ఆల్‍ఫ్రెడ్ నోబెల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==నోబెల్‌ పురస్కారం==
నేడు [[భౌతిక శాస్త్రము|భౌతిక]], [[రసాయన శాస్త్రము|రసాయన]], [[వైద్యశాస్త్రము|వైద్య]], [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]] శాస్త్రాలలోనే కాకుండా... [[సాహిత్యం]], శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ఈయన పేరుమీదన స్థాపించబడింది. ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ [[1895]] నాటి వీలునామా ప్రకారం [[1901]] లో ఈ పురస్కారం ప్రారంభించబడింది (నోబెల్‌ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ గౌరవార్ధం శాంతి బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్‌హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగాలలో విశేషమైన కృషి / పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు / పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/ఆల్‍ఫ్రెడ్_నోబెల్" నుండి వెలికితీశారు