కొబ్బరి బొండాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
కాలేజీలో చదివే రాజు అమాయకుడు. స్నేహితులందరూ అతన్ని కొబ్బరి బోండాం అని ఏడిపిస్తూ ఉంటారు. మేఘమాల అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. సర్వనామం అనే వ్యక్తి యువకులకు హీరోలుగా చేస్తానని నమ్మించి క్రూరమైన బాక్సింగ్ ఆట ఆడించి అందులో వాళ్ళు దెబ్బలు తిని చనిపోతుంటే వీడియో తీసుకుని అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. మేఘమాల రాజు తనని పెళ్ళి చేసుకోవాలంటే తన అన్నయ్యను ఒప్పించమంటుంది. అతను తన చెల్లెల్ని పెళ్ళి చేసుకోవాలంటే ఉద్యోగం సంపాదించి దానితో పాటు ఐదు లక్షలు ఇవ్వమని అడుగుతాడు.
 
ఉద్యోగం సంపాదించడం కోసం సర్వనామం దగ్గరికి వెళతాడు రాజు. మేఘమాల అన్నయ్య రాజును ఇంట్లో పనులన్నింటికీ వాడుకుంటూ ఉంటాడు. సర్వనామం దొంగతనంగా తీసిన వీడియో క్యాసెట్లను వేరే వాళ్ళకు ఇచ్చి డబ్బులు వసూలు చేసే పని అప్పచెబుతాడు. కానీ సర్వనామం కొడుకు రాజును మోసం చేసి ఆ డబ్బును తస్కరిస్తాడు. సర్వనామం ఆ డబ్బు ఎలాగైనా కట్టమని రాజును నిలదీస్తాడు. రాజు ఏమీ చేయలేకపోవడంతో సర్వనామం రాజు తల్లిని పిలిచి అతను ప్రేమ విషయాన్ని చెప్పేస్తాడు. రాజు తల్లి అతన్ని నిలదీస్తుంది. డబ్బు కట్టే దాకా రాజు తల్లి తన దగ్గరే ఉంటుందని చెబుతాడు సర్వనామం. తన దగ్గర సూట్ కేసు డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఎవరని తెలిసినా వారిని ఏమీ చేయలేకపోతాడు రాజు. ఓ హస్తసాముద్రికం జ్యోతిష్కుడు చెప్పిన మాటలు విని లంకె బిందెలు కోసం పాత పుస్తకాలన్నీ చెబుతాడు. ఒక ప్రాంతం ఆచూకీ తెలుసుకుని సహాయం కోసం కాలేజీలో పనిచేసే ప్రొఫెసరు దగ్గరికి వెళతాడు. ఆయన ఒక మ్యాపు గీసిస్తాడు. రాజు దాన్ని వెతుక్కుంటూ వెళతాడు. అక్కడి లంకెబిందెలేవీ దొరకలేదు కానీ ఒక నాణెం దొరుకుతుంది. ప్రొఫెసరు ఆ నాణేన్ని పరిశీలించి అది మగధ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక అదృష్ట సూచకమైన నాణెమనీ, అది ఎవరి దగ్గర ఉంటే కొండంత ఆత్మ విశ్వాసం వస్తుందనీ చెబుతాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_బొండాం" నుండి వెలికితీశారు