టీ.జి. కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: బాలనాగమ్మ - Changed link(s) to బాలనాగమ్మ (1942 సినిమా)
చి Robot-assisted disambiguation: చంద్రవంక - Changed link(s) to చంద్రవంక (1951 సినిమా)
పంక్తి 49:
 
===సినిమాలు===
[[1939]] సంవత్సరంలో పుత్తూరులో [[వందేమాతరం (1939 సినిమా)|వందేమాతరం]] చిత్ర కథానాయకుడు [[చిత్తూరు వి.నాగయ్య]]కు ఘన సన్మానం ఏర్పాటైంది. ఆ సన్మానంలో కమలాదేవి తనకు ఇష్టమైన పాటను ప్రార్థనా గీతంగా పాడినప్పుడు నాగయ్య ఆ ప్రార్థనా గీతాన్ని విని, ఆమె ప్రతిభను గమనించి [[చెన్నై]] వెళ్ళాక [[బి.ఎన్.రెడ్డి]] తో కమలాదేవి గురించి చెప్పి సినిమాలకు సిఫార్సు చేశాడు. నాగయ్య మాటతో, బి.ఎన్.రెడ్డి ఈమెని మద్రాసుకి పిలిపించి పాత్ర ఇద్దామనుకున్నాడు. అయితే ఆ పాత్ర కమలాదేవి చేజారిపోయింది. కాని మరికొద్ది కాలానికే [[చూడామణి]] చిత్రంలో ఈమెకు అవకాశం వచ్చింది. చూడామణి చిత్రంతో [[1941]]లో వెండితెరమీద కనిపించిన కమలాదేవి, తరువాతి కాలంలో అనేక చిత్రాల్లో నటించి తన గానంతో, నటనతో ఆంధ్ర, తమిళ ప్రేక్షకులను మైమరిపించింది. ఈమె సినిమాలలో కథానాయకి పాత్ర ధరించకపోయినా, ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. [[తెనాలి రామకృష్ణ]] సినిమాలో నటించి [[హెచ్.ఎం.రెడ్డి]] ఆశీస్సులు పొందింది. [[దక్షయజ్ఞం]]లో రోహిణిగా, [[సీతారామ జననం]]లో అహల్యంగా నటించింది. అక్కినేని నాగేశ్వరరావు తొలిచిత్రం సీతారామ జననంలో ''నే ధన్యనైతిని రామా'' అనే పాట పాడిన ఈమెకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తరువాత ఈమె ''[[పార్వతీ కళ్యాణం]], [[గరుడ గర్వభంగం]], [[మాయలోకం]], [[ముగ్గురు మరాఠీలు]], [[పల్లెటూరు]], [[చక్రపాణి]], [[తోడుదొంగలు]], [[గుణసుందరి కథ]], [[మల్లీశ్వరి]], [[పాతాళభైరవి]], [[చంద్రవంక (1951 సినిమా)|చంద్రవంక]], [[పల్లెటూరు]]'' వంటి చిత్రాల్లో పాటలు పాడే పాత్రలు, గుర్తింపుగల పాత్రలు ధరించింది.
 
===రంగస్థలం===
"https://te.wikipedia.org/wiki/టీ.జి._కమలాదేవి" నుండి వెలికితీశారు