జపాన్: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇవి కూడా చూడండి: నేను జపాన్ లో నివశిస్తాను.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 72:
}}
 
'''[[జపాన్]]''' ( జపాన్ భాషలో '''నిప్పన్''' లేదా '''నిహన్''' {{lang|ja|日本国}} {{Audio|Ja-nippon_nihonkoku.ogg|నిప్పన్-కోక్}})అనేది [[తూర్పు ఆసియా]] ప్రాంతంలో [[పసిఫిక్ మహాసముద్రం]]లో ఉన్న ఒక [[దేశాల జాబితా – దీవుల దేశాలు|ద్వీప దేశం]]. ఇది [[చైనా]], [[కొరియా]], [[రష్యా]] దేశాలకు [[తూర్పు]] దిశగా ఉంది. జపాన్ దేశపు [[ఉత్తరం|ఉత్తరాన]] ఉన్న సముద్ర భాగాన్ని ఓఖోట్‌స్క్ [[సముద్రం]] అని, [[దక్షిణం|దక్షిణాన్న]] ఉన్న సముద్ర భాగాన్ని తూర్పు చైనా సముద్రం అనీ అంటారు. జపాన్ భాషలో ఆ దేశం పేరు (నిప్పన్)ను వ్రాసే అక్షరాలు "సూర్యుని పుట్టుక"ను సూచిస్తాయి. కనుక జపాన్‌ను "సూర్యుడు ఉదయించే దేశం" అని అంటుంటారు.
 
జపాన్ దేశంలో సుమారు 3,000 పైగా [[దీవులు]] <ref>{{cite web | title = ''Nihon Rettō'' | url = http://dic.yahoo.co.jp/dsearch?enc=UTF-8&p=%E3%81%AB%E3%81%BB%E3%82%93%E3%82%8C%E3%81%A3%E3%81%A8%E3%81%86&dtype=0&stype=1&dname=0ss
| publisher = [[Daijirin]] / Yahoo Japan dictionary | accessdate = 2007-05-07|archiveurl=http://archive.is/vkiX|archivedate=2012-05-23}}</ref> ఉన్నందున ఇది నిజానికి ఒక [[ద్వీపకల్పం]]. ఈ దీవులలో పెద్దవైన నాలుగు దీవులు [[హోన్షూ]], [[హొక్కయిడో]], [[క్యూషూ]] మరియు [[షికోకూ]] కలిపి మొత్తం దేశం భూభాగంలో 97% వైశాల్యం కలిగి ఉన్నాయి. ఎక్కువ దీవులు పర్వత మయాలు లేదా [[అగ్ని పర్వతం|అగ్ని పర్వత]] భాగాలు. జపాన్‌లోని అత్యంత ఎత్తైన [[ఫ్యూజీ పర్వతం]] కూడా ఒక అగ్నిపర్వతమే.
 
128 మిలియన్ల [[జనాభా]] కలిగిన జపాన్ ప్రపంచంలో[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో [[దేశాల జాబితా - జనసంఖ్య క్రమంలో|జనాభా ప్రకారం పదవ స్థానంలో]] ఉంది. [[టోక్యో]], మరియు దాని పరిసర ప్రాంతాలు కలిపితే 30 మిలియన్ల జనాభాతో ప్రపంచంలో అతిపెద్ద మెట్రొపాలిటన్ స్థలం అవుతుంది.
 
ఆర్ధికంగా జపాన్ ప్రపంచంలో చాలా ప్రముఖ స్థానం కలిగి ఉంది.<ref name="ciawfbjapan"/> ప్రపంచంలో ఇది [[దేశాల జాబితా – నామినల్ జి.డి.పి. క్రమంలో|నామినల్ జి.డి.పి. క్రమంలో రెండవ పెద్ద దేశం]]. అభివృద్ధి చెందిన దేశాల సమాఖ్యలలో (G8, G4, OECD, APEC) సభ్యత్వం కలిగి ఉంది. ఇంకా ఇది ప్రపంచంలో [[దేశాల జాబితా – ఎగుమతుల క్రమంలో|నాలుగవ పెద్ద ఎగుమతిదారు]] మరియు [[దేశాల జాబితా – దిగుమతుల క్రమంలో|ఆరవ పెద్ద దిగుమతిదారు]]. [[సాంకేతిక విజ్ఞానం|సాంకేతిక]], మెషినరీ రంగాలలో అగ్రగామి.
 
== "జపాన్" పేర్లు ==
"జపాన్" అనే పదం ఆంగ్లంలోనూ[[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లోనూ, ఇతర భాషలలోనూ విస్తృతంగా వాడబడుతున్నది కాని జపాన్ భాషలో ఈ పదం లేదు. దీనికి జపాన్ భాషలో "నిప్ఫోన్" లేదా "నిహొన్" అనే పదాలు సరైనవి. అధికారిక వినియోగంలో "నిప్ఫోన్" అనే పదాన్ని వాడుతారు. వాడుక భాషలో "నిహన్" అంటుంటారు. రెండు పదాలకూ అర్ధం "సూర్యుడి మొదలు" లేదా "సూర్యుడు ఉదయించే స్థలం". చైనాకు తూర్పున ఉన్నందున [[చైనా]] వారి అధికారిక పత్రాలలో ఈ పదం వాడకం మొదలయ్యింది. అంతకు ముందు, అనగా చైనాతో సంబంధాలు పెరగక ముందు, జపాన్ దేశాన్ని "యమాటో" (Yamato, Hi no moto) అనేవారు. అంటే కూడా అర్ధం "సూర్యుడు ఉద్భవించేది" అనే.<ref>[http://www.sf.airnet.ne.jp/~ts/japanese/message/jpnEVwSABIuEVrrH_51.html Teach Yourself Japanese Message Board]</ref>
 
