కాటం లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
==మరిన్ని కార్యక్రమాలు==
స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్న యోధులకు పెన్షన్ ఒక వరం లాంటిది అని నమ్మేవారు లక్ష్మి నారాయణ. స్వతంత్ర భారత్ లో ఈ అవకాశాన్ని అందరు వినియోగించు కుంటున్నా.... [[నైజాము స్టేటు]] లోని యోధులకు ఆ అవకాశం రాలేదు. వీరికి కూడా ఆ అవకాశం రావాలని లక్ష్మినారాయణ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కేంద్రం దానికి అంగీకరించ లేదు. దాంతో లక్ష్మినారాయణ " [[తెలెంగాణతెలంగాణ సమర యోధుని సత్యాగ్రహం]]" అని రాసిన ఒక అట్టను మెడలో తగిలించు కొని ప్రధాని ఇంటి ముందు [[నిరాహార దీక్ష]] చేసారు. ఈ విషయాన్ని ఢిల్లీ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. దాంతొ ఇందిరా గాంధి లక్ష్మిణాయణను పిలిపించి కారణం అడగగా......, దానికి లక్ష్మి నారాయణ " సంస్థానాలలో స్వాతంత్ర్య యోధులను మీరు గుర్తించక పోవడాన్ని మేము అవమానంగా భావిస్తున్నాము. బ్రిటిష్ ఆంధ్ర స్వాతంత్ర్య యోధులు ఒక బ్రిటిష్ వారితోనె పోరాడారు. కాని సంస్థాన లోని యోధులు అటు సంస్థానాధీశులతోను, ఇటు బ్రిటిష్ వారితోను పోరాడారు. [[ఆగస్టు 15|15 ఆగస్టు]] మాకు స్వాతంత్ర్య దినం కాదా? హైదరాబాదు విముక్తి జరిగిన [[సెప్టెంబరు 17]] ను స్వాతంత్ర్య దినంగా జరుపుకో మంటారా? ఒక్క హైదరాబాదు సంస్థాన ప్రజలే కాదు పలు సంస్థానాల ప్రజలు భారతీయులు కారా? అవునా? కాదా? ముందు ఇది తేల్చండి? " అని సూటిగా, దైర్యంగా ఇందిరా గాంధిని ప్రశ్నించి యోధుడు లక్ష్మి నారాయణ. దాంతో సంస్థానాల లోని స్వాతంత్ర్య యోధులకు కూడా పెన్షన్ సౌకర్యం లభించింది. ఈ యోధుడు సాధించిన అతి పెద్ద ఘన కార్యం.
 
ఇతను చేసిన మరో ఘన కార్యం ఏమంటే? హైదరాబాదు స్వాతంత్ర్య సమార చరిత్రను ప్రామాణిక పద్ధతుల్లో గ్రంథస్థం చేయించడం. ఆ విధంగా వచ్చిందే మాణిక్య రావు గారి 844 పేజీల [[హైదరబాదు స్వాతంత్ర సమర చరిత్ర]]. ఇది ఇప్పటికీ ప్రామిణిక గ్రంథం. దాన్ని అప్పటి భారత రాష్ట్ర పతి జైల్ సింగ్ చేత ఆవిష్కరింప జేసారు. [[పి.వి.నరసింహరావు|పి.వి.నరసింహ రావు]], [[టి. అంజయ్య]], [[కాసు బ్రంహానంద రెడ్డి]], [[భవనం వెంకట్రామ రెడ్డి]], ఈ నలుగురు ముఖ్య మంత్రులతో ఒక పెద్ద సభను నిర్వహించారు. ఇతను నిర్వహించిన సభలకు ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, పీఠాధిపతులు, స్వాతంత్ర సమర యోధులు, [[దలైలామ]] వంటి వారు కూడా పాల్గొనే వారు. తన స్వంతానికి ఏ మాత్రం పాటు పడక కేవలం ప్రజలకు, విలువల కొరకు ఎంతటి వారినైన ఎదిరించి ధైర్యంగా నిర్మొహమాటంగా నిలబడటం కాటం లక్ష్మినారాయణ గారి వ్యక్తిత్యం లోని ప్రధాన గుణం. ఆ మహా యోధుడు [[2010]] వ సంవత్సరం [[ఫిబ్రవరి 25]] నాడు తను కొలిచే శ్రీ కృష్ణునిలో ఐక్యమైపోయారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కాటం_లక్ష్మీనారాయణ" నుండి వెలికితీశారు