మహాత్మా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
 
== దక్షిణ ఆఫ్రికా ప్రవాసము ==
[[దస్త్రం:Gandhi costume.jpg|left|250pix250px|thumb|1906లో దక్షిణాఫ్రికాలో బారిస్టరుగా గాంధీ]]
[[దస్త్రం:Kasturba and children.jpg|thumb|right|దక్షిణాఫ్రికాలో ఉండగా గాంధీ కుటుంబము]]
ఒక సంవత్సరము పనిమీద వెళ్ళిన గాంధీ, [[దక్షిణ ఆఫ్రికా|దక్షిణాఫ్రికా]]<nowiki/>లో 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకు) గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, ఆయన ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీ, రాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికీ ఇది చాలా ముఖ్యమైన సమయము. ఒక విధముగా [[భారతదేశం]] లో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి. భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ ఆయన చేసిన మొదటి పని. [[1894]] లో భారతీయుల [[ఓటు]] హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించాడు.
"https://te.wikipedia.org/wiki/మహాత్మా_గాంధీ" నుండి వెలికితీశారు