కాటం లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

→‎జీవిత విశేషలు: బూర్గుల రామకృష్ణా రావుకు లింకు సరి
పంక్తి 39:
==జీవిత విశేషలు==
 
కాటం లక్ష్మీనారాయణ [[రంగారెడ్డి జిల్లా]] [[శంషాబాదు]]లో, లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతులకు [[1924]] వ సంవత్సరంలో [[సెప్టెంబరు 19]] న జన్మించాడు. ఇతని తాత కాటం నారాయణ స్థానిక జమీందారుల అకృత్యాలను ఎదిరించిన దైర్యవంతుడు. తాత పేరుతో పాటు దైర్య సాహాసాలు కూడా మనమనికి వచ్చాయి. [[1942]] [[అక్టోబరు 12]] న [[బూర్గుల రామకృష్ణారావు]] చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండులో సత్యాగ్రహం చేయడానికి సన్నాహాలు ప్రారంభించగా నైజాము పోలీసులు లాటీలు ఝుళిపించారు. అక్కడే కాటం లక్ష్మినారాయణ సత్యాగ్రహానికి మద్దతుగా నినాదాలు చేయగా పోలీసులు [[భూర్గులబూర్గుల రామ కృష్ణారావురామకృష్ణారావు]]ని, లక్ష్మినారాయణనిలక్ష్మీనారాయణని అరెస్ట్ చేశారు. అప్పటికి నారాయణ వయస్సు పంతొమ్మిది. అప్పటి నుండి లక్ష్మినారాయణ బూర్గుల రామకృష్ణా రావుని గురువుగా బావించాడు. పోలీసులు లక్ష్మినారాయణను ఏడు నెలల పాటు చెంచల్ గూడ జైల్లో వుంచారు. ఆ జైల్లో స్థానిక నాయకులెందరో ఉన్నారు. అక్కడే వారి అనుభవాలను తెలుసుకున్నాడు. అతనికి జైలు జీవితం చాల మంచి పాఠాలను నేర్పింది. బయటకు వచ్చిన లక్ష్మినారాయణ న్యాయవిద్య పూర్తి చేసి బూర్గుల వారి వద్దనే జూనియర్ లాయర్ గా చేరారు. వారికి చేదోడు వాదోడుగా వుంటూ, అన్ని కార్య కలాపలాలలో క్రియా శీలక పాత్ర పోషించాడు. లక్ష్మి నారాయణ రాజకీయ కార్యకలాపాలే గాక ఆనాటి సామాజికి సమస్యలలో కూడా పాలు పంచుకున్నాడు. నిజాం ప్రభుత్య ఆజ్ఞలను దిక్కరించి హింది పాఠశాలను స్థాపించాడు. ఖాది వ్యాప్తి, దళిత జనోద్దరణ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. [[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]] ప్రేరణతో [[1945]] లో లక్ష్మినారాయణ హైదరాబాదు యువ జన కాంగ్రేసు స్థాపించి తాను ప్రదాన కార్యదర్శిగా పనిచేశారు.
 
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కాని నైజాము స్టేటులో విముక్తి లభించలేదు. బూర్గుల వారు, కాటం వారు ఈ విషయాన్ని ప్రపంచ నాయకుల దృష్టికి తీసుకురావాలని వారి సహకారాన్ని కోరాలని [[1947]] [[ఆగస్టు 15]] న బూర్గులవారితో కలిసి మద్రాసు చేరి [[రష్యా]], [[అమెరికా]], [[ప్రాన్సు]] వంటి దేశాలకు టెలిగ్రాములు ఇచ్చారు. కాని వారు తిరిగి [[హైదరాబాదు]]లో అడుగు పెట్టగానే నైజాము పోలీసులు వారి అరెస్టు చేశారు. [[కొండా వెంకట రంగారెడ్డి]]కి లక్ష్మినారాయణ అంటే చాల ఇస్టం. అతను జైల్లో వున్నప్పుడు లక్ష్మినారాయణకు కుటుంబ పోషణకు నెలకు పదిహేను రూపాయలనిచ్చే వారట. ఇలా లక్ష్మినారాయణకు ఆనాటి ప్రముఖు లందరితో మంచి పరిచయాలుండేవి. [[1947]] [[మే]] నెల 11 న పెళ్ళి చేసుకొన్న లక్ష్మినారాయణ నాలుగు నెలలకె మళ్లీ అరెస్ట్ అయాడు. ఇలా లక్ష్మి నారాయణ ఏదో ఒక ఉద్యమంలో పాల్గొనడం, అరెస్ట్ కావడం, తిరిగి రావడం, మళ్లి జైలుకెళ్లడం నిత్య కృత్యం అయింది.
"https://te.wikipedia.org/wiki/కాటం_లక్ష్మీనారాయణ" నుండి వెలికితీశారు