అంతర్జాతీయ వర్తకాలు పెరిగిన సమయంలో "జపాన్" అనే పేరు మొదలయినట్లుంది. [[మార్కోపోలో]] మొదటిసారిగా ''Cipangu'' అని ఈ దేశం పేరును చైనా భాషలో వ్రాశాడు. చైనాలోని వివిధ యాసల ప్రకారం జిప్పెన్, నిపెన్, జెపాంగ్, జెపున్ వంటి వివిధ పేర్లున్నాయి. చైనా భాషనుండి మలయా ([[ఇండోనేషియా|ఇండొనీషియా]]) భాషలోకి, అక్కడినుండి పోర్చుగీసు వారి ద్వారా 16వ శతాబ్దంలో [[ఐరోపా]]కు "జపాన్" అనే మాట పరిచయమయ్యింది. 1577లో మొదటిసారి ఆంగ్లంలో దీన్ని ''Giapan'' అని వ్రాశారు.
 
== చరిత్ర ==
[[దస్త్రం:Map of Japan appears in the Cihannuma.jpg|thumb|17వ శతాబ్దం నాటి జపాన్ మ్యాప్]]
జపాన్ ద్వీపసముదాయంలో జనావాసాపు చిహ్నాలు క్రీస్తు పూర్వం 30వ సహస్రాబ్దినాటికే [[పేలియోలితిక్]] సంస్కృతిగా కనిపిస్తాయి. వీటి తరువాత క్రీస్తు పూర్వం పదవ సహస్రాబ్దికి [[మీసోలితిక్]], [[నియోలితిక్]] వేటాడి జీవించే సగం సంచార వాసులు బొరియలలో నివసించే సంస్కృతికి[[సంస్కృతి]]<nowiki/>కి చెందిన వారు నివసించారు. ప్రాథమిక స్థాయి [[వ్యవసాయం]] చేసిన ఆనవాళ్ళు కన్పిస్తాయి. ఈ కాలములో దొరికిన అలంకరణలతో కూడిన మట్టి పాత్రలు ప్రపంచంలో ప్రస్తుతము మిగిలిన మట్టి పాత్రలలో పురాతనమైనవాటిలో వానిగా గుర్తింపు పొందినాయి.
 
[[దస్త్రం:MiddleJomonVessel.JPG|thumb|150px|right|క్రీ.పూ. 3000 కాలానికి చెందిన పాత్ర.]]
అతి పురాతనమైన [[మట్టి పాత్రలు]] జపాన్ దేశము నుండే మనకు లభిస్తున్నాయి, ఇవి క్రీస్తు పూర్వం పదివేల ఐదువందల కాలానికి చెందినవి. ఆ తరువాత దొరికిన పాత్రల్లో పురాతనమైనవి [[చైనా]] మరియు [[భారత దేశము]]ల నుండి లభిస్తున్నాయి.<ref>((1995). "Past Worlds". ''The Times Atlas of Archeology''. p. 100.)</ref><ref>{{cite book |author=Habu Jinko |year=2004 |title=Ancient Jomon of Japan |publisher=Cambridge Press}}</ref><ref>{{cite web |url=http://web-japan.org/trends00/honbun/tj990615.html |title=Jomon Fantasy: Resketching Japan's Prehistory |publisher=web-japan.org |date=1999-06-22 | accessdate=2008-01-24}}</ref> మంచు యుగం ముగిసిన తరువాత జపాన్ చరిత్రలో రెండు ప్రధాన ఘట్టాలు సంభవించినాయి, వాటిలో మొదటిది మట్టి పాత్రల తయారీ! ఇది పురాతత్వ శాస్త్రవేత్తలకు బహు ఆశ్చర్యం కలిగించినది, ఎందుకంటే సాధారణంగా ఏవైనా కొత్త విషయాలు పెద్ద పెద్ద భూభాగమున్న ప్రాంతాలలో కనుగొనబడి తరువాత చిన్న చిన్న ద్వీప సముదాయాలకు వ్యాపిస్తాయి, కానీ జపాన్ చిన్న ద్వీప సముదాయము అయినా కానీ మట్టి పాత్రలను ముందే కనుగొన్నది. ఇక్కడి మట్టి పాత్రలు సుమారుగా పన్నెండు వేల ఏడువందల సంవత్సరాల క్రితానివి.<ref>{{cite web |url=http://www.jomon.or.jp/ebulletin11.html |title="Fakery" at the beginning, the ending and the middle of the Jomon Period |publisher=Bulletin of the International Jomon Culture Conference (Vol. 1) |date=2004 | accessdate=2008-01-24}}</ref>
 
