కాలాపానీ: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 29:
1965 లో భారత సైన్యానికి చెందిన జి. ఎస్. సేతు ([[వినీత్]]) తన అత్త పార్వతి ([[టబు]]) భర్త గోవర్ధన్ మేనన్ ([[మోహన్ లాల్]]) ను వెతుక్కుంటూ [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్ నికోబార్ దీవుల్లో]] ఒకటైన, ''రాస్ ఐలాండ్'' లో గల ''కాలాపానీ'' జైలుకు వెళతాడు. గోవర్ధన్ ను బ్రిటిష్ ప్రభుత్వం 1915లో ఈ జైలుకు పంపించి ఉంటుంది. అప్పటి దాకా జైల్లో బంధించి బడిన ఖైదీ వివరాలున్న ఓ పాత గదిలో గోవర్ధన్ కు సంబంధించిన ఫైలు అతనికి దొరుకుతుంది. అది చదివిన సేతుకు గోవర్ధన్ కథ తెలుస్తుంది. గోవర్ధన్ ఒక వైద్యుడు మరియు జాతీయవాది. స్వాతంత్రోద్యమ సమయంలో 55 మంది ప్రయాణిస్తున్న ఓ రైలును బాంబుతో పేల్చివేశాడని అతనిమీద అపవాదు వేసి అతన్ని జైలుకు పంపించేస్తారు. పార్వతితో అతని వివాహం జరిగిన రోజే అతన్ని అండమాన్ జైలుకు తీసుకెళ్ళిపోతారు. పార్వతి మాత్రం భర్త మళ్ళీ తిరిగి వస్తాడని ఎదురు చూస్తూనే ఉంటుంది.
 
కాలాపానీ జైలులో బంధించబడీన వందలమంది ఖైదీలు అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేని దుర్భర జీవితం గడుపుతుంటారు. వారిలో పేరు పొందిన స్వాతంత్ర సమరయోధులు కూడా ఉంటారు. డేవిడ్ బెర్రీ (అలెక్స్ వోల్ఫ్) ఐరిష్ జాతికి చెందిన ఒక కిరాతమైన జైలరు. లెన్ హట్టన్ (జాన్ కోల్వెంబాచ్) ఉదార హృదయుడైన ఓ వైద్యుడు. ప్రముఖ దేశభక్తుడు [[వినాయక్ దామోదర్ సావర్కర్|వీర సావర్కార్]] ని కూడా అదే జైలులో బంధించి చిత్ర హింసలు పెడుతుంటారు. కానీ ఆయన మాత్రం బంధీలను ఉత్తేజపరచడానికి తనవంతు కృషి చేస్తుంటాడు. డాక్టర్ లెన్ చర్యల వల్ల అక్కడి ఖైదీలు ఎదుర్కొంటున్న హింస ప్రభుత్వానికి తెలిసి విచారణకు ఆదేశిస్తుంది. 14 మందిని విడుదల చేస్తున్నట్లుగా ఉత్తర్వులు పంపిస్తుంది. వారిలో ఒకడు ముకుందన్ ([[ప్రభు]]). డేవిడ్ బెర్రీ, మరియు జైలు వార్డెన్ మీర్జా ఖాన్ ([[అమ్రీష్ పురి|అమ్రిష్ పురి]]) తో కలిసి విడుదల చేసిన ఖైదీలకు విషయం చెప్పకుండా వారిని పారిపోమని చెప్పి 13 మందిని కాల్చి చంపేస్తారు. ముకుందన్ మాత్రం పారిపోవడానికి సిద్ధంగా ఉండడు. అతన్ని చీఫ్ కమీషనర్ రమ్మంటున్నాడనే నెపంతో బలవంతంగా బయటకు తీసుకువచ్చి కాల్చేస్తారు. అతను గోవర్ధన్ కు స్నేహితుడు. స్నేహితుడి శవాన్ని చూసి ఉండబట్టలేని గోవర్ధన్ డేవిడ్ ను ఓ టవర్ పై నుంచి కిందికి తోసేస్తాడు. మీర్జా ఖాన్ ను గొంతు నులిమి చంపేస్తాడు. చివర్లో గోవర్ధన్ ను ఉరి తీస్తారు.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/కాలాపానీ" నుండి వెలికితీశారు