నాయనార్లు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి, ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Scriptures AS.jpg|thumb|right|200px|శివభక్తులు]]
[[నయనార్లు]] క్రీ.శ 5 మరియు 10వ శతాబ్దాల మధ్య [[తమిళనాడు]] రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన తమిళ ప్రబంధం '''పెరియపురాణం'''లో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు.
 
ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.
 
==చరిత్ర==
క్రీ.శ.4,5 శతాబ్దములవరకున్ను దేశములో [[బౌద్ధ మతము|బౌద్ధ]], [[జైన మతము|జైన]] మతములు సుస్థిరపడినవి. వాటిమూలమున వైదికమతమునకు గొప్ప దెబ్బ తగిలినది. జైన బౌద్ధములకు పూర్వము తమిళదేశములో నుండిన మతములెట్టివో తెలియదుకాని, ఉత్తరమునుంచి బ్రాహ్మణులు వలసవచ్చిననాటినుంచిన్ని వాటిని వైదికమతముతో సంబదించినవాటిగా మార్చడానికి ప్రయత్నించి ఉంటారు. ఈ ఉత్తరవైదికమతముకున్ను, దక్షిణాత్యమతములుకున్ను కలిగిన సమ్మేళనము వలన క్రొత్త సంప్రదాయము లీ ప్రాంతములలో ఏర్పడినవి.
ఇవియే తమిళశైవ సంప్రదాయము, తమిళవైష్ణవసంప్రదాయము అనేవి. తమిళశైవ సంప్రదాయము నాయనార్ల మూలమునను, తమిళవైష్ణవ సంప్రదాయము [[ఆళ్వార్ల]] మూలమును వ్యాప్తిచెందినవి.
 
పంక్తి 16:
జైన సంప్రదాయములో '''త్రిషష్టిశలాకా''' పురుషులున్నారు. ఈత్రిషష్టినటులే శైవులు ఉపయోగించుకునారు. త్రిషష్టి సలాకా పురుషులలో 24 తీర్ధంకరులు, 12 గురు చక్రవర్తులు, 9 గురు బలదేవులు, 9 గురు వాసుదేవులు, 9 గురు ప్రతివాసుదేవులు చేరినారు. మొతాం 63 మంది అయినారు. ఈ సంఖ్యను తప్పిస్తే కార్యములేదు. కాబట్టి తమిళనాయనర్లు మొత్తం 63 మంది. వీరిలో 24 గురు తీర్ధంకరులలో మొదటివాడు ఋషభుడు. ఇతడు శైవములో బసవడైనాడు.మూడోవాడు శంభవుడు. ఇతడు నాయనార్లలో శంభుచిత్తుడైనాడు. నాలుగోవాడు అభినందనుడు. ఇతడే అభిరాముడనే నాయనరయినాడు. ఇతడే నందుడుగకూడా మారి ఉంటాడు. 7వ తీర్ధంకురడైన సుపార్స్వనకును, 23 వవాడైన పార్స్వునకును మారుగా పూసలనాయనా ఏర్పడినాడు. ఇతడు తొమ్మిదో తీర్ధంకురుడైన పుష్పదంతునికి కూడా శాఇవప్రతినిధి కావచ్చును. చంద్రపభుడనే 8వ తీర్ధంకుడే చండేశనాయనారయి ఉంటాడు. 15వ తీర్ధంకరుడు ధర్ముడు. ఇతడు నాయనార్లలో ధర్మభక్తుడైనాడు. 17 వ తీర్ధంకరుడైన కుంధు అనేవాడు కుత్తవనాయనారుగా అయి ఉండవచ్చును.
 