క్రీ.పూ. 3వ శతాబ్దంలో యాయోయ్ కాలంలో వరి సాగు, ఇనుము, ఇత్తడి తయారీ, క్రొత్త రకం పాత్రల తయారీ మొదలయ్యాయి. వీటిలో కొన్ని విధానాలు చైనా, కొరియాలనుండి వలసి వచ్చినవారు ప్రవేశపెట్టారు. మొత్తానికి ఈ కాలంలో జపాన్ ఒక వ్యవసాయ ప్రాముఖ్యత కలిగిన సమాజంగా పరిణమించింది.<ref>{{cite web |url=http://www.britannica.com/eb/article-23121 |title=The Yayoi period (c.250 BC – c.AD 250) |publisher=Encyclopædia Britannica |date=2006 | accessdate=2006-12-28}}</ref><ref>{{cite journal |author = [[:en:Jared Diamond]] |title= Japanese Roots | journal = [[:en:Discover Magazine]] Vol. 19 No. 6 |date=June 1998 | url=http://discovermagazine.com/1998/jun/japaneseroots1455}}</ref><ref>{{cite web |url=http://encarta.msn.com/encyclopedia_761568150_4/Pottery.html#p26 |title=Pottery |publisher=MSN Encarta | accessdate=2006-12-28}}</ref><ref>{{cite book |last=De Bary |first=William Theodore |title=Sources of Japanese Tradition |publisher=Columbia University Press |date=2005 |pages=1304 | isbn = 023112984X |url=http://books.google.com/books?vid=ISBN023112984X&id=6wS_ijD6DSgC&pg=RA1-PA1304&lpg=RA1-PA1304&ots=MxkZKlTRlU&dq=%22Chinese+mainland%22+%22Korean+peninsula%22+%22Japanese+archipelago%22&sig=hc4ew2p4cGdppzY6O_b0zWgaB6E#PRA1-PA1304,M1 | accessdate=2007-01-29}}</ref>
 
[[దస్త్రం:Kamakura Budda Daibutsu front 1885.jpg|thumb|150px|left|upright|1252 కాలానికి చెందిన [[బుద్ధ]] విగ్రహం (కోటోకు-ఇన్) - కమాకురా ప్రాంతంలోనిది.]]
చైనాకు చెందిన ''హాన్ పుస్తకంలో'' మొట్టమొదటిగా జపాన్ యొక్క ''మూడు రాజ్యాల గురించి'' వ్రాయబడింది. [[బౌద్ధ మతం]] జపాన్‌లోకి [[కొరియా]] ప్రాంతంనుండి ప్రవేశించింది. కాని తరువాత జపాన్‌లో [[బౌద్ధ మతము|బౌద్ధం]] వ్యాప్తిపైన, బౌద్ధ శిల్ప రీతుల పైన చైనా ప్రభావం అధికంగా ఉంది.<ref>{{cite book |editor=Delmer M. Brown (ed.) |year=1993 |title=The Cambridge History of Japan |publisher=Cambridge University Press |pages=140–149}}</ref> అసూక కాలం తరువాత పాలక వర్గంనుండి బౌద్ధానికి విశేషంగా ఆదరణ లభింపసాగింది.<ref>{{cite book |title=The Japanese Experience: A Short History of Japan |author=William Gerald Beasley |publisher=University of California Press |year=1999 |url=http://books.google.com/books?vid=ISBN0520225600&id=9AivK7yMICgC&pg=PA42&lpg=PA42&dq=Soga+Buddhism+intitle:History+intitle:of+intitle:Japan&sig=V65JQ4OzTFCopEoFVb8DWh5BD4Q#PPA42,M1 |pages=42 |isbn=0520225600 |accessdate=2007-03-27}}</ref>
 
8వ శతాబ్దంలో "నారా కాలం"లో జపాన్ దేశం కేంద్రీకృతమైన పాలనతో ఒక రాజ్యంగా రూపొందింది. అప్పుడు హేజో-క్యో అనే రాజనగరు (ప్రస్తుతం నారా) అధికార కేంద్రంగా వర్ధిల్లింది. దానికి తోడు చైనా సంస్కృతి, పాలనా విధానాల ప్రభావంతో లిఖిత [[సాహిత్యం]] ఆవిర్భవించింది. పురాతన గాధలను, మౌఖిక సాహిత్యాన్ని గ్రంధస్తం చేస్తూ ''కోజికి'' (712) మరియు ''నిహొన్ షోకి'' (720) అనే సంకలనాలు కూర్చబడ్డాయి.<ref>{{cite book |author=Conrad Totman |year=2002 |title=A History of Japan |publisher=Blackwell |pages=64–79 | isbn=978-1405123594}}</ref> అంతకు ముందు యమాటో రాజుల అసూక కాలంలో ఫ్యుజివరా-క్యో ఆ దేశపు (యమాటో రాజ్యపు) రాజధానిగా ఉండేది.
 
784లో [[కమ్ము చక్రవర్తి]] రాజధానిని నారా నుండి నగోకా-క్యోకు, తరువాత 794లో హెయాన్-క్యోకు (ప్రస్తుతపు [[క్యోటో]] వగరం) మార్చాడు. తరువాత 1000 సంవత్సరాలపైగా క్యోటోనే దేశపు రాజధానిగా ఉంది.<ref>{{cite book |author=Conrad Totman |year=2002 |title=A History of Japan |publisher=Blackwell |pages=79–87 | isbn=978-1405123594}}</ref> "హెయాన్ కాలం" అనబడే ఈ కాలంలోనే జపాన్ దేశం విలక్షణమైన సంస్కృతిని[[సంస్కృతి]]<nowiki/>ని సంతరించుకొన్నది. జపాను చిత్రకళ, జపాను సంగీతం, జపాను సాహిత్యం అభివృద్ధి చెందాయి. జపాను జాతీయ గీతం ఈ కాలంలోనే వ్రాయబడింది.<ref>{{cite book |author=Conrad Totman |year=2002 |title=A History of Japan |publisher=Blackwell |pages=122–123 | isbn=978-1405123594}}</ref>
 
