శ్రీమతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
హైదరాబాద్‌లో కాలేజీలో రవి, సరోజ, వెంకట్ చదువుతూ వుంటారు. రవి సాహిత్యాభిరుచి కలవాడు. తల్లి అప్పులు చేసి అవస్థలుపడి అతడిని చదివిస్తూ వుంటుంది. సరోజ లక్షాధికారి పరంధామయ్య ఏకైక పుత్రిక. సరోజ రవిని ప్రేమిస్తే, సరోజ సవతి తల్లి ప్రభావతి సరోజను తన తమ్ముడు శేషుకు ఇచ్చి పెళ్ళి చేయమని భర్తను కోరుతుంది. సరోజ హృదయం తెలుసుకున్న తండ్రి ఆమె వివాహం రవితోనే జరగాలనే నిర్ణయం స్పష్టంగా ప్రకటిస్తాడు.
 
శేషు తన స్నేహితుడు ఏకాంబరం ద్వారా సరోజకు పెళ్ళి అయిపోయినట్టు దొంగ శుభలేఖలు, ఫోటోలు సృష్టించి నమ్మిస్తాడు. రవి సరోజల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అందకుండా మాయం చేస్తాడు. సరోజ రవి దగ్గరనుంచి జవాబు లేకపోవడం చూసి రవి వూరికి స్వయంగా బయలుదేరుతుంది. శేషు ప్లాన్ ప్రకారం ఏకాంబరం రవిని, తల్లిని ఊరు దాటించి సరోజకు కూడా రవికి మరొకరితో పెళ్ళి అయినట్లు నమ్మిస్తాడు. సరోజ పెండ్లి విషయంలో తామూహించినంత మార్పు లేకపోవడం చూసి రవి చనిపోయినట్లు పత్రికలో ప్రకటన వేయిస్తాడు. ఈ మంత్రాంగం కూడా పారదు. వైరాగ్యంతో తండ్రిని ఒప్పించి రవి పేర ఒక అనాథ శరణాలయం నడుపుతుంది సరోజ.
 
వెంకట్ పాప అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె తండ్రి తిమ్మయ్యకు కూతుర్ని సినిమా స్టార్ చెయ్యాలనే పిచ్చి వుందని గ్రహించి తిమ్మయ్య చేత నాటకాల కంపెనీ పెట్టించి తాను డైరెక్టరుగా పాపతో ప్రేమాయణం సాగిస్తూ నాటకాలు ఆడుతూ వుంటాడు. ఊరూరు తిరుగుతూ వుండగా ఆత్మహత్య చేసుకోబోతున్న పద్మ అనే అమ్మాయిని కాపాడి రక్షిస్తాడు. ఆమె వీళ్ళతోనే వుండిపోతుంది.
 
సరోజ మరొకరిని పెళ్ళి చేసుకుందని నమ్మి మతిభ్రమణంతో రవి తిరుగుతూ వుంటాడు. తల్లి నానా అవస్థలు పడుతూ అతడిని చూచుకుంటూ వుంటుంది. వెంకట్ బృందానికి రవి కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న మిత్రుడు ఈ స్థితిలో వుండడం చూసి అతన్ని మామూలు స్థితికి తీసుకురావడానికి వెంకట్ పద్మ సహాయం కోరతాడు.
 
బీదవాడైన రవి పిచ్చివాడైపోతే దగా పడి సంఘంచే వెలివేయబడ్డ పతిత పద్మ ఓపికతో, కరుణతో రవికి పునర్జన్మ ఇస్తుంది. ప్రతిఫలంగా సంఘాన్ని సైతం ధిక్కరించి రవి తల్లి పద్మను కోడలుగా స్వీకరించడానికి సిద్ధపడ్డా పద్మ మాత్రం అంగీకరించదు. పద్మ శేష జీవితాన్ని అనాథల సేవలో గడుపుతుంది.
 
చివరకు శేషు ఆడిన కపటనాటకం బయట పడి సరోజకు, రవికి వివాహం అవుతుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీమతి" నుండి వెలికితీశారు