ధర్మం: కూర్పుల మధ్య తేడాలు

ఈ వ్యాసం ఎటువంటి ఆధారాల్నీ వెల్లడించడం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''[[ధర్మము]]''' అనగా మానవత్వాన్ని రక్షించే గుణము. హిందూ దేశానికి ధర్మక్షేత్రమని[[ధర్మక్షేత్రం|ధర్మక్షేత్ర]]<nowiki/>మని పేరు. సకల ప్రాణికోటిలో మానవ జన్మము ఉత్తమమైనది. ఇలాంటి మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో [[మానవజాతి]] ఒక్కటే సమర్ధమైనది. ఇతర ప్రాణులలో లేని [[బుద్ధి]] విశేషముగా ఉండటమే దీనికి కారణము. ఆహార భయ నిద్రా మైథునములు అన్ని ప్రాణుల యందు సమానమై, కేవలము యుక్తాయుక్త విచక్షణ, ఆలోచనకు రూపమీయగల ప్రజ్ఞ బుద్ధి ద్వారా సాధ్యమై ఈ ఉత్తమ గుణాన్ని సాధించవచ్చును.
 
"ధర్మం", ఈ పదానికి, ఈ భావనకు భారతీయ మతాలలో (హైందవ, బౌద్ధ, జైన, శిఖ్ఖు ) చాలా అర్ధాలుఉన్నాయి.
 
సనాతన ధర్మం ప్రకారం " ఏ ప్రవర్తనా నియమావళి , మూల సూత్రాలు , మరియ ఏ న్యాయము చేత వ్యక్తి గత , సామాజిక , మతపర జీవితం సజావుగా నడపబడుతుందో , ఏ కారణము చే సర్వ జీవజాలం , ప్రకృతి లోని ప్రతి పదార్థం
, శక్తి ఒక దానితోనొకటి అనుసంధానించబడి మనుగడ సాదిస్తాయో , ఏ [[కారణము]] చే ఈ [[ప్రపంచము]] , బ్రంహాండ మండలం తమ ఆస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయో , అట్టి దానిని ధర్మము గా నిర్వచించారు.
 
బౌద్ధ ధర్మం ప్రకారం కనిపిస్తున్న మరియు కనిపించని వాటన్నిటినీ నడిపించే ప్రకృతి నియమావళిని , బుద్ధుని[[బుద్ధుడు|బుద్ధు]]<nowiki/>ని ప్రవచనాలను , మార్గదర్శకాలను , నాలుగు ఆర్యసత్యాలనూ , సాధన ద్వారా సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకుని నిర్వాణాన్ని పొందే మార్గాన్ని "ధర్మం" అని పిలుస్తారు.
 
జైన ధర్మం ప్రకారము జీన గురువులు ప్రవచించిన, బోధించిన పరిశుద్ధ జీవన మార్గాన్ని, కల్మశంలేని సాధన ద్వారా అనంత సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకునే మార్గాన్ని ధర్మం అని పిలిచారు.
పంక్తి 18:
సనాతన ధర్మాన్ని స్థూలముగా ఇలా అర్ధం చేసుకోవచ్చును.
 
మానవులు తమకు కలిగిన సత్సంకల్పాలను ఇతరులకు నష్టము కలిగించకుండా నెరవేర్చుకొనడమే ధర్మము యొక్క ముఖ్య లక్షణమని చెప్పవచ్చును. [[భూమి]] మీద సకల మానవులలోను కొందరు ఉత్తములుగా నుండి తోటి మానవులలో పూజింపబడితే దైవ సమానులుగా భావించబడడానికి వారు ఆచరిస్తున్న ధర్మ గుణమే ప్రధాన కారణము. [[శాంతి]], [[దయ]], [[అహింస]], [[సత్యము]], [[అస్తేయము]], [[ఉపకారము]], [[సానుభూతి]], [[శౌచము]] మొదలగు సుగుణము లన్నీ ధర్మమునకు అవయవాలై ఉన్నాయి.
 
ధర్మానికి [[వేదాలు]] ప్రమాణాలు. ధర్మాధర్మ విచక్షణ వచ్చినపుడు సత్పురుషులు ఆలోచించి తగిన నిర్ణయం చేసి ధర్మ పక్షపాతులై వ్యవహరిస్తారు. ఇటువంటి ప్రమాణికమైన ధర్మాన్ని ఆచరించినవారు ఇహలోకాల్లో కీర్తిని[[కీర్తి]]<nowiki/>ని, సుఖాన్ని పొందుతారు.
 
బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసములు అనే ఆశ్రమములను చతుర్వర్ణాలలో మానసిక సంస్కారమును బట్టి అందరూ ఆచరించవచును. [[బ్రహ్మచారి]]కి వేదాధ్యయనము, గురు శుశ్రూష, [[ఇంద్రియాల|ఇంద్రియ]] నిగ్రహము, పెద్దలయందు గౌరవము ప్రధాన ధర్మములు. గృహస్థునకు ఏకపత్నీవ్రతము, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారము, ధర్మ [[పిల్లలు|సంతానము]], ఆచార నిర్వహణము, ఆనాథులయందు ఆదరణ, బీదలకు సహకారము ప్రధానములు. వానప్రస్థుడు ధర్మ వ్యవహారబద్ధుడై వయోభారాన్ని దృష్టిలో ఉంచుకొని, కర్మలయందు స్వార్ధమును వీడి సంతానమునకు వ్యవహార మప్పగించి ధర్మపత్నితో కందమూలాదుల నాహారించి తపమాచరించడం [[ధర్మము]]. వైర్యాగ్యము కలిగి ధర్మపత్నిని సంతానమున కప్పగించి కామక్రోధాదులను జయించి నిర్లిప్తుడై శేష జీవితమును లోకొద్ధరణకై ధర్మ ప్రబోధనైక లక్ష్యముతో ఆత్మ సాక్షాత్కారంతో సన్యసించుట యక్తము.
 