[[దస్త్రం:RedSealShip.JPG|thumb|200px|ఆసియా దేశాలతో వర్తకానికి వాడబడిన జపాన్ ఓడ - ఎరుపు రంగు చిహ్నంతో (1634)]]
[[దస్త్రం:Satsuma-samurai-during-boshin-war-period.jpg|thumb|200px|బోషిన్ యుద్ధం సమయంలో సత్షుమా తెగకు చెందిన సమూరాయ్ - సుమారు 1867 సమయం.]]
పోరాట ప్రధానమైన సంస్కృతి కలిగిన "[[సమూరాయ్]]" అనే పాలక వర్గం వృద్ధి చెందినపుడు జపాను సమాజం [[ఫ్యూడలిజమ్|ఫ్యూడల్]] సమాజంగా పరిణమించింది. 1185లో వివిధ వర్గాల మధ్య జరిగిన తగవులు, [[షోగన్]] వ్యవస్థ ఈ పరిణామానికి అంకురార్పణ జరిగింది. "కకమురా" కాలంలో (1185–1333) చైనానుండి జపానులోకి [[జెన్ బౌద్ధం]] ప్రవేశించింది. 1274-1281 సమయంలో కకమురా షోగన్ ప్రతినిధులు [[మంగోలు]] దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ సమయంలో సంభవించిన ఒక తుఫాను జపాను వారికి అనుకూలమయ్యింది. దీనిని జపనీయులు ''కమికాజి లేదా దివ్యమైన తుఫాను'' అంటారు. తరువాత అనేక అంతఃకలహాలు జరిగాయి. 1467లో చెలరేగిన అంతర్యుద్ధం ఫలితంగా సెంగోకు పాలన ఆరంభమయ్యింది.<ref>{{cite book |author=[[George Sansom]] |year=1961 |title=A History of Japan: 1334–1615 |publisher=Stanford |pages=217 | isbn=0-8047-0525-9}}</ref>
 
16వ శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు, పోర్చగీసు వర్తకులు మొట్టమొదటిసారిగా జపాను భూభాగంపై అడుగు పెట్టారు. అప్పటినుండి జపాన్ - పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు పురోగమించాయి. తరువాత పాశ్చాత్యులనుండి వచ్చిన ఆయుధ సామగ్రి జపాన్ అంతర్యుద్ధాలలో విరివిగా వాడబడింది. 1590 ప్రాంతంలో "టొయొటోమి హిదెయోషి" నాయకత్వంలో దేశం మళ్ళీ ఒకటయ్యింది. 1592 - 1598 కాలంలో రెండుమార్లు జపాన్ కొరియాపై దండెత్తింది. కాని కొరియా సేనలు, చైనా మింగ్ రాజుల సేనల చేతిలో పరాజయం పాలయ్యింది.<ref>{{cite book |author=[[Stephen Turnbull (historian)|Stephen Turnbull]] |year=2002 |title=Samurai Invasion: Japan's Korean War |publisher=Cassel |pages=227| isbn=978-0304359486}}</ref>
పంక్తి 110:
తరువాత 1600 వరకు మళ్ళీ అంతర్యుద్ధాలు కొనసాగాయి. 1639లో జపాన్ షోగన్ నాయకత్వం ''సకోకు'' ("closed country") లేదా "ఏకాంత విధానం" అని ప్రసిద్ధమైన విధానాన్ని అనుసరించింది. సుమారు రెండున్నర శతాబ్దాల కాలం కొనసాగిన ఈ సమయంలో జపాను బయటి ప్రపంచం నుండి సంబంధాలు దాదాపు పూర్తిగా తెంచుకొని ఏకాకిగా ఉంది. ఈ సమయాన్ని ఎడో కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో జపాను అధ్యయనాన్ని జపానువారే కొనసాగించారు. ఈ ప్రక్రియను కోకుగాకు లేదా "జాతీయ అధ్యయనం" అంటారు. అయితే [[నెదర్లాండ్స్]] అధీనంలో ఉన్న "డెజిమా" (నాగసాకి లోనిది) సంబంధాల ద్వారా పాశ్చాత్య విజ్ఞానాన్ని మాత్రం అధ్యయనం చేయడం కొనసాగించారు.<ref>{{cite web |last=Hooker |first=Richard |url=http://www.wsu.edu/~dee/GLOSSARY/KOKUGAKU.HTM |title=Japan Glossary; Kokugaku | publisher = Washington State University | date=[[1999-07-14]] | accessdate=2006-12-28}}</ref>
 
[[1854]] [[మార్చి 31]]న, [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] సైనికాధికారి కమొడోర్ మాత్యూ పెర్రీ నాయకత్వంలో అమెరికాకు చెందిన "నల్ల ఓడలు" బలవంతంగా జపాన్ ఏకాంతాన్ని విచ్ఛిన్నం చేశారు. తరువాత జరిగిన వివిధ ఒప్పందాలు, ఘటనలు, యుద్ధాల కారణంగా జపాన్ దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. పాశ్చాత్య పరిపాలన, ప్రజా ప్రాతినిధ్య విధానం అమలై రాజరికం నామమాత్రమయ్యింది. ఇలా జరిగిన పరిణామాలను మెయిజీ పునరుద్ధరణ అంటారు. ఆ తరువాత జపాన్ ఒక పారిశ్రామిక శక్తిగా రూపుదిద్దుకొంది. తన ప్రాబల్యాన్ని మరింత విస్తృత పరచేందుకు యుద్ధాలు చేసింది. 1894-1895 కాలంలో మొదటి చైనా - జపాను యుద్ధము, 1904-1905 లో రష్యా - జపాన్ [[యుద్ధము]] జరిగాయి. [[తైవాన్]], [[కొరియా]], దక్షిణ సఖలిన్ జపాన్ అధీనంలోకి వచ్చాయి.<ref>{{cite web |url= http://filebox.vt.edu/users/jearnol2/MeijiRestoration/imperial_japan.htm |title=Japan: The Making of a World Superpower (Imperial Japan) |author=Jesse Arnold | publisher = vt.edu/users/jearnol2 | accessdate=2007-03-27}}</ref>
 
