేని సమయం చూసుకుని ఇందూ తండ్రిని చంపి ఆ నేరాన్ని హర్ష మీద నెట్టేస్తాడు. హెలీకాఫ్టర్ మీద అప్పటికప్పుడు ఇందూను తీసుకుని వాళ్ళ కోటకు వెళ్ళిపోతూండగా, రఘువీర్ మనుషుల్ని కొట్టి అగ్ని ప్రమాదం ఎదుర్కొని మరీ హెలీకాఫ్టర్ కు వేళ్ళాడుతూ వెళ్తాడు హర్ష. ఇందూ చేయి తగలడంతో మళ్ళీ ఆ అనుభూతికి లోనై హెలీకాఫ్టర్ మీంచి పడిపోతాడు. ఓ సరస్సులో పడిపోతూ దాదాపు మృత్యువును దగ్గర నుంచి చూస్తాడు. ఆ సమయంలో ఇందూ చేతి స్పర్శ వల్ల అతనికి పూర్తిగా గత జన్మ జ్ఞాపకాలు మేల్కొంటాయి.
"https://te.wikipedia.org/wiki/మగధీర_(సినిమా)" నుండి వెలికితీశారు