"తేజ" కూర్పుల మధ్య తేడాలు

2,996 bytes added ,  3 సంవత్సరాల క్రితం
(ఈనాడు మూలం)
'''తేజ ''' గా పిలువబడే '''ధర్మ తేజ ''' ఒక ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు మరియు [[రచయిత]].<ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|last1=వట్టికూటి|first1=చక్రవర్తి|title=నాలుగంతస్తుల నుంచి నడిరోడ్డు మీదకు...|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=16997|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=30 October 2017|archiveurl=https://web.archive.org/web/20171030171405/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=16997|archivedate=30 October 2017|location=హైదరాబాదు}}</ref>
==నేపథ్యము==
1960వ దశకంలో తేజ కుటుంబం బాగా కలిగిన కుటుంబం. నాలుగంతస్తుల పెద్ద ఇల్లు వారిది. తండ్రి జె. బి. కె. చౌదరి కొరియా, జపాన్ దేశాలకు [[బెరైటీస్]], [[మైకా]], తిరుమల నుంచి వెంట్రుకలు మొదలైనవి ఎగుమతి వ్యాపారం చేసేవాడు. తేజ బాల గురుకుల పాఠశాలలో చదివాడు. సినీ నటి జీవిత, ప్రముఖ నృత్య దర్శకురాలు సుచిత్ర చంద్రబోస్ ఈయన ఒకే తరగతిలో చదువుకున్నారు. దర్శకుడు శంకర్ ఈయనకు సీనియరు. తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో నాయనమ్మ పర్వతవర్ధనమ్మ పర్యవేక్షణలో పెరిగాడు. ఆమె ఇతనికి రామాయణ, మహాభారత, భాగవతాలను కథలుగా చెప్పేది.
 
తండ్రి వ్యాపారం దెబ్బతినడంతో కుటుంబం రోడ్డున పడింది. దాంతో తేజ బంధువుల ఇళ్ళలో ఉంటూ బతుకు తెరువు కోసం సినిమా ఆఫీసుల్లో చిన్న చితకా పనులు చేస్తుండేవాడు. తర్వాత చెన్నై నుంచి హైదరాబాదు వచ్చాడు. కొద్ది రోజులు పోస్టరు ఇన్ చార్జిగా పనిచేశాడు. తర్వాత కెమెరా సహాయకుడిగా పనిచేశాడు. దర్శకుడు [[టి. కృష్ణ]] ఇతన్ని బాగా చూసుకునే వాడు. ఛాయా గ్రాహకులు రవికాంత్ నగాయిచ్, ఎస్. గోపాల రెడ్డి, మహీధర్ దగ్గర కొద్ది రోజులు సహాయకుడిగా పనిచేశాడు. రాం గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడి శివ సినిమాకు మొదటి నుంచి చివరి వరకు అనేక విభాగాల్లో పనిచేశాడు. వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి సినిమాతో ఛాయాగ్రాహకుడిగా మారాడు. తర్వాత అదే హోదాలో అంతం, మనీ సినిమాలకు కూడా పనిచేశాడు.
 
==సినీ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2249684" నుండి వెలికితీశారు