20వ శతాబ్దం ఆరంభంలో జపాన్ మరింత బలపడింది. [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో జపాన్ మిత్ర పక్షాల తరఫున ఉండి విజయంలో భాగం పంచుకొంది. తరువాత తన అధికారాన్ని విస్తరిస్తూ 1931లో [[మంచూరియా]]నుమంచూరియాను ఆక్రమించింది. దీనిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అందుకు నిరసనగా జపాన్ [[నానాజాతి సమితి]] నుండి బయటకు వచ్చింది. 1936లో [[నాజీ]] [[జర్మనీ]]తో కమ్యూనిస్టు వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకొంది. 1941లో [[అక్ష రాజ్యాలు|అక్ష రాజ్యాల కూటమి]]లో చేరి [[జర్మనీ]], ఇటలీలకు[[ఇటలీ]]<nowiki/>లకు తోడుగా [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో పాల్గొంది.<ref>{{cite web |url= http://www.friesian.com/pearl.htm |title= The Pearl Harbor Strike Force |author= Kelley L. Ross | publisher = friesian.com |accessdate=2007-03-27}}</ref>
 
[[దస్త్రం:nagasakibomb.jpg|thumb|150px|upright| 1945 లో [[హిరోషిమా]], [[నాగసాకి]] నగరాలపై అణుబాంబు ప్రయోగం]]
1937లో జపాన్ మళ్ళీ చైనాపై దండెత్తింది. 1937-1945 కాలంలో రెండవ చైనా - జపాన్ యుద్ధం జరిగింది. అమెరికా అందుకు వ్యతిరేకంగా జపాన్‌పై చమురు నిషేధం (oil embargo) విధించింది.<ref>{{cite book |author=Roland H. Worth, Jr. |title=No Choice But War: the United States Embargo Against Japan and the Eruption of War in the Pacific |publisher=McFarland |date=1995 |isbn=0-7864-0141-9}}</ref>
[[డిసెంబరు 7]], [[1941]]న జపాన్ అమెరికా యొక్క [[పెరల్ హార్బర్]] నౌకా స్థావరంపై దాడి చేసింది. అమెరికా, [[యునైటెడ్ కింగ్‌డమ్|బ్రిటన్]], నెదర్లాండ్స్‌పై[[నెదర్లాండ్స్|నెదర్లాండ్స్‌]]<nowiki/>పై యుద్ధం ప్రకటించింది. దీంతో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో భాగస్వామి అయ్యింది. 1945లో [[హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు|హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు ప్రయోగం]] మరియు [[సోవియట్ యూనియన్]] ఆగస్టు యుద్ధం తరువాత జపాను ఓటమిని అంగీకరించి [[ఆగస్టు 15]]న లొంగిపోయింది.<ref>{{cite web |url=http://library.educationworld.net/txt15/surrend1.html |title=Japanese Instrument of Surrender |publisher=educationworld.net |accessdate=2006-12-28}}</ref>
 
యుద్ధం కారణంగా జపాన్‌లో అపారమైన ప్రాణ నష్టం జరిగింది. పరిశ్రమలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి. యుద్ధకాలంలోని [[:en:Nanking Massacre|నాన్‌కింగ్ ఊచకోత]] వంటి అనేక నేరాల అభియోగాలు జపాన్‌పై మోపబడ్డాయి.<ref>{{cite web |url=http://www.geocities.com/nankingatrocities/Tribunals/imtfe_01.htm |title=The Nanking Atrocities: The Postwar Judgment |publisher=University of Missouri-Columbia |accessdate=2007-03-27|archiveurl=http://web.archive.org/20060306015306/www.geocities.com/nankingatrocities/Tribunals/imtfe_01.htm|archivedate=2006-03-06}}</ref> 1947లో జపాన్ క్రొత్త శాంతియుత రాజ్యాంగాన్ని అమోదించింది. ఈ రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యం అమలయ్యింది. 1952లో [[శాన్ ఫ్రాన్సిస్కో ఒడంబడిక]] ఒడంబడిక ప్రకారం జపాన్‌లో మిత్ర పక్షాల అధికారం తొలగించబడింది.<ref>{{cite web |url=http://search.japantimes.co.jp/cgi-bin/nn20070306f3.html |title='52 coup plot bid to rearm Japan: CIA |author=Joseph Coleman| date=[[2006-03-06]]| publisher=[[The Japan Times]] |accessdate=2007-04-03|archiveurl=https://archive.is/RXRo|archivedate=2012-07-17}}</ref> 1956లో జపాన్‌కు [[ఐక్య రాజ్య సమితి]] సభ్యత్వం లభించింది.
 
తరువాత మళ్ళీ జపాన్ ఆర్థిక వ్యవస్థ ఒక అద్భుతంలాగా పుంజుకొంది. అది ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. 1990 దశకం మధ్యలో ఆర్థిక మాంద్యం నెలకొని జపాన్ ఆర్థిక వ్యవస్థను కొంత వరకు దెబ్బ తీసింది. 2000 తరువాత మళ్ళీ కొంత [[అభివృద్ధి చెందిన దేశం|అభివృద్ధి]] కనుపిస్తున్నది.<ref>{{cite web |url=http://news.bbc.co.uk/1/hi/business/5178822.stm |title=Japan scraps zero interest rates |publisher=[[BBC News Online]] |date=[[2006-07-14]] |accessdate=2006-12-28}}</ref>
 