వీర శైవము తలదూపినదాక బసవడులేడు. బసవేశ్వరునికి పూర్వసంప్రదాయములో అతడు ఋషభునికి నామాంతరమైన ఆదినాధునికి దగ్గర ఉచ్చారణ గల అతిభక్తుడు అనేపేరుతో నిలిచాడు. ఈఅతిభక్తుడే ఆడిభర్త, అతిపత్తార్ అనేనామాంతరములతో కనబడుతున్నాడు. ఇదిగాక నాయనార్లలో కొందరికి జైనమతముతోడి సంబంధము శాఇవసంప్రదాయములో కూడా విస్మృతము కాలేదు. వాగీశనాయనారనే నామాంతరము గల అప్పరుకు ధర్మసేనుడనే పేరుకూడా ఉంది. అప్పరు అనేక జైనగ్రంధములనుకూడా వ్రాసినాడు. జైన మతమునకున్న, శైవమునకున్ను[[శైవము]]<nowiki/>నకున్ను గల ఇట్టి పోలికలనింకా విస్తరించి వ్రాయవచ్చును. ఇట్లే బౌద్ధముతోడి పోలికలుకూడా ఈ శైవములో కనబడుతున్నవి. శాక్యనాధుడనే నాయనారు స్వయముగా శాక్య నాధుడైన బుద్ధభగవానుని ప్రతిబింబమే. అట్టి పోలికను మరుగుపెట్టడానికాపేరును సాంఖ్యతొండుడుగా మార్చుకొన్న సాంఖ్య తొండడే శాక్యనాధుడనే స్మృతి శైవసంప్రదాయము నుంచి తొలగిపోలేదు.
 
నాయనార్లెందరో మనకు చరిత్రలో కనబడతారు. కాని వీరందరున్ను అరవత్తుమూవురలో చేరలేదు. అరవైమూడు అనేసంప్రదాయము మొదట తమిళనాడులో పుట్టినది. తమిళము పేళ్ళాకు సంస్కృతనామములు కల్పించి సంస్కృత గ్రంథములలో చేర్చారు. ఇదే తరువాత కర్ణాటకకు[[కర్ణాటక]]<nowiki/>కు, [[తెలుగు]] దేశానికి వ్యాపించింది. ఈ వ్యాప్తిలో ఆయా తమిళపు పేళ్ళు అనేక వికారములకులోనై వివిధరూపములను పొందినవి. ఈ పేళ్ళు పట్టిక ఒక్కో భాషలో ఒక్కో గ్రంథములో[[గ్రంథము]]<nowiki/>లో మారుతూ వచ్చినవి.
 
తమిళము : పెరియపురాణము: పేక్కిలారు విరచితము. 19 వ శతాబ్దములోనిది.
పంక్తి 49:
#కానమ పుల్ల నయనారు
#కన్నప్ప నాయనారు
20 '''కన్నప్ప తెలుగు వాడు'''.. రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం..ఆప్రాంతానికి నాగడు అనే ఒక బోయరాజున్నాడు. అతని ఇల్లాలు పేరు దత్త. వీరిరువురూ [[సుబ్రహ్మణ్యస్వామి]] భక్తులు.స్వామి దయవలన వీరికి కలిగినపుత్రుడుకి తిన్నడు అనేపేరు పెట్టుకొన్నారు. నాగడికి తిన్నడు సకలవిద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవానిగా తన కులధర్మముననుసరించి వేటాడినా - తిన్ననికి అన్ని జీవులయెడ - కరుణ, ప్రేమలు పుట్టుకనండి అభివృద్ధినొందాయి. జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటిని వేటాదేవాడు కాదు. తనలోని జంతు భావాలైన [[కామం|కామ]], [[క్రోధం|క్రోధ]], మద మాత్సర్యాలను జయించాడు.
 
ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పంది అతని వల నుంచి తప్పించుకుని పారిపోజూచింది. తన అనుయాయులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు. దానికి అలసట వచ్చి, చెట్టుముందర ఆగింది. [[తిన్నడు]] దాన్ని చంపాడు. అందరూ అలసిపోయారు, దప్పికైంది. దాన్ని మోసుకుని స్వర్ణముఖీనదీ తీరానికి పోయారు. కాళహస్తి కొండ, [[దేవాలయం|దేవాలయము]] కన్పించాయి.
 
