నోబెల్ బహుమతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
బహుమతికి అర్హులైన వారిని ఎంపిక చేసుకోవడానికి విస్తృతమైన పరిశోధన అనుసరిస్తారు. తద్వారా జరిపే మూల్యాంకన విధానమే ఇప్పటికీ ‘నోబెల్‌ బహుమతి’ యొక్క ఘనతకు, గౌరవానికి కారణం. నోబెల్‌ బహుమతికి అర్హులను ఎన్నిక చేయటానికి కొందరు వ్యక్తులను ఎన్నుకొనబడతారు. అందుకుగాను ఎన్నిక చేయబడిన వ్యక్తులలో ఒకరు సిఫారసు చేస్తూ నోబెల్‌ బహుమతి పొందటానికి అర్హులని వ్రాత మూలకంగా తెలియపరిస్తే అర్హత పొందగల్గుతారు. నోబెల్‌ బహుమతి ప్రకటించే సంస్థలు దాదాపు ఆరువేల మంది వ్యక్తులను ప్రతిపాదించటానికి లేక నామ్నీకరణం చేయటానికి ఆహ్వానిస్తారు. [[నోబెల్‌ శాంతి బహుమతి]] మాత్రం కేవలం సంస్థలకే ఇవ్వడం జరుగుతుంది. నోబెల్‌ కమిటీ తన సన్నాహక కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రారంభిస్తుంది. బహుమతి ప్రదాన కమిటీలు పూర్తి నిర్ణయాలు అధికారాలు ఉన్న సంఘాలు, ఏకగ్రీవంగా కమిటీ చేసిన ఏ ప్రతిపాదననైనా కూడా బహుమతి నిర్ధాయక సంఘం తోసిపుచ్చవచ్చు. బహుమతి నిర్ధాయక సంఘంవారి అంతిమ నిర్ణయం తిరుగులేనిది. ఆ నిర్ణయాలకు ఇక పునర్విచారణ ఉండదు.
 
==నోబెల్‌ బహుమతి విలువ..==.
 
నోబెల్‌ బహుమతి ప్రదానోత్సవము ప్రతి సంవత్సరము [[ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌]] వర్ధంతి అనగా [[డిసెంబరు 10]]వ తేదీ నాడు జరుపబడుతుంది. ఈ బహుమతి ప్రదానోత్సవం [[స్టాక్‌హోమ్|స్టాక్‌హోమ్‌]] సమావేశ మందిరంలో జరుగుతుంది. [[స్వీడన్|స్వీడన్‌]] రాజు చేత ప్రతీ బహుమతి గ్రహీతకు ఒక యోగ్యతాపత్రము, బంగారు పతకము, బహుమతి ధన మొత్తాన్ని నిర్థారించుతున్న పత్రములు బహుకరించబడతాయి. నోబెల్‌ బహుమతికై ఇచ్చే ధనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. నోబెల్‌ తాను స్థాపించిన పరిశ్రమలపై వచ్చే ధనాన్ని కూడా కొంత భాగం దీనికి మళ్ళించినందువల్ల ఈ మొత్తం సంవత్సరం, సంవత్సరం మారుతూ వుంటుంది. దీని విలువ స్విస్‌ కోనార్టు నుండి భారతీయ... విలువ ప్రకారము 300 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా.
 
"https://te.wikipedia.org/wiki/నోబెల్_బహుమతి" నుండి వెలికితీశారు