కుంటాల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
[[ఆంధ్ర ప్రదేశ్]] లోనే అతి ఎత్తయిన జలపాతం '''కుంతల జలపాతం'''. ఇదిఇవి [[ఆదిలాబాదు]] జిల్లాలోజిల్లాలోని సహ్యాద్రి పర్వత ఫంక్తుల్లో [[కడెం నది]] పై ఉంది.[[కుంటాల]] 7గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉన్నాయి. 7వ నెంబర్ [[జాతీయ రహదారి]] పై [[నిర్మల్]] నుండి [[ఆదిలాబాదు]] పోవు మార్గానికి కొద్దిగా కుడివైపునకు ఈ [[జలపాతం]] ఉంది. 45 మీటర్ల ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో, [[సహ్యాద్రి]] పర్వత శ్రేణిలో [[గోదావరి]]కి [[ఉపనది]] అయిన '''కడెం''' నది పై ఈ జలపాతం ఉంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాదు నుండి ఇది 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం ఎత్తు 45 మీటర్లు.
 
జలపాతము యొక్క దిగువభాగము సమతల బండరాయితో కూడుకొని నునుపుదేలి జారుడుగా ఉండును. జలపాతం వద్ద గుండాలు చాలా లోతుగా ఉండి సుళ్ళు తిరుగుతూ ఉండటం వలన ఇక్కడి నీళ్ళలో ఈదటం చాలా ప్రమాదకరం. గతంలో ఈ జలపాతంలో పలువురు పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకొని దుర్మరణం పాలయ్యారు.
 
జలపాతానికి ఈ పేరు [[దుష్యంతుడు|దుష్యంతుడి]] భార్య [[శకుంతల]] నుంచి వచ్చిందని స్థానిక ప్రజల విశ్వాసం. ఈ జలపాతం మరియు పరిసరాల దృశ్యం చూసి శకుంతల మైమరిచిపోయి, తరుచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
 
ఈ ప్రాంతములో మూడు జలపాతాలు, గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతిసిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటంవల్ల ప్రతి సంవత్సరం [[శివరాత్రి]] రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకొని పూజలు నిర్వహించడాన్ని సోమన్నజాతరగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో రెండు రోజులపాటు ఈ జాతర జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.
 
జలపాతాలకు చుట్టు ఉన్న అడవి ఉష్ణమండల శుష్క ఆకురాలు వనాల రకానికి చెంది అన్ని జాతుల వృక్షాలు కలిగి అధికముగా టేకు చెట్లతో నిండి ఉన్నది. ఛాంపియన్ / సేథి అటవీ వర్గీకరణ ప్రకారము సమూహము 5నకు చెందినది. ఈ అడవిలో చాలా రకాల అటవీ జంతువులు మరియు పక్షులు ఉన్నాయి.
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జలపాతాలు]]
"https://te.wikipedia.org/wiki/కుంటాల_జలపాతం" నుండి వెలికితీశారు