తిన్నడికి ఆ పర్వతమెక్కి - గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది. అక్కడ [[పరమేశ్వరుడు]] కుడుము దేవారు (పిలకవున్న దేవుడు) అని నాముడు చెప్పాడు. కాముడు పందిని[[పంది]]<nowiki/>ని వచనము చేయ మొదలుపెట్టాడు.
ఆ కొండఎక్కుతుండగానే తిన్ననిలో అంతకుముందెన్నడు తనకు అనుభవంగాని అలౌకికానంద పరవశుడవసాగాడు. అది పూర్వ జన్మసంస్కార ఫలితము. తన మీదనుంచి ఏదో [[బరువు]] తగ్గుతున్నట్లనిపించసాగింది..దేహస్పృహకూడా మందగించసాగింది.. అక్కడ శివలింగమును కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగమును కావలించుకున్నాడు..ముద్దులు గుమ్మరించాడు..ఆనందబాష్పాలు రాలటంతో, శివునితో ' ఈశ్వరా! ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారము ఎలా వస్తుంది? నీకు తోడెవరుంటారిక్కడ? నేను నీతోనే ఉంటాను. అయ్యో! నా తండ్రీ ఆకలిగా[[ఆకలి]]<nowiki/>గా ఉందేమోకదా నీకు..ఉండు ఆహారం తీసుకువస్త్తాను' అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక, వెళ్ళలేకపోయాడు...చివరికి శివుని ఆకలిదీర్ఛుటకు వెంటనే కొండదిగాడు. కాముడు పచనము చేసిన పందిమాంసమును రుచి చూచి మంచిది శివునికి వేర్పరిచాడు. 'నాముడు ఈశ్వరునికి [[ఆహారం|ఆహారము]] సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడుతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. అది విన్న తిన్నడు నదినుండి నోటినిండా నీళను పుక్కిలి బట్టి సేకరించిన పూలను తనతలమీద వుంచుకొని పచనము చేసిన మాంసమును చేతిలో వుంచుకొని, విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్లాడు. అక్కడ పుక్కిలిబట్టిన నీరును శివునిపై వదిలాడు. అది అభిషేకమైంది. తలమీద వున్న పూలతో శివుని అలంకరంచాడు. అది అర్చన అయింది. తర్వాత తాను తెచ్చినపందిమాంసమును దేవునిముందు పెట్టాడు. అది ఆయనకు నివేదన అయింది. ద్వారము వద్ద ఎవరిని, ఏ జంతువులను రానీకుండా కాపలా కాశాడు... ఆ బోయవాని మూఢభక్తి భోళాశంకరుడైన ఆ కైలాసనాథున్ని కదిలించింది.... మరునాడు ప్రొద్దున మళ్లీ ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్లాడు. నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడులో వచ్చిన మార్పును మతిభ్రమణమేమోనని భావించి వెంటనే వెళ్లి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు. వారు తిన్నని ఇంటికి తీసికొని పోజూచారు. తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్లలేదు.
 
తిన్నడు దేవునికాహారము సేకరించటానికి వెళ్ళగా, ఆలయ అర్చకుడు సివగోచారి శివుని దైనందికార్చనకు వచ్చాడు. ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు, నిర్ఘాంతపోయాడు. ఆగమాల్లో ఆ అర్ఛకుడు నిష్ణాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోషణ్ గావించి మళ్లీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖీ జలముతో అభిషేకము చేసి, పూలతోనలంకరించి విభూతినలిమి, తెచ్చిన పళ్లు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్లాడు.
పంక్తి 66:
 
'''తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్పనాయనారు అయ్యాడు.''' నేత్రేశనాయనారు అనునది సంస్కృతనామము.
[[శివుడు]] తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసొకొని ప్రక్కకు చేర్ఛుకున్నాడు. కన్నప్పకు చూపువచ్చింది. సాక్షాత్తూ శివుని వలె జీవించాడు. శివగోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది.
మహాభక్తుడైన తిన్నడు తన కళ్లనే పెకలించి శివునికిచ్చుటలో తిన్నని సంపూర్ణశరణాగతి ఆత్మనివేదన గోచరిస్తుంది. అంతకన్నా అనితరమైన భక్తితత్పరత కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింప చేసింది.
ఇలా వేదం, నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏవీ ఎరుగని ఒక మామూలువ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుని[[మహాదేవుడు|మహాదేవు]]<nowiki/>ని ప్రసన్నంచేసుకున్నాడు.
ఈ భక్తిసామ్రాజ్యరారాజు..ఒక్క శైవులకే కాదు.. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు.
 
