కె. చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
'''[[చక్రవర్తి]]''' గుంటూరు జిల్లా , [[తాడికొండ]] మండలం, [[పొన్నెకల్లు]] వాస్తవ్యుడు . ఆయన అసలు పేరు '''కొమ్మినేని అప్పారావు'''. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. ఆయన 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు. [[1936]] [[సెప్టెంబరు 8]]వ తేదీన జన్మించాడు. ప్రాథమిక విద్య పొన్నెకల్లు. గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ. ఆయన [[మేనమామ]] కుమార్తె అయిన రోహిణి దేవిని [[పెళ్ళి|వివాహం]] చేసుకొని 1958లో కుటుంబంతో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>తో [[చెన్నై|మద్రాసు]] చేరాడు. ఈయన రెండవ కుమారుడు [[కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి|శ్రీ]] కూడా తెలుగు సినిమా సంగీతకారుడిగా విశేశంగా రాణించాడు.
 
==ఆయన గురించి==
చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. అతని తమ్ముడే దర్శకుడిగా రాణించిన [[కొమ్మినేని శేషగిరిరావు]]. అప్పారావుది [[గుంటూరు జిల్లా]], [[పొన్నెకల్లు]] గ్రామం. ఆయన తల్లిదండ్రులు సంగీతజ్ఞానం కలవారు. ఆ కారణంగా ఆయనకి సంగీతంపై ఆసక్తి కలిగింది. అతని ఉత్సాహంచూసి తండ్రిగారు [[గుంటూరు]]లో ఉన్న మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించారు. ఒక పక్క చదువు, మరో పక్క సంగీతాభ్యాసం నిరాటంకంగానే సాగాయి. ఆయన ఉత్సాహం పట్టలేక ''వినోద్ ఆర్కెస్ట్రా'' అనే బృందాన్ని ఏర్పాటు చేసి [[పాటలు]], [[పద్యాలు]] పాడుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. విజయవాడ ''ఆల్ ఇండియా రేడియో'' లో 1954-58ల మధ్య కె.అప్పారావు కంఠం పాటలతో ప్రతిధ్వనించేది. నాటి శ్రోతలకి అతని కంఠం బాగా పరిచయం. 1958లో బి.ఏ.లో డిగ్రీ తీసుకున్నా, [[హిందీ భాష|హిందీ]] పరీక్షలో విశారదుడైనా ఉన్న ఉత్సాహం సంగీతాన్ని ఎన్నుకున్నాడు, నమ్ముకున్నాడు కానీ ఉద్యోగ ప్రయత్నం మాత్రం చేయలేదు.
 
==నేపథ్య గాయకునిగా, గాత్రదాన కళాకారునిగా==
అప్పారావు మద్రాసు వచ్చి హెచ్.ఎమ్.వి. వారికి గ్రామఫోను పాటలు పాడటం మొదలుపెట్టాడు. ఒక రికార్డింగులో సంగీతదర్శకులు రాజన్, నాగేంద్రలు అవకాశం ఇప్పించి పాడించారు. [[బి.విఠలాచార్య]] ఆపారావుకి తన సినిమా [[జయ విజయ]] (1959)లో ''ఆడాలి ... పెళ్ళాడాలి'' అనేపాటను పాడించారు, ఆ పాటను చిత్రంలో [[హాస్యనటుడు]] [[వల్లూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] పాడతాడు. ఇదే అప్పారావు సినిమాలలో పాడిన మొదటి పాట. ఆ కాలంలో [[అనువాదం|అనువాద]] చిత్రాలు ఎక్కువగా ఉండేవి, అందులో అప్పారావుకి అవాకాశాలు వచ్చాయి, నాటకాలలో [[అనుభవం]] ఉండడం చేత ఆయన సంభాషణలను బాగా చెప్పగలిగారు.ఈ విధంగా అప్పారావు పాటలు పాడడంతో పాటు అనువాద చిత్రాలలో పాత్రలకు గాత్రం అందించటం మొదలుపెట్టాడు. అతని కంఠం, చెప్పే విధానం బాగా ఉండడంతో హీరో పాత్రలకు గాత్రదానం చేసే స్థాయికి ఎదిగాడు. ఆయన [[ఎం.జి.రామచంద్రన్]], [[జయశంకర్]], [[జెమిని గణేశన్]] లకు గాత్రం అందించాడు. హాస్యనటులైన [[నగేష్]], [[కులదైవం రాజగోపాల్]] లకూ ఆయన గాత్రదానం చేసారు. ముఖ్యంగా ఆయన [[నగేష్]]కు బాగా డబ్బింగు చెప్పేవారు. అప్పారావు సినిమాలలో 200లకు పైగా పాటలు పాడాడు. కొన్ని కలిసి పాడినవి ఐతే, కొన్ని యుగళ గీతాలు. [[పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా)|పరమానందయ్య శిష్యుల కథ (1966)]]లో ఘంటసాలతో ''పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా'' అనే పాటను పాడారు. [[బంగారు సంకెళ్ళు]] (1968)లో రాజబాబుకి ''తొలగండెహే'' అనే తాగుడు పాటని పాడారు. [[నిలువు దోపిడి]] (1968)లో [[ఎన్.టి.రామారావు]]కి ఒక పద్యం చదివినప్పుడు, [[నాగార్జున (1962 సినిమా)|నాగార్జున]] పద్యాలు, శ్లోకాలు చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు.
 