== ప్రభుత్వం, పాలన, రాజకీయాలు ==
[[దస్త్రం:Diet of Japan Kokkai 2009.jpg|thumb|left|200px|జపాన్ చట్ట సభ భవనం - డయట్, టోక్యో.]]
జపాన్ ఒక [[రాజ్యాంగబద్ధ రాజరికం]]. రాజు లేదా [[చక్రవర్తి]] కేవలం జాతికి, దేశానికి, జాతి సమైక్యతకు చిహ్నంగా మాత్రమే ఉంటాడు. నిజమైన అధికారం ప్రధానమంత్రి చేతుల్లోను, ఎన్నుకొనబడిన ప్రతినిధుల (డయట్) చేతిలోను ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం నిజమైన సార్వభౌమత్వం ప్రజలదే.<ref name="Constitution">{{cite web |url=http://www.sangiin.go.jp/eng/law/index.htm |title=The Constitution of Japan |publisher=House of Councillors of the National Diet of Japan |date=[[1946-11-03]] |accessdate=2007-03-10}}</ref> ప్రస్తుత చక్రవర్తి పేరు [[అకిహిటో]]. అతని తరువాత [[నరుహిటో]]కు వారసత్వంగా చక్రవర్తి పదవి లభిస్తుంది.
 
జపాన్ పార్లమెంటు అయిన [[డయట్]]‌లో రెండు సభలున్నాయి. ఇందులో ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలలో ఎన్నుకొనబడే 480 మంది ప్రజాప్రతినిధుల సభ [[:en:House of Representatives of Japan|ప్రతినిధుల సభ]]. మరొక సభలో 242 మంది [[:en:House of Councillors|కౌన్సిలర్లు]] ఉంటారు. పదవీ కాలం 6 సంవత్సరాలు. జపాన్‌లో 20 సంవత్సరాలు దాటిన వారందరికీ వోటు హక్కు ఉంది.<ref name="ciawfbjapan">{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ja.html |title=World Factbook; Japan |publisher=[[CIA]] |date=[[2007-03-15]] | accessdate=2007-03-27}}</ref><ref name="Constitution"/> 1955నుండి "లిబరల్ కన్సరవేటివ్ పార్టీ" అధికారంలో ఉంది. కేవలం 1993లో మాత్రం సంకీర్ణ ప్రభుత్వం పనిచేసింది.<ref>{{cite web |url=http://www.jimin.jp/jimin/english/history/index.html |title=A History of the Liberal Democratic Party |publisher=Liberal Democratic Party of Japan |accessdate=2007-03-27}}</ref> జపాన్‌లో "డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ జపాన్" అనే లిబరల్ పార్టీ ముఖ్యమైన ప్రతిపక్షం.
పంక్తి 137:
[[దస్త్రం:JMSDF DDH 181 Hyuga.jpg|thumb|right| జపాన్ సముద్ర రక్షణ సైన్యం (JMSDF)కు చెందిన హెలికాప్టర్ వాహక డిస్ట్రాయర్ నౌక]]
[[దస్త్రం:Two JASDF F-15J take off in formation.JPEG|thumb|right| (JASDF)జపాన్ వైమానిక దళానికి చెందినF-15 యుద్ధ విమానాలు.]]
జపాన్ అమెరికాతో మంచి ఆర్థిక మరియు మిలిటరీ సంబంధాలు కలిగిఉంది. జపాన్-అమెరికా [[రక్షణ]] సంబంధాలు జపాన్ విదేశాంగ విధానంలో ముఖ్యమైన భాగం.<ref>{{cite web |url=http://www.realclearpolitics.com/articles/2007/03/japan_is_back_why_tokyos_new_a.html |title=Japan Is Back: Why Tokyo's New Assertiveness Is Good for Washington| author=Michael Green |publisher=Real Clear Politics | accessdate=2007-03-28}}</ref>
 
1956 నుండి జపాన్ [[ఐక్య రాజ్య సమితి]] సభ్య దేశం. ఐ.రా.స. [[భద్రతా మండలి]] శాశ్వత సభ్యత్వం కోసం జపాన్, మరో మూడు దేశాలతో కలిపి, (G4 దేశాలు అనబడుతున్నాయి) ప్రయత్నిస్తున్నాయి<ref>{{cite web |url=http://www.centralchronicle.com/20070111/1101194.htm |title=UK backs Japan for UNSC bid |publisher=Cenral Chronicle | accessdate=2007-03-28}}</ref> G8, APEC లేదా ఆసియా - పసిఫిక్ ఆర్థిక సహకార మండలి, "ASEAN ప్లస్ మూడు" వంటి పలు ప్రముఖ సమాఖ్యలలో జపాన్ సభ్యత్వం కలిగి ఉంది. ప్రపంచంలో అభివృద్ధికి అధికారిక సహాయం అందించే రెండవ పెద్ద దేశం కూడాను. 2004లో 8.86 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం అందజేసింది.<ref>{{PDFlink|[http://www.oecd.org/dataoecd/40/3/35389786.pdf Table: Net Official Development Assistance In 2004 (PDF).]|32.9&nbsp;[[Kibibyte|KiB]]<!-- application/pdf, 33766 bytes -->}} Organisation for Economic Co-operation and Development ([[2005-04-11]]). Retrieved on [[2006-12-28]].</ref>
పంక్తి 150:
సాధారణంగా జపాన్‌ను 8 ప్రాంతాలుగా వర్ణిస్తారు. కాని పాలనా పరంగా 47 జిల్లాలు(prefectures)గా విభజింపబడింది. ఒకో జిల్లాకు ఎన్నికైన గవర్నర్, చట్ట సభ, పాలనాధికార వ్యవస్థ ఉన్నాయి. ఈ వ్యవస్థ ప్రస్తుతం పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నది.<ref>{{cite web |last=Mabuchi |first=Masaru |url=http://siteresources.worldbank.org/WBI/Resources/wbi37175.pdf |title=''Municipal Amalgamation in Japan'' (PDF) |publisher=World Bank |date=May 2001 | accessdate=2006-12-28}}</ref>
 
జపాన్‌లో పెక్కు పెద్ద నగరాలున్నాయి. జపాన్ [[సంస్కృతి]], [[ఆర్ధిక నిర్వహణ|ఆర్ధిక]] వ్యవస్థ, [[సామాజిక శాస్త్రం|సామాజిక]] స్థితిలో ఈ నగరాలు చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నాయి.
 
