రఘుబాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
}}
 
'''రఘు బాబు'''గా ప్రసిద్ధిచెందిన '''యర్రా రఘు బాబు''' (జననం: [[1960]] [[అక్టోబరు 10]])ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ నటుడు. విలన్ గా, హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు పోషించాడు. ఆయన తండ్రి [[గిరిబాబు]] కూడా [[తెలుగు సినిమా|తెలుగు]] వారికి సుపరిచితులైన నటుడు. [[ప్రకాశం జిల్లా]] [[రావినూతల]] గ్రామంలో జన్మించాడు. రఘుబాబు ఇంటికి పెద్ద కొడుకు. ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు.
 
పదేళ్ళ వయసులో అధ్యాపకులు పిల్లలందర్నీ కూడగట్టి [[శ్రీకృష్ణ తులాభారం]] నాటకం వేయించారు. అందులో ఆయన వసంతకుడి పాత్ర వేశాడు. దాన్ని ఒక్క ఏడాదిలో 22సార్లు ప్రదర్శించారు. ఆ నాటకం ఎంత ఆదరణ పొందిందంటే టిక్కెట్టు పెట్టి వేస్తే ఆరోజుల్లో పదివేలు వసూలయ్యాయి. ఆ డబ్బుల్తో [[రావినూతల]]<nowiki/>లో అరుణ కళానిలయం అనే ఆడిటోరియం కట్టారు. అక్కడ ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
"https://te.wikipedia.org/wiki/రఘుబాబు" నుండి వెలికితీశారు