రామేశ్వర్ ఠాకూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
'''రామేశ్వర్ ఠాకూర్''' (28 జూలై 1927<ref>[https://web.archive.org/web/20070512184020/http://ws.ori.nic.in:80/ola/gov_biodata.html Profile on Odisha Govt website]</ref> – 15 జనవరి 2015) [[బీహారు]] రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, [[భారత జాతీయ కాంగ్రేసు]] పార్టీ అగ్ర రాజకీయనాయకుడు మరియు కేంద్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి. 2004 నుండి 2011 వరకు వరుసగా, [[ఒడిశా]], [[ఆంధ్రప్రదేశ్]], [[కర్ణాటక]] మరియు [[మధ్యప్రదేశ్]] రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. వృత్తిరీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ఐన ఠాకూర్, 1966 నుండి 1967 వరకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాకూడా పనిచేశాడు.
 
== జీవితచరిత్ర ==
ఠాకూర్, [[ఝార్ఖండ్]] రాష్ట్రంలోని [[గొడ్డా|గొడ్డా జిల్లా]], ఠాకూర్ గంగ్తీ గ్రామంలో జన్మించాడు. భగల్పూరులో[[భగల్‌పూర్|భగల్పూరు]]లో బి.ఏ చేసి, పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ పట్టభద్రుడై, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి పూర్తిచేశాడు. ఆ తరువాత ఛార్టర్డ్ అకౌంటెంటు అయ్యాడు. ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆరు నెలలు సంతాల్ పరగణాలోని రాజ్‌మహల్ హిల్స్‌లో అజ్ఞాతవాసం గడిపాడు. స్వాతంత్ర్య పోరాటానికి సంబంధంగా 1946లో అరెస్టయ్యి, కలకత్తాలోని[[కలకత్తా]]లోని డమ్‌డమ్ కేంద్రకారాగారంలో ఖైదీగా ఉన్నాడు.<ref>[http://legislativebodiesinindia.gov.in/States/Andhra%20pradesh/govr.htm Profile on Andhra Pradesh Govt website]</ref>
 
==గవర్నరుగా==
రామేశ్వర్ ఠాకూర్ 2004 నుండి 2006 దాకా [[ఒడిషా|ఒడిశా]] గవర్నరుగా, 2006 నుండి 2007 వరకు [[ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్లు|ఆంధ్రప్రదేశ్ గవర్నరుగాగవర్నరు]]గా, 2007 నుండి 2009 వరకు కర్నాటక[[కర్ణాటక]] గవర్నరుగా, ఆ తర్వాత 2009 నుండి 2011 వరకు [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్]] గవర్నరుగా పనిచేశాడు.
 
ఠాకూర్ 2007, ఆగష్టు 21న కర్ణాటక రాష్ట్ర 15వ గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశాడు.<ref>Vicky Nanjappa, [http://www.rediff.com/news/2007/aug/22guv.htm "Karnataka: Rameshwar Thakur takes charge as governor"], Rediff.com, August 22, 2007.</ref> కర్ణాటక గవర్నరుగా ఉండగా, తన సొంత పార్టీ అయిన కాంగ్రేసుకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడనే అభియోగం ఎదుర్కొన్నాడు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ధరమ్ సింగ్, చట్టవ్యతిరేకంగా వ్యవసాయ భూమిలో ఇనుప ఖనిజాన్ని త్రవ్వేందుకు అనుమతి మంజూరు చేసి, రాష్ట్ర ఖజానాకు తీవ్రనష్టం కలుగజేశాడని లోకాయుక్త నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో నష్టాన్ని భర్తీ చేయటానికి ధరం సింగ్ నుండి 36 కోట్లు వసూలు చేయాలని సిఫారసు చేసింది. అయితే, రామేశ్వర్ ఠాకూర్ పదవి నుండి తొలగేముందు, ధరం సింగ్‌పై ఉన్న అభియోగాలన్నీ మాఫీ చేశాడు.తన మిగిలిన గవర్నరు గడవుకు ఈయన 2009, జూన్ 24న మధ్యప్రదేశ్ కు గవర్నరుగా బదిలీ అయ్యాడు. బలరాం జక్కర్ పర్యాయం ముగిసిన తర్వాత జూన్ 30న, ఆయన స్థానంలో రామేశ్వర్ ఠాకూర్ పదవి చేపట్టి సెప్టెంబరు 7, 2011 దాకా పదవిలో ఉన్నాడు.<ref name="newsone">{{cite news|url=http://www.inewsone.com/2011/09/08/new-madhya-pradesh-governor-sworn-in/74560|title=New Madhya Pradesh governor sworn-in|last=|first=|date=2011-09-08|work=[[Indo-Asian News Service|IANS]]|publisher=[[iNewsOne]]|accessdate=2011-09-08}}</ref>
పంక్తి 23:
1998 నవంబరు నుండి 2001 నవంబరు వరకు. మరళా 2004 నవంబరు తర్వాత భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
 
రామేశ్వర్ ఠాకూర్ 2015, జనవరి 15 న ఢిల్లీలో[[ఢిల్లీ]]లో మరణించాడు.<ref>{{cite web|url=http://odishasamaya.com/news/former-odisha-governor-rameshwar-thakur-passes-away|title=Former Odisha Governor Rameshwar Thakur passes away|accessdate=16 January 2015|publisher=OdishaSamay|archiveurl=https://web.archive.org/web/20150205232801/http://odishasamaya.com/news/former-odisha-governor-rameshwar-thakur-passes-away|archivedate=5 February 2015|deadurl=yes}}</ref>ఈయన భార్య నర్మదా ఠాకూర్. ఈయన ఇద్దరు కుమారులు (సుషీల్, అనిల్), ఇద్దరు కుమార్తెలు (మృదుల, సంగీత).
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రామేశ్వర్_ఠాకూర్" నుండి వెలికితీశారు