నిప్పులాంటి మనిషి (1974 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
imdb_id=0371010
}}
'''నిప్పులాంటి మనిషి''' 1974లో [[ఎస్. డి. లాల్]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. హిందీ చిత్రం ''జంజీర్'' ఆధారంగా నిర్మితమయ్యింది.<ref name="నిప్పులాంటి మనిషి చిత్ర సమీక్ష">{{cite journal|last1=ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|title=నిప్పులాంటి మనిషి చిత్ర సమీక్ష|journal=విశాలాంధ్ర|date=11 November 1974|page=3|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=41308|accessdate=24 October 2017}}</ref> అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజి తీసుకువచ్చిన జంజీర్, రామారావు రెండవ ఇన్నింగ్స్ కు మార్గం సుగమం చేసింది. హిందీలో అజిత్ పోషించిన పాత్రను తెలుగులో [[ప్రభాకరరెడ్డి]] పోషించాడు. ప్రాణ్ పాత్ర (షేర్ ఖాన్) సత్యనారాయణకు మంచి పేరు తెచ్చింది. మన్నాడె పాట ''యారి హై ఈమాన్ మెరి'' తెలుగులో స్నేహమే నా జీవీతంగా వచ్చి హిట్ పాటగా నిలిచింది. ఈ చిత్రం హిట్ ఐన తరువాత రామారావు అనేక రిమేక్ చిత్రాలలో నటించారు. (నేరం నాది కాదు ఆకలిది, [[మగాడు]], [[అన్నదమ్ముల అనుబంధం]], [[లాయర్ విశ్వనాథ్]], [[యుగంధర్]] మొదలైనవి)
==చిత్రకథ==
విజయ్ (రామారావు) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. చేతికి పురుగెత్తే గుర్రం బొమ్మ ఉన్న బ్రేస్లెట్ ధరించి ఉన్న వ్యక్తి తండ్రిని కాల్చి చంపడం రామారావుకు గుర్తు ఉంటుంది. పెద్దయ్యాక రామారావు పోలీసు ఆఫీసరు ఔతాడు. జగదీష్ ప్రసాద్ ([[ప్రభాకరరెడ్డి]]) చేసే దొంగ వ్యాపారాలకు అడ్డుఅవుతాడు. లక్ష్మి (లత) కత్తులకు సాన పెట్టే వృత్తితో జీవిస్తుంటే, రామారావు ఆసరా ఇస్తాడు. అతని వదిన ([[దేవిక]]) లక్ష్మికి విద్యాబుద్ధులు నేర్పించి వారితోనే ఉంచుకుంటుంది. వృత్తి పరంగా షేర్ఖాన్ ([[సత్యనారాయణ]]) తో గొడవపడి తర్వాత స్నేహితుడౌతాడు. మధ్యలో [[ప్రభాకరరెడ్డి]] కుట్రతో ఉద్యోగం నుండి సస్పెండ్ ఔతాడు. తండ్రిని చంపిన వ్యక్తిని కనిపెట్టి పగ తీర్చుకోవటం మిగతా కథ. అతనికి తన ముగ్గురు కొడుకుల్నీ కోల్పోయిన డేవిడ్ (రేలంగి) సహాయపడతాడు.