వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 644:
 
తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖలోని డిజిటల్ మీడియా విభాగం సీఐఎస్-ఎ2కె అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నాయి. డిజిటల్ మీడియా విభాగ డైరెక్టర్ కొణతం దిలీప్ తో గత కొన్నాళ్ళుగా సీఐఎస్-ఎ2కె, తెలుగు వికీపీడియన్లు జరిపిన చర్చలు, సమాలోచనల ఫలితంగా ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అంశంపై గతంలో తెలుగు వికీపీడియాలో జరిగిన చర్చలు సముదాయానికి విదితమే. తెలంగాణలో వికీమీడియా ఉద్యమం అభివృద్ధిని ప్రోత్సాహకరంగా పనిచేయడం, అది కొనసాగడానికి మద్దతునివ్వడం, అంతర్జాలంలో తెలుగు, ఉర్దూ భాషల్లో సమాచారాన్ని అభివృద్ధి చేయడంలో కృషిచేయడం, తెలంగాణలో స్వేచ్ఛా విజ్ఞానాన్ని, దాన్ని అభివృద్ధి చేసే కార్యకలాపాలను పెంపొందించడం వంటివి దీని ప్రధాన లక్ష్యాలు. ప్రభుత్వం నుంచి విలువైన ఫోటోలను, అవసరమైన సమాచారాన్ని స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి తీసుకురావడం, ప్రభుత్వాధికారులకు (ప్రధానంగా పీఆర్వోలకు) స్వేచ్ఛా నకలు హక్కుల ప్రాధాన్యత, వికీమీడియా ప్రాజెక్టుల గురించి కార్యశాల నిర్వహించడం, పై లక్ష్యాలను సాధించేందుకు ఉమ్మడి కార్యప్రణాళిక రూపకల్పన చేయడం వంటివి చేపట్టనున్నాం. తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ సమక్షంలో సీఐఎస్-ఎ2కెని ప్రాతినిధ్యం వహిస్తూ సంస్థ కమ్యూనిటీ అడ్వొకేట్ పవన్ సంతోష్, ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ సంస్థ డైరెక్టర్ కొణతం దిలీప్ సంతకం చేశారు. కార్యక్రమంలో నాటకరంగ పరిశోధకుడు, వికీపీడియన్ ప్రణయ్ రాజ్ పాల్గొన్నారు. సూచనలు అందించిన వికీపీడియన్లకు, చర్చలకు సహకారం అందించినవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిజిటల్ మీడియా విభాగంతో ఈ భాగస్వామ్యాన్ని మరింత ఫలప్రదం చేసేందుకు, దీని నుంచి తెలుగు వికీపీడియా మౌలిక లక్ష్యాలకు లాభం కూర్చేందుకు సముదాయ సభ్యులు సూచనలు, సహకారం చేయాల్సిందిగా కోరుతున్నాం. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 03:42, 28 అక్టోబరు 2017 (UTC)
 
== మంగళగిరిలో తెలుగు వికీపీడియా పై అవగాహన మరియు శిక్షణ ==
 
నమస్కారం! సుమారు 100 మంది యువతీయువతులు పాల్గొంటున్న ఒక డిజిటల్ శిక్షణా శిబిరంలో వికీపీడియా మరియు తెవికీ పై అవగాహన మరియు శిక్షణనివ్వడానికి (స్వచ్ఛందంగా) నాకు ఆహ్వానం వచ్చింది. నాకు ఇచ్చిన సమయం తక్కువ కనుక శిక్షణ కంటే అవగాహన మీదే ఎక్కువ శ్రద్ద చూపాలనుకొంటున్నాను. ఈ శిక్షణలో భాగంగా తెవికీపై ఆసక్తితో ఎవరైన కొత్తవాడుకరులు వస్తే వారికి సముదాయ సభ్యులు మార్గదర్శకులుగా వుంటారని ఆశిస్తూ...--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 07:44, 28 అక్టోబరు 2017 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు