తిరుమల తిరుపతి దేవస్థానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 77:
 
===కల్యాణమస్తు===
2006 వ సంవత్సరంలో బోర్డు ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2007 ఫిబ్రవరి 21 న దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అంకురార్పణ జరిగింది.సరాసరి ఒక్కో జంటకు రూ 7 వేల వరకు వ్యయం అవుతున్నది.ఇప్పటివరకూ 34,017 జంటలను ఒక్కటి చేసిన టిటిడికి అయిన ఖర్చుసుమారు 24 కోట్ల రూపాయలు.స్వామిని దర్శించి, ముడుపులు చెల్లించే వారిలో తమిళనాడు, కర్నాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారుకూడా ఉన్నారు కనుక కళ్యాణమస్తును దేశ వ్యాపితం చేయాలని కొందరు వాదిస్తున్నారు. బంగారపు తాళిబొట్టు, వెండి మట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్ళిసామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్ళి భోజనాలు ఉచితంగా కల్పిస్తున్నది. వివాహాలు జరిపించలేని పేద, మధ్య తరగతి కుటుంబాలవారు, తల్లిదండ్రులు లేని అనాథలుకూడాఅనాథలు కూడా ఈ కార్యక్రమంవల్ల లబ్ధిపొందుతున్నారు. కానీ చౌకగా జరిగే ఇలాంటి మూకుమ్మడి కళ్యాణాలకు గౌరవంతక్కువ అనే భావంతో ప్రజలనుండి తగినంత స్పందన లేదు. రాష్ట్ర వ్యాపితంగా ఈ కార్యక్రమాన్నిఏడాది పొడవునా కాకుండా ఏడాదికి ఒక్క రోజుమాత్రమే చేపట్టటంతో నిరాశ చెందుతున్నారు. [[గోదాదేవి]] లాగానే [[బీబీ నాంచారి]] అనే ముస్లిం స్త్రీ కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది. వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి [[మతాంతర వివాహాలు]]కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని [[సుబ్బన్న శతావధాని]] చెప్పారు.<ref>http://beta.thehindu.com/arts/books/article415269.ece</ref> శ్రీవేంకటేశ్వరుని పై భక్తి విశ్వాసాలున్న హిందూ-ముస్లిము జంటలకు కూడా [[కళ్యాణమస్తు]] కార్యక్రమం విస్తరించి [[మత సామరస్యం]], [[లౌకికత్వం]] బలపడేలా చెయ్యాలని వేంకటేశ్వరుని పై భక్తి విశ్వాసాలున్నముస్లిములు కోరుతున్నారు.
 
<!-- హిందూ దేవాలయాలు వ్యాసం నుంచి కాపి, వికీకరించవలసి ఉంది -->
[[File:Tirumala overview.jpg|right|250px|thumb| నారాయణాద్రి పైనుండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ గోపురాలు]]
[[దస్త్రం:Tirumala gopurams.JPG|right|thumb|250px|తిరుమల ఆలయం గోపురాలు]]
ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరు గాంచిన మన వడ్డి కాసుల వాడి ఆలయానికి నిత్యం అవేలాది వేలాది భక్తులు వస్తుంటారు. పర్వ దినాలలో వారి సంఖ్య లక్షలకు చేరుతుంది. ఈ స్వామి వారి వార్షికాదాయం ఏడు వందల యాబై కోట్ల రూపాయల పైమాటే. ఈ స్వామి వారికి మూడు వేల కిలోల బంగారు డిపాజిట్లున్నాయి. ఇంకా వెయ్యి కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లున్నాయి. ఈ ఆలయానికి ఏటా సరాసరిన మూడు వందల కోట్ల రూపాయలు, మూడు వందల కిలోల బంగారు ఆబరణాలు, ఐదు వందల కిలోల వెండి ఆబరణాలు కానుకలుగా వస్తుంటాయి. ఈ స్వామి వారికి జరిగే ఉదయాస్తమాన సేవ టికెటు ధర పది లక్షల రూపాయలు. అయినా ఆ టికెట్లు రాబోయె ముప్పై ఏళ్ళ వరకు బుక్ అయి పోయాయి. మొత్తంమీద ఈ ఆలయం సంపద విలువ ముప్పైమూడు వేల కోట్ల రూపాయలు. ఈ [[ఆలయం]] వలన లక్షకు పైగా ప్రజలు ఉపాది పొందుతున్నారు.
 
తిరుమల శ్రీనివాసుని ఆదాయం విషయానికొస్తే:.... ఏటా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా వంద కోట్లు ఆ దాయం వస్తున్నది. బ్యాంకుల్లో వుండే ఫిక్సుడు డిపాజిట్ల పై వడ్డీ 140 కోట్లు వుంటుంది. ఈ స్వామి వారి చెంత నున్న బంగారం సుమారు ఐదు టన్నులు. విదేశాలలో వున్న స్థిరాస్తుల విలువ సుమారు 33 వేల కోట్లు.