== భౌగోళికం ==
పంక్తి 158:
[[దస్త్రం:Minnajima beach, Okinawa.jpg|thumb|ఒకినావాలో మిన్నాజిమా బీచ్]]
 
పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న జపాన్ దేశంలో మూడువేలపైగా దీవులు ఉత్ర దక్షిణాలుగా విస్తరించి ఉన్నాయి. వీటిలో హొక్కయయిడో, హోన్షూ, షికోకు, క్యూషూ అనేవి పెద్ద [[దీవులు]].ర్యుకూకు, ఒకినావా దీవులు క్యూషూ దీవికి దక్షిణాన ఉన్న చిన్న దీవిల సముదాయం. అన్నీ కలిపి "జపాన్ ద్వీప కల్పం" (Japanese Archipelago) అంటారు. దేశంలో 70% నుడి 80% వరకు అరణ్యాలు, పర్వతాలతో నిండి ఉంది.<ref>{{cite web |url=http://encarta.msn.com/encyclopedia_761566679/Japan.html |title="Japan" |publisher=Microsoft® Encarta® Online Encyclopedia |date=2006 |accessdate=2006-12-28}}</ref><ref>{{cite web |url=http://www.worldinfozone.com/country.php?country=Japan |title=Japan Information—Page 1 |publisher=WorldInfoZone.com |accessdate=2006-12-28}}</ref> ఈ భాగం నివాసానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు అనుకూలం కాదు. ఎందుకంటే అక్కడ చాలా వాలు ప్రదేశం కాని, అగ్నిపర్వతాల అంచులు గాని, చరియలు విరిగిపడే అవకాశం కాని, లేదా అధిక [[వర్షపాతం]] లేదా బురదనేల ఉండవచ్చును. కనుక మిగిలిన ప్రాంతాలలో, అధికంగా తీర ప్రాంతంలో, జనసాంద్రత చాలా ఎక్కువ. [[దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో|ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశాలలో]] జపాన్ ఒకటి.<ref>{{cite web |url=http://esa.un.org/unpp/ |title=World Population Prospects |publisher=UN Department of Economic and Social Affairs |accessdate=2007-03-27}}</ref>
 
[[:en:Pacific Ring of Fire|పసిఫిక్ అగ్ని వలయం]] అనబడే ప్రాంతంలో మూడు tectonic plates కలిసే చోట ఉన్నందున జపాన్‌లో [[భూకంపాలు]], అగ్నిపర్వతాలు, సునామీలు తరచు సంభవిస్తుంటాయి<ref>{{cite web |url=http://volcano.und.edu/vwdocs/volc_images/north_asia/japan_tec.html |title=Tectonics and Volcanoes of Japan |publisher=Oregon State University |accessdate=2007-03-27}}</ref>
 
భౌగోళికంగా జపాన్లో ఆరు ముఖ్య పర్యావరణ ప్రాంతాలు ఉన్నాయి
* హొక్కైడొ - మధ్యస్తమైన (సమోష్ణ) [[వాతావరణం]], పొడవాటి శీతాకాలం, ఒకమాదిరి వర్షాలు, చలికాలంలో కొంత హిమపాతం
* జపాన్ సముద్రం: హోన్షూ పశ్చిమ తీర ప్రాంతం. ఎక్కువ హిమపాతం. ఒకోమారు వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు
* మధ్య పీఠభూమి: [[వేసవి కాలం|వేసవి]], [[శీతము|చలి]] కాలాల మధ్య అధిక ఉష్ణోగ్రత తేడాలు, కొద్దిపాటి వర్షపాతం
* సేటో అంతర్భాగ సముద్రం - చుగోకు, షికోకు పర్వతాల మధ్య ఉన్న సముద్రభాగం వివిధ గాలులనుండి రక్షణ కలిగి ఉంటుంది కనుక వాతావరణంలో తీవ్రత తక్కువ.
* పసిఫిక్ సముద్ర ప్రాంతం - తూర్పు తీరం - చలి ఎక్కువ కాని మంచు ఉండదు. [[ఆగ్నేయం|ఆగ్నేయ]] పవనాల వలన వేసవిలో వేడిగాను, తేమగాను ఉంటుంది.
* ర్యుకుకూ దీవులు - భూమధ్యరేఖా ప్రాంతపు వాతావరణం (subtropical) - వేసవిలో వేడి ఎక్కువ. చలి తీవ్రత తక్కువ. వర్షపాతం ఎక్కువ. టైఫూనులు (తుఫానులు) తరచు సంభవిస్తాయి.
 