పంక్తి 162:
మైసూరు ఇలాకా నంజంగూడు గ్రామములోని నంజుండేశ్వరాలయములో [https://en.wikipedia.org/wiki/Nanjangud Nanjangud] ఈ 63 నాయనార్ల విగ్రహములు నిలుపబడి యున్నవి. ఇవి శిలావిగ్రహములుగాను, వాటికి ఉత్సవ విగ్రహములైన లోహవిగ్రహములుగాను రెండు విధములగ ఉన్నాయి. శిలావిగ్రహములపైన మైనముపట్టి వాటి అమదము మరుగుపడినది. ఈవిగ్రహములు ఏకాలమునాటివో నిర్ణయించబడలేదు. కాని వాటి తీరును బట్టి 15వ శతాబ్దము నాటివని అని కొందరు అంటారు.ఈ విగ్రహముల అడుగు భాగమున ఆయా నాయనార్ల పేర్లు కూడా వ్రాయబడియున్నది.కాని ఈ విగ్రహములు అక్కడ 66 ఉన్నవి వాటిలో ఒకదానికి పేరు చెక్కబడలేదు.ఈ అరవైఆరింటిలో ఏమూటిని నాయనార్ల విగ్రహములు కావో నిర్ణయించడము కష్టము.
 
హాలాస్యమాహాత్మ్యములో 63 రు నాయనార్ల చరిత్ర ఉన్నది కాని, ఈ నాయనార్లు మధూనేలిన రాజులనిన్ని, వారి చరిత్రములు శివుని 63 లీలలని చెప్పబడినవి. కాని, నాయనార్లందరు రాజులుగా తక్కిన గ్రంథములలో చెప్పబడిలేదు. అందుకే ఇది ప్రామాణికముగా తీసుకొనలేము.ఇక [[పాల్కూరికి సోమనాధుడు]] పండితారాధ్యచరిత్రములో అతడు 64రు సంఖ్యను చెప్పి 53 పేర్లను మాత్రమే ఇచ్చాడు.
 
==పాల్కూరి సోమనాధుని పట్టిక==
పంక్తి 168:
1. ఆదిభర్త
 
ఇతనికి తమిళములో[[తమిళ భాష|తమిళము]]<nowiki/>లో అతిపత్తరనిన్ని, సంస్కృతములో అతిభక్త అని పేళ్ళు.పండితారాధ్యచరిత్రములో ఇతనిపేరుమాత్రమున్నది గని ఇతని వృత్తాంతము పెద్దగాలేదు. ఇతడు బెస్తవాడని, తనకు ప్రతిదినమున్ను దొరికిన మొదటి చేపను శివుని కర్పించేవ్రతము కలవాడని, తనకొకనాడు బంగారుచేపదొరకగా సంకోచింపక శివునకు సమర్పించి నాడని, దానికి మెచ్చి శివుడతనికి కైలాసవాసమిచ్చినాడని తమిళ గ్రంథములు తెలుపు చున్నవి.
 
