వికీపీడియా:మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
===సమాచారం ఎక్కడ లబించిందో తెలుపండి===
మూలాలను తెలిపేటప్పుడు సాదారణంగా జరిగే తప్పు, అసలు సమాచారం ఇంకోదగ్గర ఉంది అని తెలిపిన మధ్యవర్తి గురించి తెలుపకపోవటం. ఉదాహరణకు మీరు ఒక వెబ్ సైటులో ఒక విషయాన్ని గురించి చదివారు, అదే వెబ్‌సైటులో ఆ సమాచారాన్ని ఫలానా పుస్తకం నుండి సేకరించబడినదని తెలుపుతారు, అలాంటప్పుడు మీరు స్వయానా ఆ పుస్తకాన్ని చదవందే దానిని వికీపిడియా మూలాలలో చేర్చకూడదు, ఆ మధ్యపర్తి అయిన వెబ్‌సైటు యొక్క చిరునామాని మాత్రమే మూలాలలో చేర్చాలి. అలాంటి వాటిని మూలాలలో ఇలా చేర్చాలి:
*<ఫలానా వెబ్‌పేజీ>, <ఫలానా పుస్తకం నుండి> ఈ సమాచారాన్ని సేకరించింది, లేదా
*<ఫలానా పుస్తకం>, <ఫలానా వెబ్‌పేజీ> లో మూలంగా తీసుకున్నప్పుడు సమాచారం తెలిసింది.
మీరు ఆ పుస్తకాన్ని చదవనంత వరకూ దానినొక్క దానినే మూలాలలో ఉంచకూడదు. ఒక సారి మీరు ఆ పుస్తకాన్ని చదివేసినప్పుడు మాత్రం దానినొక్క దానినే మూలలలో ఉంచవచ్చు. కానీ వెబ్‌పేజీలో కూడా ఇంకొంచెం మంచి సమాచారం దొరుకుతుందని అనుకున్నప్పుడు పాఠకులకు దాని గురించి కూడా తెలుపవచ్చు. ఇలా:
*<ఫలానా పుస్తకం> (<ఫలానా వెబ్‌పేజి> కూడా చూడండి).
దీని వెనుక ప్రధాన ఉద్దేశం మీరు సేకరించిన సమాచారం మొత్తం, మీ పాఠకులు ఎటువంటి సందేహాలు లేకుండా జీర్నించేసుకోవడానికి.
 
 
<!-- interwiki -->
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:మూలాలు" నుండి వెలికితీశారు