బృహదీశ్వర దేవాలయం (తంజావూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు [[గంగైకొండ చోళ పురం]]లో మరో [[బృహదీశ్వరాలయాన్ని]] నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి [[గంగైకొండ చోళ పురం]] అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం [[తంజావూరు]]లోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
==నిర్మాణము==
[[File:Raraja detail.png|thumb|right|200px|text|Statue of [[Raja Raja Chola I|Rajaraja Chola Chola I]] who consecrated the temple]]
ఈ విశేష నిర్మాణం [[కుంజర రాజరాజ పెరుంథాచన్]] అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పి చే చేయబడింది. ఈ విషయములు అచట గల శాసనాల ద్వారా తెలియుచున్నది. ఈ దేవాలయం వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఈ నిర్మాణ శిల్పి చైన్నై మరియు [[మహాబలిపురం]] వద్ద విశేష నిర్మాణములు చేసిన డా.వి.గణపతి స్థపతి గారి యొక్క పూర్వీకులు. డా. గణపతి స్థపతి దక్షిణ భారత దేశ అగ్రమున 133 గ్రానైట్ తిరువల్లూర్ విగ్రాహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందినవారు. ఆయన కుటుంబం యిప్పటికి కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు. అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మెయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డా. వి. గణపతి స్థపతి చే ప్రారంభించబడింది. ఆయన యొక్క వాస్తు, నిర్మాణశైలిలోనే కుంజర మల్లన్ రాజరాజ పెరుంథాచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం 1 3/8 ఇంచ్ అనగా అంగుళము అనే కొలతల ప్రకారం నిర్మితమైనది.