యాగా వేణుగోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వృత్తి జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన [[రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా]] గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి [[2008]] [[ఆగస్టు]]లో పదవీవిరమణ చేసిన''' డా. [[వై.వి.రెడ్డి]]''' పూర్తి పేరు '''యాగా వేణుగోపాల్ రెడ్డి'''. రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నరైన వై.వి.రెడ్డి [[1964]] బ్యాచ్ కు చెందిన IAS ([[ఐ.ఏ.ఎస్]]) అధికారి. ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక, ప్రణాళికా రంగాల్లోనే సాగింది.
==వ్యక్తిగత వివరాలు==
[[1941]] [[ఆగస్టు 17]]న [[వైఎస్ఆర్ జిల్లా]] [[పుల్లంపేట]] మండలం [[కొమ్మనవారిపల్లె]] గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి యాగా పిచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి [[మద్రాసు రాష్ట్రం]]లో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించాడు. [[నంద్యాల]] [[కలెక్టర్‌]]గా కూడా ఆయన పనిచేశాడు. ఆయన వృత్తిరీత్యా [[మద్రాసు]]లో స్థిరపడడం వల్ల వేణుగోపాల్‌రెడ్డి చదువంతా [[తమిళనాడు]]లోనే సాగింది.
పంక్తి 42:
వేణుగోపాల్‌రెడ్డి IAS అధికారి కాకముందు [[1961]] నుంచి లెక్చరర్ గా పనిచేశాడు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో [[ఆర్థిక శాస్త్రం]]లో M.A., [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో Ph.D., [[నెదర్లాండ్స్]] లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియల్ స్టడీస్ లో ఆర్థిక ప్రణాళిక (Economic Planning) లో డిప్లొమా చేశాడు. అవే కాకుండా [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] (Doctor of Letters), [[మారిషస్ విశ్వవిద్యాలయం]] (Doctor of Civil Law) ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Department of Business Management) లోను, [[లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్]] (London School of Economics and Political Science - International Relations Department) లోనూ, Administrative Staff College of India లోనూ విజిటింగ్ ఫాకల్టీగా పనిచేసిన వై.వి.రెడ్డి [[హైదరాబాదు]]లోని CESS (Center for Economic and Social Studies) లో Honorary Senior Fellow గా కొనసాగుతున్నాడు.
 
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో (బ్యాంకింగ్) కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శి గా, వాణిజ్య మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా, [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] యాదృచ్ఛిక పేజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శిగా, ఆపైన [[1996]] నుంచి ఏడేళ్ళు రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరుగా సేవలందించాడు. [[రిజర్వ్ బ్యాంకు]] గవర్నరు కాకముందు [[ప్రపంచ బ్యాంకు]] సలహాదారుగా, [[అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ]] (IMF) బోర్డులో భారతదేశం తరపున ద్రవ్య వ్యవహారాల సలహాదారుగా పనిచేసిన రెడ్డి 2002లో IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితుడయ్యాడు. ఆర్థికాభివృద్ధి పథంలో ఈయన సలహాలను వినియోగించుకున్న దేశాల్లో [[చైనా]], [[బహ్రెయిన్]], [[ఇథియోపియా]], [[టాంజానియా]], తదితర దేశాలున్నాయి.
 
[[ఆర్థికరంగ సంస్కరణలు]], వాణిజ్యం, BoP (Balance of payments) మరియు ద్రవ్య మార్పిడి రేటు, విదేశీ వాణిజ్య ఋణాలు, కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ప్రాంతీయ ప్రణాళిక, ప్రభుత్వరంగ సంస్కరణలు, తదితర రంగాలలో ఆయన కీలక భూమిక నిర్వహించాడు.