దేవత (1965 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
* [[నగేష్]] (వరహాలు పగటికలలో సినీ దర్శకుడు)
* [[రాజబాబు]] (వరహాలు పగటికలలో అతని పీ.ఏ.)
 
==కథ==
ప్రసాద్ ఒక కాలేజీ లెక్చరర్. అతని భార్య సీత, కొడుకు మధు. సీత తన అత్త పార్వతమ్మను, మామ లోకాభిరామయ్యను కంటికి రెప్పలా చూసుకుంటూ వుంటుంది. ఒక సారి సీత అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి శేషయ్యను చూడటానికి వెళుతుంది. ఆమె ప్రయాణం చేస్తున్న రైలు ప్రమాదానికి గురవుతుంది. ప్రసాద్ సీతను రైల్వే హాస్పెటల్‌లో కనుగొంటాడు. డాక్టర్లు ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయిందని చెబుతారు. ప్రసాద్ ఆమెను ఇంటికి తీసుకువెళతాడు. ఆమె తన పేరు లలిత అని సీత కాదు అని అంటుంది. ప్రసాద్ ఆమెను సైకియాట్రిస్టుకు చూపిస్తాడు. సైకియాట్రిస్ట్ రుక్మిణి ఆమెను పరీక్షించి ఆమె కన్య అని, సీత కాదు, సీత మరణించి ఉంటుందని నిర్ణయిస్తుంది. ముసలివాళ్లైన ప్రసాద్ తల్లిదండ్రుల కోసం, అనారోగ్యంతో బాధ పడుతున్న మధు కోసం లలిత సీతలాగా నటించాల్సి వస్తుంది. ప్రసాద్ లలితను, ఆమె ప్రియుడు రమేష్‌ను కలపడానికి ప్రయత్నిస్తాడు. కానీ రమేష్ లలిత శీలాన్ని అనుమానిస్తాడు. శేషయ్య తాను చనిపోయే ముందు తన ఆస్తిని అంతా తన కుమార్తె సీత పేరుమీద వ్రాస్తాడు. ఇది అతని పెంపుడు కొడుకు జగన్నాథానికి కోపం తెప్పిస్తుంది. లలితను సీత అని భావించి ఆమెను మట్టుపెట్టడానికి జగన్నాథం కుట్ర పన్నుతాడు. ప్రసాద్ ఆమెను రక్షిస్తాడు. చివరకు లలిత ప్రసాద్‌నే పెళ్లి చేసుకుంటుంది.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/దేవత_(1965_సినిమా)" నుండి వెలికితీశారు