భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడినది. [[మహాభారతము]] ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము,[[ భీష్ము]]ని నిర్యాణము, [[శ్రీ కృష్ణ భగవానుని]] [[ద్వారకా]] ప్రయాణము, [[ద్వారక]] లో వారు ప్రవేశించడము, [[పరిక్షిత్తు]] జననము,[[ దృతరాష్ట్రుడు]] అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము,[[ పాండవులు]] రాజ్యాన్ని వదిలి వెళ్ళడము,[[ పరిక్షిత్తు ]]మరియు [[కలి]] సంవాదము, [[పరిక్షిత్తు]] [[కలి పురుషుడుని ]] దండించడము, దయచూపడము, [[పరిక్షిత్తు]] కి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, [[శుకదేవ మహర్షి]] ఆగమనము,[[ పరిక్షిత్తు]] వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రధమ స్కంధములో గలవు.

[[ప్రధమ స్కందము ]]

*===కృతిపతి నిర్ణయము===
*ప్రార్థన
{| class="wikitable"

|శార్ధూలము
|శ్రీ కైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్, లోకర
క్షైకారంభకు, భక్తపాలన కళాసంరంభకున్, దానవో
ద్రేక స్తంభకుఁ గేళి లోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్.
|1

|ఉత్పలమాల
|వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌళికిఁ గపాలికి మన్మధ గర్వ పర్వతో
న్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్.
|2

|ఉత్పలమాల
|ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేద రాశి ని
ర్ణేతకు దేవతా నికర నేతకుఁ గల్మష జేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్.
|3

|వచనము
|అని నిఖిల ప్రధాన దేవతా వందనంబు సేసి,
|4

|ఉత్పలమాల
|ఆదర మొప్ప మ్రొక్కిడిదు నద్రి సుతా హృదయా నురాగ సం
పాదికి దోష భేదికిఁ బ్రపన్న వినోదికి విఘ్న వల్లికా
ఛ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నంద వేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్.
|5

|ఉత్పలమాల
|క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీక చయ సుందర వేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్.
|6

|శార్ధూలము
|పుట్టం, బుట్ట శిరంబునన్ మొలవ, నంభొయాన పాత్రంబునన్
నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ నా కగు మమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మి! దయాంభోనిధీ.!
|7

|ఉత్పలమాల
|శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నడు గల్గు భారతీ.
|8

|ఉత్పలమాల
|అంబ, నవాంబు జోజ్వల కరాంబుజ, శారద చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకట స్పుట భూషణ రత్న దీపికా
చుంబిత దిగ్విభాగ, శ్రుతి సూక్తి వివక్త నిజ ప్రభావ, భా
వాంబర వీధి విశ్రుత విహారిణి, నన్ గృపఁ జూడు భారతీ.
|9

|ఉత్పలమాల
|అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలఁ పె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ మా
యమ్మ, కృపాబ్ధి ఇచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
|10

|మత్తేభము
|హరికిం బట్టపు దేవి, పున్నెముల ప్రో, వర్ధంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁ బుట్టువు, భారతీ గిరి సుతల్ తో నాడు పూఁబోడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్.
|11

|వచనము
|అని ఇష్టదెవతలం జింతించి దినకర కుమార ప్రముఖులం దలంచి ప్రథమ కవితా విరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకి నుతయించి హయగ్రీవ దనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసుం డగు వ్యాసునకు మ్రొక్కి, శ్రీమహాభాగవత కధా సుధారస ప్రయోగికి శుక యోగికి నమస్కరించి, మృదు మధుర వచన రచన పల్లవిత స్ధాణునకున్ బాణునకుం బ్రణమిల్లి. కతిపయ శ్లోక సమ్మోదిత సూరు మయూరు నభినందించి, మహా కావ్య కరణ కళా విలాసుం గాళిదాసుం గొనియాడి, కవి కమల విసర రవిం భారవిం బొగడి, విదళితాఘు మాఘు స్తుతియించి, యాంధ్ర కవితా గౌరవ జన మనోహరి నన్నయ సూరిం గైవారంబు సేసి, హరిహర చరణార వింద వందనాభిలాషిఁ దిక్క మనీషిన్ భూషించి, మఱియు నితర పూర్వకవి జన సంభావనంబు గావించి, వర్తమాన కవులకుం బ్రియంబు వలికి, భావికవుల బహూకరించి, యుభయ కావ్య కరణ దక్షుండనై.
|12

*కృతిపతి నిర్ణయము
{| class="wikitable"

