ఎ.ఆర్.కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అడుసుమిల్లి రాధాకృష్ణశాస్త్రి''' (ఎ.ఆర్.కృష్ణ) ([[నవంబర్ 13]], [[1926]] - [[నవంబర్ 10]], [[1992]]) ప్రముఖ నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. 1954లో [[హైదరాబాదు]]లో [[ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం]] ను స్థాపించి రాష్ట్రంలో నాటకాల అభివృద్ధికి విశేష కృషిచేశాడు<ref>[http://dspace.vidyanidhi.org.in:8080/dspace/bitstream/2009/1111/5/UOH-2003-194-4.pdf Telugu Theatre: Politics Of Representation]</ref>. ఆధునిక తెలుగు సామాజిక నాటకానికి కృష్ణ ఆద్యునిగా భావిస్తారు.<ref>[http://www.hindu.com/thehindu/fr/2008/11/21/stories/2008112150080200.htm Stage act] - The Hindu 21/11/2008</ref>.
 
== జననం - విద్యాభ్యాసం ==
ఎ.ఆర్.కృష్ణ, [[1926]] [[నవంబర్ 13]]న [[గుంటూరు]] జిల్లా [[పెరవలి]] గ్రామములో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం [[శ్రీకాకుళం]], [[బెజవాడ]], [[చల్లపల్లి]], [[మచిలీపట్నం]] [[హైదరాబాదు]]లలో జరిగింది. యల్.యం.ఇ చదువుతున్నపుడే [[హైదరాబాదు విమోచనోద్యమం]]లో పాల్గొన్నాడు. అజ్ఞాతవాసమునుండి బయటకువచ్చి [[సోషలిస్ట్ పార్టీ]] కార్యకలాపాలలో పాల్గొన్నాడు.

== 1948నాటికిరంగస్థల రాజకీయప్రస్థానం ==
1948నాటికి రంగంరాజకీయరంగం మీద [[వ్యామోహం]] విడనాడి నాటక రంగంలో ప్రవేశించాడు. 1952నాటికి పూర్తిగా నాటక రంగానికి అంకితమై వినూత్నమైన ప్రయోగాలు చేయాలన్న తపన బయలుదేరింది. జీవిక నిమిత్తం రాష్ట్ర విద్యుత్ బోర్డులో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. [[యునెస్కో]] ఆంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధసంస్థగా [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] భారతీయ నాట్య సంఘాన్ని స్థాపించారు. ఆమె ప్రోద్బలంతో కృష్ణ 1952లో "[[ఇండియన్ నేషనల్ థియేటర్]]" నెలకొల్పాడు. 1953లో "దేశం కోసం" నాటక ప్రదర్శన వెల్లువ సృష్టించాడు. 1955లో ఢిలీలో జరిగిన భారతీయ నాట్యసంఘ సమావేశములో ఉపన్యాసమిచ్చి ఆ సంఘపు సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]], నాటక కళల విభాగానికి సభ్యునిగా పనిచేశాడు<ref>http://www.andhrauniversity.info/arts/theatrearts/index.html</ref>.
 
1954 అక్టోబరు 1న ఆంధ్రప్రదేశ్ నాట్యసంఘాన్ని స్థాపించి దాని శాఖలను ప్రతిజిల్లాకు వ్యాపింపచేశాడు. ఈ నాట్య సంఘంలో ఇండియన్ నేషనల్ థియేటర్, కళామండలి, సాధనసంఘం, నాట్యకళానికేతన్, నవకళాకేంద్రం సమాజాలు అంతర్భాగమయ్యాయి. 1957లో [[కుందుర్తి ఆంజనేయులు]] రాసిన వచన కవిత్వ నాటకం "ఆశ" ప్రదర్శించాడు. 1959లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పదవీ బాధ్యతలు చేపట్టాడు. [[అబ్బూరి రామకృష్ణారావు]] పరిచయం మరియు సహచర్యం కృష్ణకు ఎంతగానో ఉపకరించాయి. "రంగస్థల శాస్త్రం" అనే మహోన్నత గ్రంథాన్ని వెలువరించాడు. కృష్ణ ఆధ్వర్యంలో నాట్యసంఘం అపూర్వమైన సేవలు చేసింది. పరభాషలలో పేరొందిన నాటకాలను అనువదింపచేసి ప్రదర్శించేవాడు. నాటకాలను జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ప్రదర్శించి అత్యుత్తమ ప్రదర్శనగా ఎంపికైన నాటకాన్ని ఢిల్లీ ఉత్సవాలలో ప్రవేశం కల్పించేవాడు. నాటకరంగానికి సంబంధించిన వివిధ అంశాలలో కళాకారులకు శిక్షణ ఇప్పించేవాడు. నాట్యసంఘం సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు నిర్వహించేది. చర్చలు, గోష్టులు నిర్వహించేది. రాష్ట్రేతర ప్రాంతాలనుండి ప్రముఖ నాటకసమాజాలను ఆహ్వానించి వారిచే ప్రదర్శనలు ఇప్పించేది. నాట్యసంఘం 15వ వార్షికోత్సవాన్ని 33 రోజుల పాటు రాష్ట్రమంతటా జరిపించాడు. నాటకాలమీద వినోదపు పన్ను రద్దు చేయించాడు. ఈర్ష్య, అసూయల కారణంగా నాట్యసంఘం 1973లో పతమనమయ్యింది.
"https://te.wikipedia.org/wiki/ఎ.ఆర్.కృష్ణ" నుండి వెలికితీశారు