నాగార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
ఆచార్య నాగార్జునుడు దక్షిణాపధం లో ఉన్న విదర్భ దేశంలో ఒక బ్రాహ్మణవంశంలో పుట్టాడు. తండ్రి జ్ఞానదేవుడు లేక గోశాలి. 7 సం.లు రోజూ సామాన్యులకు, బ్రాహ్మణులకు, శ్రమణులకు, వందలమందికి ఆతిధ్య మిస్తుండేవాడు. ఈతని తల్లిదండ్రులు ఈతనికి శాక్యుడనే పేరు పెట్టారు. శాక్యునికి సప్తవర్షప్రాయం రాగానే, అతని అభిరుచులననుసరించి వదలి ఉండాలనే ఆలోచన భరించరానిదై ఉన్నా, విదేశములకు పంపే ప్రయత్నం చేశారు.
 
నలేంద్ర (నలంద) చేరి సారహ (పాదు)ని దర్సించినాడు.ఇతను శాక్యునికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించినాడు. పిల్లవానిని మంత్రపధంలో ప్రవేశపెట్టాడు. దీనివల్ల ఆయుర్దాయం పెరిగింది.అష్టవర్షానంతరం ఆచార్య రాహు భద్రుని ద్వారా సరస్వతీ పాదుల తరగతిలో ప్రవేశపెట్టబడ్డాడు. సారహ పాదుని వద్ద మహాయాన శాస్త్రమును చెప్పుకున్నాడు. పది సం. అనంతరం ప్రాచీ(పూర్వ దేశం) లో గొప్ప ఆచార్యుడనీ పేరు పొందిన కల్యాణ మిత్రుని వద్ద శిక్షణ పొందాడు. శ్రీమాన్ ప్రజ్ఞాసారమిత అనే బిరుదుని పొందాడు.
 
ఇతను తరువాత మహామంజురీ కురుకుల మొదలయిన తంత్రములను అభ్యసించాడు.ఈవిధముగా ప్రాపంచిక విజయమును ముఖ్యంగా రసాయినములలో పొందాడు. రసాయిన సిద్ధివలన వజ్రకాయ సిద్ధిని గడించాడు.
 
మొదట ఇతను రసాయినములలో భల్లవుని దగ్గర శిక్షణ పొందాడు. నిదానుని దగ్గర బంగారము చేయు ద్రావకములను గురించి కొన్ని వివరణములను సేకరించాడు. కాని ఈ విధానములవలన విజయం పొందలేదు.సారాబట్టీ పెట్టి విక్రయించు ఒక స్త్రీవద్ద ఈరహస్యమును తెలిసికొని స్వర్ణవిద్యలో పరిపూర్ణత్వం గడించాడు. ప్రపంచ క్షామంలో ఇతను నలేంద్రలోని మహాయాన సంఘంలో చేరి రోగులకు పరిచర్య చేసాడు. తర్వాత ఇతను చంటిక (చండిక) అను దేవతను ఉపాసిస్తూ 12ఏండ్లు గడిపాడు.
 
హయఘోషుని వద్ద తారక మంత్రమును నేర్చుకున్నాడు.కు(గు)హ్యశీలు డనబడు బ్రాహ్మణుని శిష్యుడయిన త్రిపిట్కాచార్య హయపాలుని శిష్యుని కుమారుడు ఈ హయఘోషుడు.ధాన్యకటకంలో ఉన్న గొప్పలంకలోని మఠంలో నాగార్జునుడు మహాకాళే మంత్రమును, కురుకుల తంత్రం మొదలయినవాటిని గ్రహించాడు.
 
తర్వాత ఇతను మధ్యదేశంలో నూరు విహారములను నిర్మాంచాడు. అక్కడ మహాయానమునకు ధర్మములను ఏర్పాటు చేశాడు. ఆధర్మసంస్థకు మహాకాళీ మూర్తిని చేయించినాడు. వజ్రశాన (బుద్ధగయ) లోని బోధిద్రుమంపై మాతంగులకున్న విరోధమును మానిపాడు.అక్కడ వృక్షం చుట్టూ బయట శరీర నిదానమును ఏర్పాటు చేసాడు.దాని చుట్టూ రాతి కిటికీలు గల చైతన్యములను 108 ని నిర్మాంచాడు. దక్షిణాపధంలో ధాన్యకటకంలో ఉన్న చైత్యం చుట్టూ ఇనుపరాతితో ప్రాకారం నిర్మించాడని వివరించబడినది.
 
తర్వాత ఇతను దక్షినాట్యంలో ఉన్న జటసంఘరులయొక్క 500 వేదాంతులని ఓడించాడు.ఈవిధంగా శాసనం (ధర్మం) కొరకు వివిధ కార్యక్రములను పూర్తిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/నాగార్జునుడు" నుండి వెలికితీశారు