Line 201 ⟶ 149:

|వచనము
| మఱియును మధు వైరి మందిరంబునుం బోలె మాధవీమన్మధ హితంబై, బ్రహ్మ గేహంబునుం బోలె శారదాన్వితంబై, నీలగళ సభా నికేతనంబునుం బోలె వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటి పటల మండితంబై, బలభేది భవలంబునుం బోలె నైరావతామృత రంభా గణికాభిరామంబై, మురాసుర నిలయంబునుం బోలె నున్మత్త రాక్షస వంశసంకులంబై, ధనదాగారమునుం బోలె శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై, రఘురామ యుద్ధంబునుం బోలె నిరంతర శరానల శిఖాబహుళంబై, బరశురాము భండనంబునుం బోలె నర్జునో ద్భేధంబై, దానవ సంగ్రామంబునుం బోలె నరిష్టజంభనికంభ శక్తి యుక్తంబై, కౌరవ సంగరంబునుం బోలె ద్రోణార్జున కాచన న్యందనకదంబ సమేతంబై, కర్ణు కలహంబునుం బోలె మహోన్నత శల్య సహకారంబై, సముద్ర సేతు బంధనంబునుం బోలె నలనీల పలసాద్యద్రి ప్రదీపితంబై, భర్గు భజనంబునుం బోలె నానాశోక లేకాఫలితంబై, మరుని కోదండంబునుం బోలెఁ బున్నాగశలీ ముఖ భూషితంబై, నరసింహరూపంబునుం బోలెఁ గేసరక రజకాంతంబై, నాట్య రంగంబునుం బోలెఁ నటనటి సుషిరాన్వితంబై, శైలజా నిటలంబునుం బోలెఁ జందన కర్పూర తిలకాలంకృతంబై, వర్షాగమనంబునుం బోలెఁ నింద్ర బాణాసన మేఘ కరక కమనీయంబై, నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై, మహాకావ్యంబునుం బోలె సరళ మృదులతా కలితంబై, వినతానిలయంబునుం బోలె సువర్ణ రుచిరంబై, యమరావతీ పురంబునుం బోలె సుమనో లలితంబై, కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై, పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృతఫలతంబై, ధనంజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై, వైకుంఠ పురంబునుం బోలె ఖడ్గ పుండరీక విలసితంబై, నంద ఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై, లంకా నగరంబునుం బోలె రామ మహిషీ వంచక సమంచితంబై, సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ గవయ శరభ శోభితంబై, నారాయణ స్తానంబునుం బోలె నీలకంఠ హంస కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురంబై, మహాభారతంబునుం బోలె నేకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై, సూర్య రథంబునుం బోలె నురుతర ప్రవాహంబై, జలదకాల సంధ్యా ముహుర్తంబునుం బోలె, బహు వితర జాతి సౌమనంస్యంబై, యొప్పు నైమిశారంణ్యం బను శ్రీవిష్ణు క్షేత్రంబు నందు శౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుండగు హరిం జేరు కొరకు సహస్ర వర్షంబు లనుష్ఠాన కాలంబుగాఁ గల సత్త్రజ్ఞ్లితంబైన యాగంబు సేయు చుండి రందొక్కనాఁడు వారలు రేప కడ నిత్య నైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుం జూసి.
|39
|1}
{| class="wikitable"

|వచనము (Cont..)
| కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై, పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృతఫలతంబై, ధనంజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై, వైకుంఠ పురంబునుం బోలె ఖడ్గ పుండరీక విలసితంబై, నంద ఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై, లంకా నగరంబునుం బోలె రామ మహిషీ వంచక సమంచితంబై, సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ గవయ శరభ శోభితంబై, నారాయణ స్తానంబునుం బోలె నీలకంఠ హంస కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురంబై, మహాభారతంబునుం బోలె నేకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై, సూర్య రథంబునుం బోలె నురుతర ప్రవాహంబై, జలదకాల సంధ్యా ముహుర్తంబునుం బోలె, బహు వితర జాతి సౌమనంస్యంబై, యొప్పు నైమిశారంణ్యం బను శ్రీవిష్ణు క్షేత్రంబు నందు శౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుండగు హరిం జేరు కొరకు సహస్ర వర్షంబు లనుష్ఠాన కాలంబుగాఁ గల సత్త్రజ్ఞ్లితంబైన యాగంబు సేయు చుండి రందొక్కనాఁడు వారలు రేప కడ నిత్య నైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుం జూసి
|39 (Cont…)

*శోనకాది ఋషుల ప్రశ్న