కొబ్బరి బొండాం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
ఉద్యోగం సంపాదించడం కోసం సర్వనామం దగ్గరికి వెళతాడు రాజు. మేఘమాల అన్నయ్య రాజును ఇంట్లో పనులన్నింటికీ వాడుకుంటూ ఉంటాడు. సర్వనామం దొంగతనంగా తీసిన వీడియో క్యాసెట్లను వేరే వాళ్ళకు ఇచ్చి డబ్బులు వసూలు చేసే పని అప్పచెబుతాడు. కానీ సర్వనామం కొడుకు రాజును మోసం చేసి ఆ డబ్బును తస్కరిస్తాడు. సర్వనామం ఆ డబ్బు ఎలాగైనా కట్టమని రాజును నిలదీస్తాడు. రాజు ఏమీ చేయలేకపోవడంతో సర్వనామం రాజు తల్లిని పిలిచి అతను ప్రేమ విషయాన్ని చెప్పేస్తాడు. రాజు తల్లి అతన్ని నిలదీస్తుంది. డబ్బు కట్టే దాకా రాజు తల్లి తన దగ్గరే ఉంటుందని చెబుతాడు సర్వనామం. తన దగ్గర సూట్ కేసు డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఎవరని తెలిసినా వారిని ఏమీ చేయలేకపోతాడు రాజు. మేఘమాల కూడా అతన్ని హేళన చేస్తుంది. నిస్సహాయ స్థితిలో రాజు ఓ హస్తసాముద్రికం జ్యోతిష్కుడు చెప్పిన మాటలు విని లంకె బిందెలు కోసం పాత పుస్తకాలన్నీ చెబుతాడు. ఒక ప్రాంతం ఆచూకీ తెలుసుకుని సహాయం కోసం కాలేజీలో పనిచేసే ప్రొఫెసరు దగ్గరికి వెళతాడు. ఆయన ఒక మ్యాపు గీసిస్తాడు. రాజు దాన్ని వెతుక్కుంటూ వెళతాడు. అక్కడి లంకెబిందెలేవీ దొరకలేదు కానీ ఒక నాణెం దొరుకుతుంది. ప్రొఫెసరు ఆ నాణేన్ని పరిశీలించి అది మగధ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక అదృష్ట సూచకమైన నాణెమనీ, అది ఎవరి దగ్గర ఉంటే కొండంత ఆత్మ విశ్వాసం వస్తుందనీ చెబుతాడు.
 
ఆ నాణెం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో తన దగ్గర డబ్బు దొంగిలించిన దొంగలను మట్టి కరిపించి సర్వనామం కొడుకును నేరం ఒప్పుకునేలా చేస్తాడు. సర్వనామం తన కొడుకు డబ్బు దొంగిలించాడని ఒప్పుకోడు. సర్వనామాన్ని బెదిరించి తల్లిని తీసుకెళ్ళాలని చూస్తాడు రాజు. కానీ ఆమె మాత్రం అతనికివ్వాల్సిన డబ్బు ఇచ్చేసి తీసుకెళ్ళమని చెబుతుంది. ప్రొఫెసరు సలహాతో సర్వనామం దగ్గర్నుంచి తెలివిగా డబ్బు కొట్టేస్తాడు. ఆ దొంగతనాన్ని సర్వనామం కొడుకు మీదే నెట్టేస్తాడు. ఆ డబ్బుతో తన తల్లిని విడిపించుకుని తీసుకువచ్చి ప్రొఫెసరు ఇంట్లో ఉంచుతాడు. మేఘమాల అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఎలాగైనా అతని చెల్లెల్నిచ్చి పెళ్ళి చేయాల్సిందేనని పట్టుపడతాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_బొండాం" నుండి వెలికితీశారు