జె. వి. రాఘవులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[జె.వి.రాఘవులు]]''' ( జెట్టి వీర రాఘవులు ), తెలుగు [[సినిమా]] సంగీత దర్శకుడు. రాఘవులు [[తూర్పు గోదావరి]] జిల్లా, [[రామచంద్రాపురం]]లో మధ్య తరగతి రైతు కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో వీరాస్వామినాయుడు, ఆదిలక్షి దంపతులకు మూడవ సంతానంగా జన్మించాడు. అందరి కంటే కొంచెం హుషారెక్కువ. అమ్మ పాడే భక్తి పాటలను శ్రద్ధగా వింటుండేవాడు.మెల్లమెల్లగా అతనికి [[సంగీతము|సంగీతం]] అంటే మక్కువ మొదలైంది. ఈయన పక్క ఇంట్లో ఉండే వై.భద్రాచార్యులు గారి ద్వారా మొట్టమొదటిసారిగా [[హరిశ్చంద్రుడు|సత్యహరిశ్చంద్ర]] నాటకంలో లోహితాస్యుని పాత్రను పోషించే అవకాశం వచ్చింది.ఈ అవకాశాన్ని చాలా చక్కగా సమర్ధవంతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఓ పక్క చిన్న చిన్న వేషాలు వేస్తూనే, చదువును కొనసాగించారు. అలా మొత్తానికి ఎస్.ఎస్.ఎల్.సి పూర్తిచేసాడు. పై చదువులు చదవాలని ఉన్నా, చదివించే స్తోమత ఇంట్లొ వారికి లేదు. అందుకే [[కాకినాడ]]<nowiki/>లోని పి.ఆర్. కళాశాలలో పి.యు.సి.లో చేరి నెల రోజులకే మానేయాల్సి వచ్చింది.
 
ఓ రోజు ఉదయం [[రేడియో]] స్టేషనులో రాఘవులు పాట రికార్డింగ్ జరుగుతోంది. అక్కడే [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] గారితో పరిచయం ఏర్పడింది. [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] వద్ద సహాయకుడిగా ఆ రోజులలో నెలకు 100 రూపాయలకు సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవులు, తరువాత 1970లో [[రామానాయుడు]] దర్శకత్వం వహించిన [[ద్రోహి]] చిత్రంతో పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా [[తెలుగు సినిమాకుసినిమా]]<nowiki/>కు పరిచయమయ్యాడు. ఆ సమయంలోనే [[ప్రేమనగర్]] సినిమాలో "ఎవరికోసం ఈ ప్రేమ మందిరం" పాటకు ట్యూన్ చేసి ఇచ్చారు. తన అసిస్టంట్ పుహళేంది లేకపోతే ఏ పని చేయరు మహదేవన్. సరిగ్గా ఆ పాట సమయానికి పుహళేంది అందుబాటులో లేకపోవడంతో, [[దగ్గుబాటి రామానాయుడు|రామానాయుడు]] గారు ఈ పాటకు ట్యూన్ కట్టమని రాఘవులను కోరారు. పాట పూర్తి అయ్యాక ఇటు రామానాయుడు గారు అటు [[మహదేవన్]] గారు - ఇద్దరూ మెచ్చుకున్నారు. అలాగే ఈ సినిమాలో "మనసు గతి ఇంతే" పాటను కూడా ఈయనే స్వరపరిచారు. ఆ తరువాత 1973 వ సంవత్సరంలో [[శోభన్ బాబు]], [[వాణిశ్రీ]] కలిసి నటించిన [[జీవన తరంగాలు]] సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా [[విజయం]]<nowiki/>లో సంగీతం ప్రధాన భూమిక పోషించింది. ఈ సినిమా విజయంతో ఇక ఈయన వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరంలేకపోయింది. మొత్తం 172 సినిమాలకు సంగీతం సమకూర్చిన ఈయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో [[బొబ్బిలి పులి]], [[కటకటాల రుద్రయ్య]] వంటి చిత్రాలు ఉన్నాయి.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/జె._వి._రాఘవులు" నుండి వెలికితీశారు