"లారీ డ్రైవర్" కూర్పుల మధ్య తేడాలు

 
== కథ ==
రంగనాయకులు అనే వ్యక్తి డ్రైవర్లకు లారీలు అద్దెకిస్తుంటాడు. ఆ లారీ డ్రైవర్లకు నాయకుడు బాలమురళి. డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రంగనాయకులు వారిని మోసం చేస్తుంటాడు. జయమ్మ కొంతకాలం లారీని అద్దెకు తీసుకుని తర్వాత బ్యాంకు లోను సహాయంతో తానే ఒక లారీ కొనుక్కుంటుంది. తనలాగే మిగతా డ్రైవర్లను కూడా లారీ యజమానులు కమ్మని బ్యాంకు మేనేజరుతో మాట్లాడుతుంది. అందరూ తమ భార్య దగ్గర ఉన్న పుస్తెలతో సహా అమ్మి బ్యాంకు మేనేజరు చేతిలో పెడతారు. అయితే ఆ మేనేజరు రంగనాయకులుతో కుమ్ముక్కై వారిని మోసం చేస్తాడు. బాలమురళి వెళ్ళి అతనికి ఎదురు తిరుగుతాడు. అతను తప్పించుకుని పారిపోబోతాడు కానీ బాలమురళి, డ్రైవర్లందరూ కలిసి లాయరు సహాయంతో కేసు పెడతారు. బ్యాంకు మేనేజరు వెళ్ళి రంగనాయకులు సహాయం కోరతాడు. కానీ అతను ఏమీ చేయలేనంటాడు. బ్యాంకు మేనేజరు అప్రూవరుగా మారిపోతానని వెళ్ళిపోతుండగా రంగనాయకులు దగ్గరున్న రౌడీ అతన్ని హత్య చేస్తాడు.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2213553" నుండి వెలికితీశారు