ఉప్పలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
|Religion =
}}
'''[[మాండొలిన్ శ్రీనివాస్]]''' ([[ఫిబ్రవరి 28]], [[1969]] - [[సెప్టెంబర్ 19]], [[2014]]) గా ప్రసిద్ధిచెందిన '''ఉప్పలపు శ్రీనివాస్''' ప్రముఖ భారతీయ [[మాండొలిన్]] వాద్య నిపుణుడు.
 
==బాల్య జీవితం==
శ్రీనివాస్ [[ఫిబ్రవరి 28]], [[1969]], [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[పాలకొల్లు]]లో జన్మించాడు.<ref name=Allmusic>{{cite web|last=Hunt|first=Ken|title=U. Srinivas - Biography|publisher=Allmusic|url=http://www.allmusic.com/artist/u-srinivas-p34614|accessdate=2009-06-02}}</ref> తండ్రి సత్యనారాయణ క్లారినేట్‌ వాద్యకారుడు. శ్రీనివాస్‌ బాల సంగీత మేధావి. ఆరు సంవత్సరాల వయసులోనే[[వయసు]]<nowiki/>లోనే మాండొలిన్ ను చేతబట్టాడు. శ్రీనివాస్‌ తొమ్మిదేళ్ల వయసులోనే [[1978]]లోఆంధ్రరాష్ట్రంలో మాండలిన్‌ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశాడు. [[మద్రాసు]]లో జరిగిన సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారిగా శ్రీనివాస్‌ మాండలిన్‌ వాయుద్య కచ్చేరీని ఏర్పాటు చేశారు. కొడుకులోని కళాతృష్ణను గుర్తించిన తండ్రి తన గురువైన [[రుద్రరాజు సుబ్బరాజు]] దగ్గరకు శిష్యరికానికి పంపాడు. రుద్రరాజుకు మాండొలిన్ వాయించడం రాదు గాని మంచి గాయకుడు. తన గానకళతో[[గానకళ]]<nowiki/>తో శ్రీనివాస్ కి మాండొలిన్ నేర్పించాడు. 19వ సంవత్సరంలో మాండలిన్‌ వాద్య కచ్చేరీ చేసాడు. శ్రీనివాస్ సోదరుడు యు.రాజేష్ కూడా అన్నకి సంగీతంలో తోడుగా ఉండేవాడు. వీరికి ఒక సోదరి ఉంది. [[కర్ణాటక సంగీతం]]లో మాండొలిన్ ను ఉపయోగించిన ప్రథమ కళాకారుడు శ్రీనివాస్. రాగాలకు స్వరాలకు అనుకూలంగా మాండొలిన్ ను మలచాడు శ్రీనివాస్. భారతదేశంలోనే[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోనే కాకుండా [[కెనడా]], [[ఆస్ట్రేలియా]] మొదలగు పలు దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీనివాస్‌ విద్యుత్తు వాద్యాలను వాయిస్తూ కర్ణాటక సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
 
== కలిసి పనిచేసిన కళాకారులు ==
విదేశీ వెస్ట్రన్‌ సంగీత కళాకారులు మైఖేల్‌బ్రూక్‌, జాన్‌ మెర్‌ లాగ్లిన్‌, నైగెల్‌ కొండి టైగన్‌, మైఖేల్‌ వైమన్‌ వంటి వారితో కలసి విదేశాలలో పలు ప్రోగ్రామ్‌లు చేశాడు. శ్రీనివాస్‌ [[కర్ణాటక సంగీతము|కర్నాటక]] సంగీతంతోబాటు హిందుస్థానీ సంగీతంలోను ప్రావీణ్యం గడిరచాడు. హిందుస్థానీ క్లాసికల్‌ సంగీత కళాకారులు [[హరిప్రసాద్‌ చౌరాసియా]], [[జాకిర్ హుసేన్ (సంగీత విద్వాంసుడు)|జాకీర్ హుస్సేన్]] వంటి వారితో కలసి పనిచేసాడు.
 
== అవార్డులు ==
అతి పిన్న వయసులోనే మాండలిన్‌ శ్రీనివాస్‌ను ([[1998]]లో) [[పద్మశ్రీ అవార్డు]] అందుకున్నాడు. [[2010]]లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నాడు. [[1983]]లోనే [[బెర్లిన్|బెర్లిన్‌]]లో జరిగిన బజ్‌ ఫెస్టివల్‌లో శ్రీనివాస్‌ మాండలిన్‌ వాదన ఆహూతుల్ని అలరించింది. అత్యంత గౌరవప్రదమైన సంగీత రత్న అవార్డును శ్రీనివాస్‌ గెలుచుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే [[తమిళనాడు]] రాష్ట్ర ఆస్థాన విద్వాంసుడుగా పదవి నలంకరించాడు. సనాతన సంగీత పురస్కార్‌, రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డు, నేషనల్‌ సిటిజన్‌ అవార్డు, రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ అవార్డు వంటి పలు అవార్డులు శ్రీనివాస్‌కు అలంకారం అయ్యాయి. శ్రీనివాస్‌ పలు కర్నాటక సంగీత ఆల్బమ్‌లు రూపొందించాడు.
 
==మరణం==
శ్రీనివాస్‌ (45) శుక్రవారం చెన్నైలో కన్నుమూసాడు. చెన్నై అపొలో హాస్పిటల్ లో లివర్ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం [[సెప్టెంబర్ 19]], [[2014]] మరణించారు.<ref>http://www.thehindu.com/news/national/tamil-nadu/obituary-mandolin-u-shrinivas/article6426381.ece</ref> కొద్దికాలంగా అనారోగ్యంతో[[అనారోగ్యం]]<nowiki/>తో బాధపడుతున్న మాండలిన్‌ శ్రీనివాస్‌ ఈనెల మూడవ తారీఖున చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈయనకు [[కాలేయం]] చెడిపోవడంతో వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స అందించినప్పటికీ, అది ఫలించకపోవడంతో శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మాండలిన్‌ శ్రీనివాస్‌ తుదిశ్వాస విడిచాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఉప్పలపు_శ్రీనివాస్" నుండి వెలికితీశారు