ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
సింగర్ అక్టోబర్ 27, 1811 న [[న్యూయార్క్ రాష్ట్రం|న్యూయార్క్]] రాష్ట్రంలోని పిట్ట్స్‌టౌన్లో జన్మించాడు. ఐజాక్ ఎనిమిది మంది సంతానంలో చివరివాడు. ఈయన తండ్రి ఆడమ్ సింగర్ [[జర్మనీ]]<nowiki/>కి చెందిన యూదు మతస్థుల సంతతని నమ్మకం. ఆయన స్వస్థలమైన ఫ్రాంక్‌ఫర్టులో [[హంగేరీ]] నుండి వలసవచ్చిన రెయిజింగర్ అనే [[కుటుంబము|కుటుంబం]] ఉండేది.<ref>http://www.sewalot.com/singer_history.htm</ref> ఐజాక్ చిన్నతనం నుండి యంత్రాలు, నాటకాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 12వ యేట ఇల్లు వదిలి చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించాడు.<ref>[http://www.pbs.org/wgbh/theymadeamerica/whomade/singer_hi.html PBS Who made America Series - Isaac Singer Profile]</ref> 19 యేళ్ల వయసులోను సహాయ యాంత్రికుడుగా పని ప్రారంభించాడు.<ref>http://www.britannica.com/EBchecked/topic/545806/Isaac-Merrit-Singer</ref>
 
1830లో[[1830]]లో ఐజాక్ 19 యేళ్ళ వయసులోనే పాల్మైరాకు చెందిన కాథరీన్ మరియా హేలీని పెళ్ళిచేసుకొన్నాడు. అప్పటికి ఆమె వయసు పదిహేనే. అత్తమామలతో పాటు కొన్నాళ్లు వెస్ట్‌చెస్టర్ కౌంటీలోని క్రోటన్స్ లాండింగ్లో నివసించాడు. 1834కల్లా ఐజాక్ కు ఒక కొడుకు (విలియం) పుట్టాడు మరియు పోర్ట్ గిబ్సన్లో ఒక సొంత ఇల్లు కొనుకున్నాడు. పగలు వివిధ పనులు చేస్తూ, రాత్రిళ్ళు నాటకాలు వేసేవాడు. [[1836]] కల్లా కుటుంబంతో పాటు న్యూయార్క్ నగరంలో నివసించడం ప్రారంభించాడు.
 
==మొదటి ఆవిష్కరణలు==