"ఏడిద నాగేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
|signature =
}}
'''[[ఏడిద నాగేశ్వరరావు]]''' ([[ఏప్రిల్ 24]], [[1934]] - [[అక్టోబరు 4]], [[2015]]) ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. [[పూర్ణోదయ మూవీ క్రియేషన్స్]] (Poornodaya Movie Creations) అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.
 
==బాల్యం==
 
== రంగస్థల ప్రస్థానం ==
[[కాకినాడ (గ్రామీణ)|కాకినాడ]] మెటలారిన్‌ హైస్కూల్‌లో ఫిఫ్త్‌ ఫారమ్‌ చదువుతుండగా స్కూల్‌ వార్షికోత్సవంలో లోభి నాటకంలో తొలిసారిగా ఏడిద అమ్మాయి వేషం వేశారు. దానికి సిల్వర్‌ మెడల్‌ను కూడా అందుకున్నారు. ఆ నటనకు రజతపతకం సాధించిన ఉత్సాహంతో ‘విశ్వభారతి, ‘పరివర్తన’, ‘ఓటు నీకే’వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. ఆ తర్వాత విజయనగరంలో ఇంటర్‌మీడియట్‌ చదువుతుండగా ‘కవిరాజు మెమోరియల్‌ క్లబ్‌’లో కొన్ని నాటకాలు ఆడారు. [[పిఠాపురం]] రాజాస్‌ కాలేజీలో బి.ఎ. ఎకనామిక్స్‌లో చేరిన నాగేశ్వరరావుకు అక్కడే ప్రముఖ దర్శకనిర్మాత [[వి.బి.రాజేంద్రప్రసాద్‌]] పరిచయమయ్యారు. [[వి.బి.రాజేంద్రప్రసాద్]], నటులు [[హరనాథ్]], [[మాడా]], [[కె.కె.శర్మ]], వడ్డాది సూర్యనారాయణమూర్తిల తో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థని ప్రారంభించిపలు [[నాటకాలు]] ప్రదర్శించి నటించారు. 26 ఏళ్ళ వయసులో నాగేశ్వరరావు ‘కప్పలు’ నాటకంలో వృద్ధ పాత్ర పోషించి మెప్పించినందుకుగానూ ఆయనకు పరిషత్‌ పోటీలలో బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వచ్చింది.
 
==కుటుంబం==
1962 నుంచి 1974 మధ్య కాలంలో సుమారు 30 సినిమాల్లో నటించారు. వంద చిత్రాలకి పైగా డబ్బింగ్‍ చెప్పారు. ఆ తర్వాత కాకినాడకి చెందిన భాస్కరరెడ్డి, రామకృష్ణారెడ్డి, లచ్చిరెడ్డి, వీర్రాజులతో కలిసి ‘వెంకటేశ్వర కల్యాణం’అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ సినిమాకి లాభాలు రావడంతో ఆ నలుగురూ కలిసి గీతాకృష్ణ కంబైన్స్ అనే సంస్థని ప్రారంభించి నిర్మాణ సారథ్య బాధ్యతల్ని ఏడిద నాగేశ్వరరావుకి అప్పగించారు.
 
‘నేరము శిక్ష’లో నటించడంతో ఆ చిత్ర దర్శకుడు [[కె. విశ్వనాథ్]]తో పరిచయం ఏర్పడింది. ఆయనతో [[సిరి సిరి మువ్వ]] సినిమాని నిర్మించారు. అది విజయం సాధించింది. తర్వాత తన బంధువులతో కలిసి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ స్థాపించారు. తొలి ప్రయత్నంగా [[కొమ్మినేని శేషగిరిరావు]] దర్శకత్వంలో [[తాయారమ్మ బంగారయ్య]]ను నిర్మించారు. అందులో [[చిరంజీవి]] ప్రతినాయక ఛాయలున్న ఓ చిన్న పాత్రని పోషించారు. ఆ సినిమా విజయం సాధించడంతోపాటు [[తమిళం]], హిందీ భాషల్లోనూ రీమేక్‍ అయ్యింది. నిర్మాణ సారథిగా ఒక విజయాన్ని, నిర్మాతగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడో సినిమా కోసం మళ్లీ కె.విశ్వనాథ్‍ని సంప్రదించి [[శంకరాభరణం]] నిర్మించారు. ఇక ఆ చిత్రం తర్వాత వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. [[సీతాకోక చిలుక]], [[స్వాతిముత్యం]], [[సితార]] చిత్రాలకి వివిధ విభాగాల్లో జాతీయ పురస్కారాలు లభించాయి. ‘స్వాతిముత్యం’ తెలుగు నుంచి ఆస్కార్‍ నామినేషన్లకు ఎంపికైంది. చాలా సినిమాలకు వివిధ విభాగాల్లో నంది పురస్కారాలు వరించాయి. చివరిగా ‘ఆపద్బాంధవుడు’చిత్రాన్ని నిర్మించారు ఏడిద నాగేశ్వరరావు.
 
==వృత్తి==
నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. [[నంది పురస్కారాలు|నంది పురస్కారాల]] కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.
 
==మరణం==
1,91,582

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2248370" నుండి వెలికితీశారు