2.అమరనీతి
పంక్తి 180:
4. అళియదంగుళినాయనారు
 
ఇతనికే మహాధనుడనికూడా పేరున్నది. తెనుగు బసవపురాణ, పండితారాధ్యచరిత్రములోను ఈపేరున్నట్లు ఉంది. ఇతడొక శూద్రుడు. ఒకానొక వృద్ధశైవభక్తుడు అర్ధరాత్రివేళ వర్షములో వడవడ వణుకుతు ఆకలితో ఇంటికి రాగా, అతని ఆదరించి ఆఉదయమే పొలములో రాను చల్లిన వడ్లనేరితెచ్చి, దంచి, అన్నమువండిపెట్టి ఆకలితీర్చినాడట. ఆశైవభక్తుడు అన్నముతిని అతడుండిన పాకను కాల్చి తెల్లవారేసరికి అదృశ్యుడైనాడట. పాకను కాల్చిన విషయము పెరియపురాణములో లేదు. ఈ నాయనారి విగ్రహము నంజుడేశ్వరాలయములో లేదు. ఈ అళియదంగుళినాయనారు, ఇదంగళి నాయనారు ఒక్కరేనా? ఇదంగళినాయనారు పేరు పెరియపురాణములో ఉంది. సంస్కృతములో[[సంస్కృతము]]<nowiki/>లో ఇదనికి ఇదంకృషి అనిపేరు. ఇతడొక చోళరాజు. ఇతడు తనధాన్యపుకోట్లలోని ధాన్యము నొకదొంగ ఎత్తుకొనిపోగ వానిని రాజు ఎదుటికి తెచ్చారు. రాజతనిని దండించక తనధాన్యపు కొట్లను, భండారమును శైవవభక్తులు యధేచ్చగ వినియోగించుకోవలసినదని చెప్పి దొంగతనమే అనావశ్యక మయ్యేటట్టు చేసాడు.
 
5. ఇరువదాండారి
 
ఇతనికి సాహసప్రియుడని పేరు. ఇతనికి ఇరువత్తుడని పేరున్నది. ఇరువోతు అనేభక్తుడు కూడా ఇతడేనేమో! తమిళములో ఇతనికి ఇరిపత్తునాయనార్, ఇరిభక్త అని, సంస్కృతములో వీరభక్త అనిపేళ్ళు. పండితారాధ్యచరిత్రములో ఇతనిపేరుమాత్రమున్నది. తెలుగు బసవపురాణములో ఇతని కథ: ఇతడు శివద్రోహరగండ బిరుదాంకితుడు. శివద్రోహపాతకులను కారణములేకుండానే చంపుతాననే [[నోము|వ్రతము]] గలవాడు. ఒకనాడొక భక్తుడు శివపూజార్ధమై పూవులను తీసుకొనిపోతూ ఉండగా ఆఊరి రాజైన కరయూరిచోడనిఏనుగ అతనికెదురై, తొండముతో పైకెత్తి, క్రిందకిపడవైచి దంతములతో పొడిచింది. అతని ఆర్పును ఇరువదాండారి వినివచ్చి ఏనుగును, దానిమావటిని చంపినాడు. రాజీవార్త వినివచ్చి భృత్యాపరాధమునకు స్వామియే దండనక్ర్హుడని తానే ఆత్మవధ కుద్యుక్తుడు కాగా శివుడు ప్రత్యక్షమై రాజునకును, ఇరువదాండారికిని కైలాసప్రాప్తి కలుగజేసినాడు. తమిళ పెరియపురాణములోని కథలో రాజుపేరు పాగళ్చోడుడని ఉంది. పొగళ్చోళునికి మనుచోళుడు, అనపాయచోళుడు అనేవి నామాంతరము లయినట్లు తమిళగ్రంధములవలన తెలుస్తున్నది.
 
6 ఎళ్పఘ (అభూతచరుడు)
పంక్తి 200:
9 కడమలనంబి
 
ఇతడు శివునకు నిత్యము వేయి దీపముల [[వ్రతము]] కలవాడై ధనము అంతా వెచ్చించి మరేమిన్ని లేకపోగా తనజుట్టుకు నిప్పంటంచుకొని తానే అఖండ దీపముగ వెలిగినాడని బసవపురాణములో ఈతని కథ చెప్పబడియున్నది. ఇతడే పెరియపురాణములో ఉదహరింపబడిన కణ్ణంపాల నాయనారు.దీపదకళియారు కథకూడా ఇటువంటిదే.
 
