కళ్యాణ రాముడు (2003 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nagarani Bethi (చర్చ | రచనలు) చి వర్గం:హాస్య చిత్రాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 21:
| gross =
}}
'''[[కళ్యాణ రాముడు]]''' 2003 లో
== కథ ==
రాము (వేణు) పెళ్ళిళ్ళకు అన్ని ఏర్పాట్లు చేసే ఒక ''వెడ్డింగ్ ప్లానర్''. కళ్యాణ మండపం నిర్మించడం దగ్గర్నుంచి మండపాన్ని అలంకరించడం, సంగీత విభావరులు ఏర్పాటు చేయడం, వంటలు వండటం లాంటి అన్ని పనులూ చూస్తుంటాడు. అలా అతను ఏర్పాట్లు చేస్తున్న ఓ పెళ్ళిలో పెళ్ళికొడుకు తన కిష్టమైన అమ్మాయిని [[పెళ్ళి]] చేసుకోవడానికి పారిపోతాడు. పెళ్ళి కూతురు మాటలు రాని అమ్మాయి. దాంతో వాళ్ళ బంధువుల్లో కూడా ఆమెను పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ ముందుకురారు. అప్పుడు రాము ముందుకు వచ్చి డాక్టరైన తన అన్నను (రాజా రవీంద్ర) ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకునేలా ఒప్పిస్తాడు. అదే సమయంలో పెళ్ళి కూతురు చెల్లెలు కళ్యాణి (నిఖిత) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది కానీ అతన్ని ఆటపట్టించడం కోసం తన బావయైన రాజేష్ (ప్రభుదేవా) ను ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. ఆమెను మనస్ఫూరిగా ప్రేమించిన రాము రాజేష్ ను ఏదో విధంగా దూరం చేయాలని రకరకాలుగా ప్రయత్నించి భంగపడుతుంటాడు. వాళ్ళిద్దది ప్రేమను గురించి తెలుసుకున్న రాజేష్ అసలు విషయం చెప్పడంతో రాము ఊపిరి పీల్చుకుంటాడు.
అందరూ కలిసి రాము కల్యాణి పెళ్ళిని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో కల్యాణి అక్క అకస్మాత్తుగా మరణిస్తుంది. ఒక జ్యోతిష్కుడు రాము కుటుంబానికి ఓ శాపం ఉందనీ, అందువల్ల ఆ ఇంట్లోకి కోడలుగా వెళ్ళిన వాళ్ళు చిన్న వయసులోనే చనిపోతున్నారని చెబుతాడు. దాంతో కల్యాణి తండ్రి తన కూతుర్ని రాముకిచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరించడు. చివరికి రాము ఆయన్ను ఒప్పించి కల్యాణి ఎలా పెళ్ళి చేసుకున్నాడన్నది మిగతా కథ.
|