"భారతీయ జనసంఘ్" కూర్పుల మధ్య తేడాలు

(ఇక్కడ అవసరంలేని సమాచారం తొలగింపు)
== దేశంలో అత్యవసర పరిస్థితి కాలం ==
[[1975]]లో దేశంలో [[ఇందిరా గాంధీ]] ప్రభుత్వం [[అత్యవసర పరిస్థితి]] విధించడంతో విపక్షాలకు చెందిన పలు నేతలను ఎలాంటి కారణం లేకుండానే జైళ్ళకు తరలించారు. అదే కాలంలో భారతీయ జనసంఘ్ ప్రముఖ నేతలు కూడా జైలుజీవితం గడిపారు. [[1977]]లో అత్యవసరపరిస్థితిని తొలిగించి ఎన్నికలు జరుపడంతో దేశంలో మారిన రాజకీయ సమీకరణాల వలన భారతీయ జనసంఘ్‌తో పాటు [[భారతీయ లోక్‌దళ్]], కాంగ్రెస్ (ఓ), సోషలిస్ట్ పార్టీలు కలిసి ఉమ్మడిగా జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నికలలో ఈ పార్టీ విజయం సాధించడంతో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా జనతా ప్రభుత్వం పేరు సంపాదించింది. [[మురార్జీ దేశాయ్]] నేతృత్వం వహించిన జనతా ప్రభుత్వంలో పూర్వపు జనసంఘ్ నేతలైన అటల్ బిహారీ వాజపేయికి విదేశాంగ మంత్రిత్వ శాఖ లభించగా, లాల్ కృష్ణ అద్వానీకి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ లభించింది.
 
==జనసంఘ్ అధ్యక్షులు (కాలక్రమంలో)==
*[[శ్యాంప్రసాద్ ముఖర్జీ]] (1951–52)
*[[మౌళిచంద్ర శర్మ]] (1954)
*[[ప్రేమ్‌ నాథ్ డోగ్రా]] (1955)
*[[ఆచార్య డి.పి.ఘోష్]] (1956–59)
*[[పీతాంబర దాస్]] (1960)
*[[అవసరాల రామారావు]] (1961)
*[[ఆచార్య డి.పి.ఘోష్]] (1962)
*[[రఘు వీరా]] (1963)
*[[ఆచార్య డి.పి.ఘోష్]] (1964)
*[[బచ్చరాజ్ వ్యాస్]] (1965)
*[[బలరాజ్ మధోక్]] (1966)
*[[దీన్ దయాళ్ ఉపాధ్యాయ]] (1967–68)
*[[అటల్ బిహారీ వాజపేయి]] (1968–72)
*[[లాల్ కిషన్ అద్వానీ]] (1973–77)
 
== భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ==
923

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2210884" నుండి వెలికితీశారు