కాకాని వెంకటరత్నం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Kakani venkataratnam.jpg|right|thumb|కాకాని వెంకటరత్నం]]
[[దస్త్రం:Statue of Kakani Venkata Ratnam at Akunuru Village, Krishna District, A.P.jpgjpgright|thumb|[[ఆకునూరు]] గ్రామంలో నెలకొల్పిన [[కాకాని వెంకటరత్నం]] స్మారకవిగ్రహం]]
సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ '''కాకాని వెంకటరత్నం''' తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు<ref>Lucien D. Benichou, ''From Autocracy to Integration: Political Developments in Hyderabad State, 1938-1948'' (Orient Longman, 2000), p282</ref>. వీరు [[1900]] సంవత్సరం, [[ఆగస్టు 3]]వ తేదీన [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలం [[ఆకునూరు]] గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వీరు 1924లో రాజకీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1934 నుండి 1937 వరకూ [[ఆకునూరు]] గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. 1937-40లలో [[కృష్ణాజిల్లా]] కాంగ్రెస్ కమిటీ ప్రధాన [[కార్యదర్శి]]గా ఉన్నారు. అనంతరం వీరు [[ఆంధ్రప్రదేశ్]] శాసన సభకు 4 పర్యాయాలు ఎన్నికయ్యారు. 1941-42లో యుద్ధ వ్యతిరేక ప్రచారం చేశారు. వీరు [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఫలితంగా 1942-1945 సంవత్సరాల మధ్య వెల్లూరు, తంజావూరు కారాగారాలలో శిక్షను అనుభవించారు. 1952-53లో ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పనిచేశారు. 1959-66ల మధ్య వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా పనిచేశారు. అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో [[కాసు బ్రహ్మానందరెడ్డి]], [[నీలం సంజీవరెడ్డి]]ల వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు<ref>{{cite news|url=http://www.hindu.com/2004/03/16/stories/2004031606240300.htm|title= Aspirants beware! Voters tilt the scales here | location=Chennai, India | work=The Hindu|date=March 16, 2004}}</ref><ref>{{cite web|url=http://www.andhracafe.com/index.php?m=show&id=16085|title="Jai Andhra" now in momentum|publisher=AndhraCafe.com}}</ref> . 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో వీరు కీలకంగా వ్యవహరించి మంత్రిపదవికి రాజీనామా చేశారు. వీరు [[1972]], [[డిసెంబరు 25]]న గుండెపోటుతో మరణించారు. [[విజయవాడ]] బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు. కృష్ణా జిల్లాలోని [[నందిగామ]]లోని కాలేజీకి వీరి గౌరవార్థం కె.వి.ఆర్ (కాకాని వెంకటరత్నం) కాలేజీ అనే పేరుతో పిలుస్తున్నారు. ప్రజలు వీరిని "ఉక్కు కాకాని" అని పిలిచేవారు.
 
"https://te.wikipedia.org/wiki/కాకాని_వెంకటరత్నం" నుండి వెలికితీశారు