10. కన్నప్ప
పంక్తి 252:
22.గుగ్గుళుకళియారు
 
ఇతడే మానధనుడు. ఇతనికి తమిళములో కుంకుళినాయనార్ అనిపేరు. బసవపురాణములో ఇతని కథ ఇటులున్నది. ఇతడు త్రికాలములలోనూ శివునికి గుగ్గులుధూపము వేసేవ్రతము కలవాడై, ధనమంతా వ్యయముకాగా తనాఅలిమంగళిసూత్రమును కూడా అమ్మివేసినాడు. తిరుపరంధామ అనేపురములో ఉరగేశ్వరలింగముముందర ఉరగ కన్యకలు పాడగా పారవశ్యముచేత లింగము ముందునకు వ్రాలినది. లింగమును[[లింగములు|లింగము]]<nowiki/>ను సరి చేయటానికెన్నో ప్రయత్నములు జరుపగా చివరికి ఇతడు రాజు దగ్గరకు పోయి తనకు సరిపడ గుగ్గిలము ఇస్తే తను సరిజేస్తానని చెప్పినాడట. రాజొక గుగ్గిలపు రాశినివ్వగా, కళియారొక బట్టను చించి దాని ఒకకొనను లింగమునకు, రెండోకొనను ఖడ్గమునకు కట్టి, ఖడ్గమును మెడమీదపెట్టుకొని వెనుకకు నిగుడడమును చూచి ఆ నాగేశుడు ఈపటివలే లేచాడు.
 
23. గోనాధుడు
పంక్తి 260:
24. చండేశుడు
 
ఇతడు [[బ్రాహ్మణుడు]]. ఆవులకాపరు ఆవులను హింసించడమును సహించక తానే ఆవులకాపరిగా మారి వాటిని తీసుకొపోయి వాటిపాలను లింగముపై పిండి అభిషేకము చేశ్తూ ఉండేవాడు.ఆవుల కాపురి అతని తలితండ్రులతో మొరపెట్టుకొనగ తండ్రి పోయి చండుని మమదలించాడుట. చండునికి కోపము వచ్చి తండ్రి అని గమనింపక అతని తలనుతెగవేసినాడు. శివుడు మెచ్చుకొన్నాడు.
 
25. చిరుతొండడు.
 
ఇతడు సుప్రసిద్ధ శివభక్తుడు. సెట్టికులమువాడు.ఒక చోళరాజు సేనానాయకుడు.పశ్చిమచాళుక్యుల రాజధాని అయిన వాతాపి (బాదామి) దుర్గమును పట్టుకొని, దాని రాజు అయిన రెండవ పులకేశిని తనరాజు కప్పగించాడు. ఇతని కొడుకు శ్రీలాలుడు, లేక సిరియాలుడు. చిరుతొండడు శివుని కోరికమేరకు పసివాడాయిన కొడుకును[[కొడుకు]]<nowiki/>ను చంపి అతనిమాంసము నారగింపుచేసాడు. అనిశ్చల భక్తిని మెచ్చి శివుడు సిరియాలుని బ్రదికించి చిరుతొండనుకి కైలాసప్రాప్తి ననుగ్రహించాడు. ఇతనికి సంస్కృతములో భద్రభక్తుడని పేరు. శైవేతరులు వెక్కిరింపుగా ఇతనిని దభ్ర భక్తుడని అందురు. శైవులున్ను అదేపేరుతో పిలువడమే వింత. నంజుడేశ్వరాలయము విగ్రహముపై ఇతని పేరు ధర్మకేతుడని ఉంది.
 
26. చిరుత్తాణ
 
తమిళములో నరసింగనాయనార్ అనిపేరు. సమస్కృతములో రణమిత్రుడని పేరు. నరసింహముని శివభక్తుడయిన రాజనిన్ని, సుందరనంబిని కొడుకుగా పుంచుకున్నాడని తమిళపురాణము చెప్పుచున్నది. పెరియపురాణములో శివభక్తుడుగా తెలుపబడిన కళర్చింగనాయనారు కూడా ఈ నరసింగనాయనారే. ఇతడే [[కాంచి|కాంచీ]] పురాధీశుడయిన పల్లవరాజు నరసింహవర్మ. ఇతనికి సింహాంక, పాదసింహ, పంచపాదసింహ అని పేర్లు. ఇతని భార్య శివ నిర్మాల్యమైన పూలదండను చేతితోతీసి మూర్కొనగా ఆదోషమునకు భార్య చేతులను నరకి వేసినాడు.
 
27 చిరుపులి
"https://te.wikipedia.org/wiki/నాయనార్లు" నుండి వెలికితీశారు