=== ధర్మము-ధర్మి- వస్తు శాస్త్రదృష్టిలో : ===
పంక్తి 29:
[[సాంఖ్య దర్శనము]] లేదా సాంఖ్య యోగుల దృష్టిలో ధర్మము అంటే ధర్మి యొక్క శక్తి ధర్మి అంటే ద్రవ్యం. మట్టి అనేది ఒక ద్రవ్యం. దాంట్లో అనేక శక్తులు ఉన్నాయి. అది దుమ్ము కాగలదు, ముద్ద కాగలదు, కుండ కాగలదు, పెంకులు కాగలదు, మళ్ళా పొడిదుమ్ము కాగలదు, ఈరీతిగా ఇంకెన్నో కాగలదు. ఇవి అన్నీ దాని శక్తులే. ఇట్టి శక్తులే ధర్మము. సాంఖ్యయోగుల దృష్టిలో ఆధారం లేక మూలం శున్యం కాదు.
 
[[యోగ దర్శనము]] భాష్యంలో ధర్మికి [[యోగ్యత]] ఉన్నశక్తియే ధర్మము అని ఉంది.క్రియాదులచే ఏదో విధంగా తెలియదగినది కావడమే యోగ్యత. నిప్పు ముట్టుకొంటే బొబ్బలెక్కుతవి. అందుచె నిప్పుకు బొబ్బలెక్కించే శక్తి ఉన్నదనే జ్ఞానం కలుగుతుంది. అందుచె దాహకాశక్తి అగ్నికి ధర్మము అని అంటాం. దహనం నిప్పు యోగ్యత. ఏగుణం చేత వస్తువు మనకు బోధపడుతుందో అదే ఆవస్తువు యొక్క ధర్మం.
 
ఏదో ఒక ప్రకారంగా తెలిసికోబడే భావాన్ని మనం ధర్మం అని అంటాం. ఇట్టి ధర్మం త్రివిధం.1 శాంత ధర్మం లేక అతీత ధర్మము . 2. ఉదిత ధర్మము లేక వర్తమాన ధర్మము 3. అవ్యపదేశ్యధర్మము లేక అనాగరిక ధర్మము . ఈధర్మాలు కాలాను గుణంగా విభక్తాలయినట్లు మనకు తెలుస్తుంది. మనకు వర్తమాన ధర్మమే గోచర మవుతుంది.
పంక్తి 35:
ఏదయినా వస్తువులో ఉండగలది ధర్మము . ఏదో ఒక విధంగా తెలిసికోబడే ఆకార ప్రకార విశేషం ధర్మం. ఆకార- ప్రకారాలకు మార్పు కానబడుతుంది. అనగా పరిణామం ఉంది. అంటే ధర్మాలకు మార్పు ఉన్నాదన్నమాట. ఒక ఆకారం-ప్రకారం- ధర్మం, మారినప్పుడు అది అవ్యకావస్థలో ఉన్నట్లు. ఎందుచేతనంటే ఉన్నదెప్పుడూ పోదు. మళ్ళా హెతువులు తటస్థించినప్పుడు ఆధర్మం పొటమరించవచ్చును. కాబట్టి భూతధర్మం ఒక అవ్యక్త సత్తా. గుండ్రంగా చేసిన మట్టి ముద్దను చచ్చవుకుగా చేశాం. దాన్ని మళ్ళా కోనుగా ఆకారించవచ్చును. ఈరీతిగా ఎన్నెన్నో ఆకారాలుగా మట్టి ముద్ద ఉంది.కాబట్టి ధర్మి అనేది లెక్కలేని ధర్మాల ప్రోవు; మరిదాన్ని వివిధ విధాలుగా బోధపరచవచ్చును. వర్తమాన ధర్మాలే కనబడుతావి.మిగతవన్నీ ఉన్నవన్నట్లు ఊహింపబడుతావి. కాబట్టి వ్యక్తావ్యక్తధర్మాలకు కూటం ధర్మి.
 
బౌద్ధులులో[[బౌద్ధ మతము|బౌద్ధులు]]<nowiki/>లో ఒక తెగవారు ఈ ప్రపంచమంతా[[ప్రపంచము|ప్రపంచ]]<nowiki/>మంతా ధర్మాలే, ఈ [[ధర్మాలు]] అనుక్షణమూ శూన్యంలోంచి పుట్టుకొచ్చి మళ్ళా శూన్యంలోనే పోతున్నవి అను అంటారు. శూన్యం అంటే అభావం. మరికొందరు పుట్టుకొస్తున్నవన్న మాట నిజమే కానీ దేంట్లోంచి పుట్టుకొస్తున్నయ్యో అది అజ్ణేయం అని అంటారు.
 
ధర్మాలు వాస్తవాలూ వైకల్పికాలూ. చెప్పకుండా తెలిసేవీ వాస్తవాలు. చంద్రునికి తెల్లదనం. ఎండమావులకు జలత్వం ఆరోపిత వాస్తవం. అనంతత్వం, సత్తా, ప్రకృతి ఈ మొదలయినవి వైకల్పికాలు.
"https://te.wikipedia.org/wiki/ధర్మం" నుండి వెలికితీశారు