కె.వాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కె.వాసు'''గా పిలువబడే కొల్లి శ్రీనివాసరావు ప్రముఖ దర్శక నిర్మాత. ఇతని తండ్రి ప్రముఖ దర్శకుడు [[కోటయ్య ప్రత్యగాత్మ|కె.ప్రత్యగాత్మ]]. మరొక ప్రముఖ దర్శకుడు [[కొల్లి హేమాంబరధరరావు|కె.హేమాంబరధరరావు]] ఇతని బాబాయి.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1951]], [[జనవరి 7]]వ తేదీన [[హైదరాబాదు]]లో కె.ప్రత్యగాత్మ, సత్యవతి దంపతులకు జన్మించాడు. ఇతని తల్లిదండ్రులిద్దరూ కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం నుండి వచ్చినవారు. ఇతని మేనమామ చలసాని శ్రీనివాసరావు గొప్ప కమ్యూనిస్టువాది. అతడు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంవత్సరానికి ఇతడు జన్మించాడు. ఆయన జ్ఞాపకార్థం ఇతనికి శ్రీనివాసరావు అని నామకరణం చేశారు. ఇతని తాత కోటయ్య గుంటూరులో ఋషీకేశ్ ఆశ్రమాన్ని స్థాపించాడు. వాసు పదవ తరగతి వరకు మద్రాసులోని కేసరి హైస్కూలులో చదివాడు. తరువాత మెట్రిక్యులేషన్ కొరకు గుంటూరు, హైదరాబాదులలో చదివాడు. కానీ ఇతనికి చదువు అబ్బలేదు. ఇతని బాబాయి కె.హేమాంబరధరరావు ఇతనికి తన సినిమాలలో అప్రెంటీస్‌గా చేర్చుకున్నాడు. తరువాత ఛాయాగ్రాహకులు ఎం.జి.సింగ్, ఎం.సి.శేఖర్‌ల వద్ద రెండేళ్ళు కెమెరా అసిస్టెంట్‌గా, ఎడిటర్ బి.గోపాలరావు వద్ద ఎడిటింగ్ అసిస్టెంట్‌గా ఒక సంవత్సరం పనిచేశాడు. తరువాత తన తండ్రి ప్రత్యగాత్మ వద్ద ఆదర్శకుటుంబం, మనసు మాంగల్యం, పల్లెటూరి బావ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/కె.వాసు" నుండి వెలికితీశారు