కన్నెగంటి బ్రహ్మానందం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
|signature =
}}
'''[[బ్రహ్మానందం నటించిన సినిమాలు|బ్రహ్మానందం]]''' ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన పూర్తి పేరు '''[[కన్నెగంటి బ్రహ్మానందం]]'''. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా... వైవిధ్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు.<br />స్వల్పకాలములోనే వివిధ భాషలలో '''900''' కి పైగా సినిమాలలోనటించి, ప్రపంచములోనే అరుదయిన రికార్డు సృష్టించాడు. ఈ విషయం [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు]] ([[2008]]వ సంవత్సరం) వారు గుర్తించారు. ఇప్పటికి ఈయన [[తెలుగు సినిమా]] పరిశ్రమలో చాలా ఎక్కువ సినిమాలలో నటిస్తూవున్న హాస్య చక్రవర్తి.
 
==బాల్యం==
బ్రహ్మానందం [[ఫిబ్రవరి 1]], [[1956]] సంవత్సరంలో [[గుంటూరు]] జిల్లా, [[సత్తెనపల్లి]] తాలూకా [[ముప్పాళ్ల]] మండలం [[చాగంటివారిపాలెం]] గ్రామంలో జన్మించాడు. తను పుట్టగానే తల్లికి [[గుర్రపువాతం]] వచ్చి, అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె [[ప్రాణాలు]] నిలిచాయి. తల్లి ప్రాణాలు దక్కినా, బ్రహ్మానందం అనే పసివాడిపై మాత్రం అందరిదీ శీతకన్నే.
 
==చదువు==
[[సత్తెనపల్లి]] శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో [[భీమవరం]] డి.ఎన్.ఆర్. కాలేజీలో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]], [[డిగ్రీ]] పూర్తి చేసాడు. [[గుంటూరు]] పీజీ సెంటర్లో [[తెలుగు]] [[సాహిత్యం|సాహిత్యంలో]] ఎమ్మే పట్టా పుచ్చుకొన్నాడు. బ్రహ్మానందం [[అత్తిలి]]లో తొమ్మిది సంవత్సరాలు [[లెక్చరర్|లెక్చరర్‌]]<nowiki/>గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
 
==సినీరంగ ప్రవేశం==
పంక్తి 49:
 
==తొలి సినిమా==
బ్రహ్మానందాన్ని మొట్టమొదటి సారిగా [[మూవీ కెమెరా]] ముందు మేకప్ వేసి నిలబెట్టినవ్యక్తి దర్శకుడు [[వేజళ్ల సత్యనారాయణ]] . [[నరేశ్]] కథానాయకుడిగా నటించిన '[[శ్రీ తాతావతారం]]' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించాడు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు [[ఫిబ్రవరి 1]] వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో [[హైదరాబాద్]] వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా, తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం [[జంధ్యాల]] దర్శకత్వంలో వచ్చిన "[[అహ నా పెళ్ళంట]]".
 
==పేరు తెచ్చిన పాత్ర==
"...పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే [[అహ! నా పెళ్ళంట !]] లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. "అరగుండు వెధవా" అని [[కోట శ్రీనివాసరావు|కోట]]తో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం, తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. [[జంధ్యాల]] తను దర్శకత్వం వహిస్తున్న "[[చంటబ్బాయ్]]" సినిమా నిర్మాణ సమయంలో [[చిరంజీవి]]కి పరిచయం చేయడం, తర్వాత "[[పసివాడి ప్రాణం]]"లో ఓ చిన్న పాత్ర వేయడం. ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహ నా పెళ్ళంటలో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను, అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ [[డి.రామానాయుడు]] ను, ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని[[చిరంజీవి]]<nowiki/>ని ఎప్పటికీ మరువలేను అంటాడు. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో యేడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం.
 
==ప్రజాదరణ పొందిన ఊత పదాలు==