దూసి బెనర్జీ భాగవతార్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అవార్డులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
రంగస్థల నటుడు, భక్తిగీతాల [[గాయకుడు]], [[వ్యాఖ్యాత]], [[తబలా]] కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌.. ఇవన్నీ కలబోసి పోతపోసిన బహుముఖ ప్రజ్ఞాశీలి '''దూసి బెనర్జీ'''. హరికథా కళారూపం పేరు చెప్పగానే గుర్తొచ్చేది బెనర్జీయే. కాగా మంచినటుడిగా సుకుమార్‌ ఆర్కెస్ట్రా నిర్వహకుడిగా తెలిసేది కొందరికే. 1948లో కన్యాశుల్కం నాటకంలో వెంకటేశం పాత్రతో ప్రారంభమైన ఆయన నటజీవన ప్రస్థానం [[జె.వి.సోమయజులు]], [[జె.వి.రమణమూర్తి]] (నటరాజ్‌ కళాసమితి), రావికొండలరావుల శిష్యరికంలో ఎన్నో పాత్రలు ధరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన సొంత గ్రామం దూసి. అసలు పేరు కూర్మనాధశర్మ. [[తూర్పు భాగవతం]] పాడడం వల్ల సురేంద్రనాధ్‌ బెనర్జీ అని పిలిచేవారని గతంలో ఆయన 'న్యూస్‌టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 1946 నుంచి నాటకాల్లో వివిధ పాత్రలు వేశారు. [[కన్యాశుల్కం]] నాటకంలో వెంకటేశం పాత్రతో నటజీవితం ప్రారంభమైంది. 1955లో బండారు చిట్టిబాబు, [[రావి కొండలరావు]]<nowiki/>లతో కలిసి బెనర్జీ సుకుమార ఆర్కెస్ట్రాను ప్రారంభించారు. కొన్నాళ్లు [[ఖాదీ అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌|ఖాదీ]] పరిశ్రమలో ఉద్యోగం చేశారు. 1956లో [[బుర్రకథ]] ప్రదర్శనలు, 1970 నుంచి హరికథాగానం చేయడం ప్రారంభించారు.
 
==చిన్ననాటి నుంచే సంగీత సాధన==