జపాన్‌లో ఇంతవరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత — 40.9 డిగ్రీలు సెల్సియస్ - [[ఆగస్టు 16]], [[2007]].<ref>{{cite web |url=http://www.japannewsreview.com/society/national/20070816page_id=1553 |title=Gifu Prefecture sees highest temperature ever recorded in Japan - 40.9 |publisher=Japan News Review Society |date=2007-08-16| accessdate=2007-08-16}}</ref> తూర్పు ఆసియా వర్షాకాలంతో మే నెలలో ఒకినావాలో [[వర్షం|వర్షాలు]] మొదలవుతాయి. క్రమంగా ఈ వర్షాలు ఉత్తరానికి విస్తరిస్తాయి. హొక్కయిడో ప్రాంతలో జూలై నెలలో వర్షాలు పడతాయి. హోన్షూ ప్రాంతంలో జూన్ నెలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. వేసవి చివరికాలంలో టైఫూనులు అధికంగా సంభవిస్తాయి. జపాన్‌లో 9 రకాలైన వివిధ వృక్షజాతుల వనాలున్నాయి.<ref>{{cite web |url=http://www.us.emb-japan.go.jp/jicc/spotflora.htm |title=Flora and Fauna: Diversity and regional uniqueness |publisher=Embassy of Japan in the USA |accessdate=2007-04-01}}</ref>
 
జపాన్‌ దేశం ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుంది. ముమ్మరమైన పారిశ్రామికీకరణ కారణంగా తీవ్రమైన పర్యావరణ కాలుష్య సమస్యలు ఉత్పన్నం కావడం ఇందుకు ఒక ముఖ్య కారణం. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా అనేక చట్టాలు చేసింది.<ref>[http://www.erca.go.jp/taiki/history/ko_syousyu.html 日本の大気汚染の歴史], Environmental Restoration and Conservation Agency</ref>. [[క్యోటో ఒప్పందం|క్యోటో]] ఒడంబడిక భాగస్వామిగా జపాన్ ప్రపంచ పర్యావరణ రక్షణకు, [[గ్లోబల్ వార్మింగ్]] నివారణకు కృషి చేస్తున్నది. [[కార్బన్ డయాక్సైడ్]] విడుదలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నది.
 
== ఆర్ధిక రంగం ==
పంక్తి 179:
 
[[దస్త్రం:Tokyo stock exchange.jpg|thumb|upright|టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రపంచంలో రెండవ పెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్]].
[[బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు|బ్యాంకింగ్]], ఇన్షూరెన్సు, రియల్ ఎస్టేట్, రెటెయిల్ వాణిజ్యం, [[రవాణా విధానం|రవాణా]], టెలికమ్యూనికేషన్స్ - ఇవన్నీ జపాన్‌లో ప్రముఖ వ్యాపారాలు లేదా పరిశ్రమలు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మోటారు వాహనాలు, యంత్ర భాగాలు, ఉక్కు, లోహాలు, ఓడలు, రసాయనాలు, వస్త్రాలు, ఆహార పదార్ధాలు వీటన్నింటిలోనూ జపాన్ పరిశ్రమలు అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్నాయి. నిర్మాణ రంగం జపాన్‌లో ఎప్పుడూ చాలా ప్రముఖమైన స్థానం కలిగి ఉంది. ఇందుకు పెద్ద పెద్ద ప్రభుత్వ కంట్రాక్టులు ప్రోద్బలాన్ని అందించాయి. సరకుల తయారీ దారులు, ముడి సరకుల సప్లై చేసేవారు, పంపిణీదారులు, బ్యాంకులు - వీరందరి మధ్య బలమైన సహకారం జపాన్ ఉత్పాదక రంగంలో చాలా ముఖ్యమైన అంశం. వారు ఒక సంఘటితమైన బృందంగా పని చేస్తారు. ఇలాంటి బృందాలను అక్కడ ''[[:en:keiretsu|కేరిత్సూ]]'' అంటారు. పెద్ద పెద్ద కంపెనీలు చాలావరకు తమ ఉద్యోగులకు జీవితకాలం పని హామీ ఇస్తాయి.<ref>{{cite web |url=http://www.economist.com/displayStory.cfm?story_id=7193984 |title=Japan's Economy: Free at last |publisher=[[The Economist]] |date=2006-07-20 |accessdate=2007-03-29}}</ref> ఇటీవలి కాలంలో జపాన్ కంపెనీలు ఈ విధమైన విధానాలను వదలి "లాభసాటి" విధానాలవైపు మళ్ళుతున్నాయి.<ref>{{cite web |url=http://www.moneyweek.com/file/26181/why-germanys-economy-will-outshine-japan.html |title=Why Germany's economy will outshine Japan |publisher=MoneyWeek |date=2007-02-28 |accessdate=2007-03-28}}</ref> ప్రపంచంలో కొన్ని అతిపెద్ద ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీలు, బిజినెస్ గ్రూపులు జపాన్‌లో ఉన్నాయి. - సోనీ, సుమిటోమో, మిత్సుబిషి, టొయోటా వంటివి ప్రపంచ ప్రఖ్యాతమైన బ్రాండ్ పేర్లు. [[:en:Japan Post Bank|జపాన్ పోస్ట్ బ్యాంకు]] అస్సెట్ల ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద బ్యాంకు.
 
1960 నుండి 1980 వరకు రికార్డయిన ప్రగతిని [[:en:Japanese post-war economic miracle|ఒక జపాన్ అద్భుతంగా]] అభివర్ణిస్తారు. ఈ మూడు దశకాలలోను 10%, 5%, 4% క్రమంగా అభివృద్ధి నమోదయ్యింది.<ref>{{cite web |url=http://www.country-data.com/cgi-bin/query/r-7176.html |title=Japan: Patterns of Development |publisher=country-data.com |date=January 1994 |accessdate=2006-12-28}}</ref> తరువాత ప్రగతి కొంత మందగించింది. 1990 దశకంలో జరిగిన అధిక స్పెక్యులేటివ్ పెట్టుబడుల కారణంగా స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేటు వ్యాపారాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు పని చేయలేదు. 2005 తరువాత ఆర్థిక వ్యవస్థ కొంత పుంజుకొంది. 2005లో 2.5% అభివృద్ధి నమోదయ్యింది.
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు