త్యాగరాజు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''[[త్యాగరాజు]]''' ([[మే 4]], [[1767]] <ref>ఇంకొక సాంప్రదాయం ప్రకారం, త్యాగరాజు పుట్టిన సంవత్సరం 1749. భారతీయ చాంద్రమాన పంచాంగం ప్రకారము సర్వజిత్నామ సంవత్సర 27వ సోమవారము చైత్ర శుక్ల సప్తమినాడు పుష్య నక్షత్ర లగ్నమందు జన్మించాడు.</ref> - [[జనవరి 6]], [[1847]]<ref>హిందూ పంచాంగం ప్రకారం ప్రభవనామ సంవత్సర పుష్య బహుళ పంచమి.</ref>) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. '''త్యాగయ్య''', '''త్యాగబ్రహ్మ''' అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప [[వాగ్గేయకారుడు]]. ఆయన కీర్తనలు [[శ్రీరాముడు|శ్రీరాముని]] పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. [[ఉపనయనము|ఉపనయనం]] తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.
== బాల్యం, విద్యాభ్యాసం==
త్యాగరాజు ప్రస్తుత [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[ప్రకాశం జిల్లా]] [[కంభం]] మండలంలో [[కాకర్ల]] అను గ్రామంలో [[తెలుగు]] [[వైదిక]] [[బ్రాహ్మణ]] కుటుంబంలో [[1767]]లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం [[కాకర్ల త్యాగ బ్రహ్మం]]. వీరు మురిగినాడుములకనాడు తెలుగు [[బ్రాహ్మణులు]].త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత [[ప్రకాశం జిల్లా]] [[కంభం]] మండలంలో [[కాకర్ల]] అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం [[తంజావూరు]] ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవాడు. త్యాగరాజు గారి తాతగారు గిరిరాజ కవిగారు. వీరి గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో "గిరిరాజసుతా తనయ" అని తన తాతగార్ని స్తుతించియున్నారు. త్యాగయ్య గారి విద్య కొరకు రామబ్రహ్మము తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు పోయిరి. త్యాగయ్య గారు అచట సంస్కృతమును, వేదవేదాంగములను అమూలాగ్రము పఠించెను. సంగీతాభ్యసము కొరకు త్యాగయ్య గారు శొంఠి వేంకటరమణయ్య గారి దగ్గర విడువబడెను. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి చాకచక్యమును, సంగీతమునందుగల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశము చేయసాగిరి.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/త్యాగరాజు" నుండి వెలికితీశారు