==సంగీత దర్శకునిగా==
''ఫలోమా'' అనే [[మలయాళ భాష|మలయాళ]] చిత్రం [[హిందీ భాష|హిందీ]] దబ్బింగుకి వచ్చింది, దానికి అప్పారావుని సంగీత దర్శకునిగా తీసుకున్నారు. టైటిల్స్‌లో అన్నీ హిందీ పేర్లే ఉన్నాయి, వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకని సినిమావారు ఆయనకు చెప్పి చక్రవర్తిగా వేశారు. [[మూగ ప్రేమ]] (1970) చిత్రంకి ఆయన సంగీత దర్శ్కత్వం వహించారు, అందులోనూ చక్రవర్తి పేరు ఖాయమైంది. ఈ విధంగా అప్పారావు చక్రవర్తిగా మారాడు. [[మూగ ప్రేమలోప్రేమ]]<nowiki/>లో పాటలు బాగున్నాయి అని పేరు వచ్చిన తరువాత, [[భలే గూఢచారి]] (1970), [[తల్లీ కూతురు]] (1971)లకు సంగీత దర్శకత్వం వహించారు. మూగ ప్రేమలో ''ఈ సంజెలో...'', ''నాగులేటి వాగులోన...'' పాటలు పేరు తెచ్చినట్లు, తల్లీ కూతురు పాటలు కూడా పేరు తెచ్చాయి. అయినా అతను అంతగా పేరు తెచ్చుకోలేదు. కొంత కాలం ప్రయత్నాలు అటూ-ఇటూ సాగాయి. వీటి మధ్య దర్శకుడు [[సి.ఎస్.రావు]] దగ్గర సహాయ దర్శకుడిగా చేరి [[నిలువు దోపిడి]], [[మళ్ళీ పెళ్ళి (1970 సినిమా)|మళ్ళీపెళ్ళి]], [[కంచుకోట]], [[పెత్తందార్లు]] సినిమాలకు పనిచేశాడు. మధ్య మధ్యలో తనకి ఇష్టమై శాఖ సంగీతాన్ని విడిచి పెట కుండా పాటలూ పాడేవాడు. [[శారద (1973 సినిమా)|శారద]] చిత్రంతో సినీ రంగంలో స్థిరపడ్డారు. [[అక్కినేని నాగేశ్వరరావు]]తో ప్రేమాభిషేకం, [[నందమూరి తారకరామారావు|ఎన్.టి.రామారావు‌]]తో [[కొండవీటి సింహం (1969 సినిమా)|కొండవీటి సింహం]] వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించి 850 తెలుగు చిత్రాలకు సంగీతాన్ని అందిచారు. చక్రవర్తి కొన్ని చిత్రాలలో కూడా నటించారు.చివరిసారిగా [[నిన్నే ప్రేమిస్తా]] చిత్రంలో [[సౌందర్య]] నాన్నగారిగా నటించారు.
 
== సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/కె._చక్రవర్తి" నుండి వెలికితీశారు