రఘుబాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
గిరిబాబు నటుడే అయినప్పటికీ పిల్లల్ని సినిమాలకు దూరంగా ఉంచేవాడు. ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది కాదు. మామూలు మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుందో అలాగే ఉండేది. కాబట్టి నటించాలన్న ఆలోచన మొదట్నుంచి లేదు. ప్రొడక్షన్‌ పనులు చూసుకోవడానికి ఫీల్డులోకి వచ్చాడు. కాబట్టి ఎప్పటికైనా నిర్మాత అయి మంచి సినిమాలు తీయాలన్న కోరిక బాగా ఉండేది.
 
[[1984]] వచ్చేసరికి పూర్తిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. కొన్ని [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[తమిళ భాష|తమిళ్‌]] సినిమాలు [[తెలుగు]]<nowiki/>లోకి డబ్‌ చేసి విడుదల చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే [[ఆహుతి ప్రసాద్]]‌, [[శివాజీరాజా]], [[చిన్నా]], కిషోర్‌బాబు, మల్లి తదితరులు పరిచయమయ్యారు. వీళ్లందరూ మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది అవకాశాల కోసం మద్రాస్‌కు వచ్చారు.
 
ఇతడు నటుడవ్వాలని పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. ఇతనికి నిర్మాత అవ్వాలనిపించింది. దర్శకత్వమూ ఇష్టమే. సత్యారెడ్డిగారి వద్ద చేరి సినిమా నిర్మాణం గురించి తెలుసుకోవాలనుకొన్నాడు. అనుకోకుండా సత్యారెడ్డి చిత్రం '[[దొంగలున్నారు జాగ్రత్త]]'లో ఇతడిని హీరోని చేశారు. ఆ సినిమా తర్వాత నటుడిగా పదేళ్లు విరామం వచ్చింది. అదృష్టం కొద్దీ దర్శకుడు [[కృష్ణవంశీ]]గారి దృష్టిలో పడ్డంతో ఇతని జాతకమే మారిపోయింది. 'మురారి'లో మంచి పాత్ర ఇచ్చారు. అందులో ఓ మూర్ఖుడిన పాత్ర. తను చెప్పేదీ, ఆలోచించేదే సరైనదని వాదించే పాత్ర అది. ఆ పాత్రతో గుర్తింపు వచ్చింది
"https://te.wikipedia.org/wiki/రఘుబాబు" నుండి వెలికితీశారు