భారత రైల్వే రైలు ఇంజన్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:All 3 engines.jpg|thumb|220px|మూడు రకాల రైలు ఇంజన్లు]]
'''భారత రైల్వే సంచార యంత్రములు ''' అనగా భారతరైల్వే రైలు బండ్లు (ఎక్స్‌ప్రస్‌, ప్యాసింజరు, గూడ్సు బండ్లు) ఒకచోట నుండి మరోచోటకు చేర్చే సంచారయంత్రాలు. వీటిని ఆంగ్ల భాషలో రైల్వే లోకోమోటివ్స్ అని భారత రైల్వే ఇంజన్లు అని పిలుస్తారు. భారతరైల్వే ఇంజన్లు ముఖ్యముగా మూడు శక్తులతో పనిచేస్తాయి. విద్యుచ్ఛక్తితో పనిచేసే వాటిని విద్యుత్తు లోకోమోటివ్స్ ( ఎలక్ట్రిక్ రైలు ఇంజను), చమురుతో నడిచేవాటిని డిజిల్ లోకో మోటివ్ (డిజిల్ రైలు ఇంజను) అని, ఆవిరితో పనిచేసే వాటిని బొగ్గు ఇంజన్లు (స్టిమ్ లొకోమోటివ్) అని పిలుస్తారు. బొగ్గు ఇంజన్లు ఇప్పుడు భార రైల్వే విభాగములో వాడుక్లొ లేవు. కొన్ని ముఖ్యమైన మరియు చారిత్రాత్మక రైలు బండ్లకి మరియు పర్యాటక రంగంలో వాడే రైలు ఇంజన్లకి మాత్రమే ఈ బొగ్గు ఇంజన్లు వాడుతున్నారు.
భారత రైల్వే ఇంజన్లని వాటికి సంబంధించిన ట్రాక్ (రైలు బద్దీ రకం), వాటి వాహన చలన సామర్థ్యము పైన, వాటిని ఉపయోగించే విధానము మీద వివిధ క్లాసులుగా విభజించి వాటికి నంబరు ఇస్తారు. ప్రతి ఇంజను నంబరుకి నాలుగు లేదా ఐదు అక్షరాల మొదలయ్యే నంబరు ఉంటుంది.